STOCKS

News


52-వారాల కనిష్టానికి 60 షేర్లు

Monday 26th November 2018
Markets_main1543221217.png-22390

సూచీలు మిడ్‌సెషన్‌ సమయానికి లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., ఎన్‌ఎస్‌ఈలో 60 షేర్లు మాత్రం 52-వారాల కనిష్టానికి పతనమయ్యాయి. కోల్‌ ఇండియా, వేదాంత, బీఎఎస్‌ఎఫ్‌ ఇండియా, ఆంధ్రా సిమెంట్స్‌, హెక్సావేర్‌ టెక్నాలజీస్‌, ఎన్‌టీపీసీ, పీజీ ఎలక్ట్రోపాస్ట్‌ షేర్లు తమ ఏడాది కనిష్ట స్థాయికి క్షీణించాయి. వాటితో పాటు ఆమ్టెక్‌ అటో, ఆధునిక్‌ మెటాలిక్స్‌, గణేష్‌ హౌసింగ్ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌, క్యాపిటల్‌ ట్రస్ట్‌, నెట్‌వర్క్‌ 18 మీడియా&ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఇండియా గ్లైకోల్స్‌, సింటెక్స్‌ ప్లాస్టిక్‌ టెక్నాలజీస్‌ షేర్లు కూడా తాజాగా 52-వారాల కనిష్టానికి చేరకున్నాయి. ఇక మార్కెట్‌ విషయానికొస్తే మిడ్‌సెషన్‌ వరకు జరిగిన ట్రేడింగ్‌లో సూచీలు తీవ్ర లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 200 పాయింట్లను, నిఫ్టీ 70 పాయింట్ల లాభాలను ఆర్జించాయి. ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో అంతర్జాతీ మిశ్రమ సంకేతాలతో సూచీలు ప్రారంభలాభాల్ని కోల్పోయాయి. ఓ దశలో నిఫ్టీ 10500 దిగువకు, సెన్సెక్స్‌ 35వేల దిగువకు చేరుకున్నాయి. అయితే హెవీ వెయిటేజీ షేర్ల ర్యాలీతో మిడ్‌సెషన్‌ సమయానికి సూచీలు తిరిగి లాభాల్లో మళ్లాయి. మధ్యాహ్నం 1:30ని.లకు సెన్సెక్స్‌ 246 పాయింట్ల లాభంతో 35,227 వద్ద, నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 10,591 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌లో మెటల్‌, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంకు సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎఫ్‌ఎంజీసీ, ప్రైవేట్‌, ఆర్థిక, అటో రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

డిసెంబర్‌ సిరీస్‌ కోసం 10 సిఫార్సులు

Monday 26th November 2018

ముంబై: నవంబర్‌ ఎఫ్‌ అండ్‌ ఓ సిరీస్‌ ముగింపు కారణంగా ఈ వారంలో ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని టెక్నికల్‌ అనలిస్టులు భావిస్తున్నారు. నిఫ్టీ 10,700 పాయింట్ల కీలక మద్దతు స్థాయిని ఈ సిరీస్‌లో నిలుపుకోలేకపోయిందని, 10,774 పాయింట్ల సింగ్‌హై నుంచి 10,500 స్థాయికి పతనమైందని విశ్లేషించారు. 10,650 పాయింట్ల దిగువన ఉన్నంతవరకు అప్‌సైడ్‌ మూవ్‌ పరిమితంగానే ఉంటుందని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ చందన్ తపరియా అన్నారు. ప్రస్తుతం

నష్టాల బాటలో మెటల్‌ షేర్ల పయనం

Monday 26th November 2018

మిడ్‌సెషన్‌ సమయానికి సూచీలు ప్రారంభ లాభాల్ని కోల్పోయి పరిమితి శ్రేణిలో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ ‍క్రమంలో మెటల్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ ధరలు పెరుగుతున్ననేపథ్యంలో రానున్న రోజుల్లో కంపెనీల మార్జిన్లు తగ్గవచ్చనే అంచనాలతో మెటల్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 3శాతానికి పైగా నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(3,214)తో పోలిస్తే

Most from this category