STOCKS

News


40 షేర్లు.. 52వారాల కనిష్టానికి...

Wednesday 29th August 2018
Markets_main1535523951.png-19757

ముంబై:- ఆసియా మార్కెట్ల నుంచి అందతున్న మిశ్రమ ఫలితాల నేపథ్యంలో బుధవారం ఉదయం దేశీయ మార్కెట్‌ పరిమిత శ్రేణిలో ట్రేడ్‌ అవుతోంది. ఉదయం గం.11:30ని.లకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 38898 వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల స్వల్పనష్టంతో 11,734 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. మార్కెట్‌ బడిదుడుకుల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో 40 షేర్లు 52-వారాల కనిష్టానికి పతనయ్యాయి. వాటిలో కామ్లిన్‌ ఫిన్‌ సైన్సెన్స్‌, ధనలక్ష్మీ బ్యాంకు, ఈ-క్లారెక్స్‌ సర్వీసెస్‌, ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్చన్స్‌, జై ఇన్ప్రాటెక్‌, మెక్‌నల్లీ భారత్‌ ఇంజనీరింగ్స్‌, యూనిటెక్‌, వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు తాజా ఎన్‌ఎస్‌ఈలో 52-వారాల కనిష్టానికి పతనయ్యాయి. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలోని ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ-50లోని మొత్తం 50 షేర్లకు గానూ 26 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 24షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. రంగాల వారీగా చూస్తే ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాలకు చెందిన సూచీలు తప్ప, మిగతా అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. యూపీఎల్‌, యస్‌బ్యాంకు, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, గ్రాసీం షేర్లు టాప్‌ -5 గెయినర్లుగా ట్రేడ్‌ అవుతుండగా, ఐషర్‌ మోటర్స్‌, ఇండియన్‌బుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, కోల్‌ ఇండియా షేర్లు టాప్‌-5 లూజర్లుగా ట్రేడ్‌ అవుతున్నాయి. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, అదానీ పవర్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, జై ప్రకాష్‌ అసోసియేట్స్‌, సుజ్లాన్‌ ఎనర్జీ, జై ఇరిగేషన్స్‌ షేర్లు అత్యధికం వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్‌ అవుతున్నాయి.


NSE

You may be interested

ఈ షేర్లలో ఎంఏసీడీ నెగిటివ్‌ క్రాసోవర్‌

Wednesday 29th August 2018

దేశీయ సూచీలు ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. బుధవారం ట్రేడింగ్‌లో అడ్వాన్స్‌ డిక్లైన్‌ నిష్పత్తి క్రమంగా బేర్స్‌కు అనుగుణంగా కనిపిస్తోంది. మంగళవారం ముగింపు ప్రకారం 32షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారినకంపెనీల్లో పీసీ జువెల్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, పీటీసీ ఇండియా, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, హెచ్‌యూఎల్‌, మీర్జా ఇంటర్నేషనల్‌, ఏసీసీ

ఎల్‌ఐసీ వాటా పెంచుకున్న స్టాక్స్‌ ఇవే..

Wednesday 29th August 2018

దేశీ అతిపెద్ద ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) గత ఏడాది కాలంలో పలు స్టాక్స్‌లో వాటాలను పెంచుకుంది. ఏసియన్‌ పెయింట్స్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, క్యాస్ట్రోల్‌ ఇండియా, క్రిసిల్‌, హిందుస్తాన​ యూనిలివర్‌, ఇక్రా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌, పీఅండ్‌జీ హైజెనీ అండ్‌ హెల్త్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ స్టాక్స్‌లో ఎల్‌ఐసీ వాటాలు పెంచుకుంది. ఈ జాబితాలోని చాలా స్టాక్స్‌ వాటి పరిశ్రమ సగటుతో

Most from this category