News


ఈ కంపెనీల దిశ మారింది!

Wednesday 20th February 2019
Markets_main1550602477.png-24260

డిసెంబర్‌ త్రైమాసికం ఫలితాల్లో 43 కంపెనీలు టర్న్‌ అరౌండ్‌ అయిన సంకేతాలు ఇచ్చాయి. అంటే ఓ కంపెనీ కొన్ని త్రైమాసికాలుగా నష్టాల్లో ఉండి అనంతరం లాభాల్లోకి అడుగుపెట్టడాన్ని టర్న్‌ అరౌండ్‌గా చెబుతారు. ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంకు, ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌, సిండికేట్‌ బ్యాంకు, డిష్‌ టీవీ, ఓబీసీ, బిర్లా కార్ప్‌, ఐనాక్స్‌ విండ్‌, ఆస్ట్రా జెనెకా ఫార్మా తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఈ కంపెనీల్లో చాలా వరకు గత ఏడాది కాలంలో 60 శాతం వరకు షేర్‌ ధరలు దిద్దుబాటుకు గురయ్యాయి. దీంతో ఈ కంపెనీల రేటింగ్‌పై ఇన్వెస్టర్లు దృష్టి సారించొచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.

 

‘‘చారిత్రకంగా చూస్తే... కంపెనీలు వరుసుగా రెండు త్రైమాసికాల్లో సానుకూల ఫలితాలను ప్రకటించినప్పుడు ఆ స్టాక్‌కు మార్కెట్లో రీరేటింగ్‌ జరుగుతుంది. కానీ, ఒక్క త్రైమాసికంలోనే సానుకూల ఫలితాలను ప్రకటించి ఆగిపోతే అది రిస్కే’’అని శామ్కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా తెలిపారు. సుజ్లాన్‌ ఎనర్జీని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. ఓ క్వార్టర్లో మంచి గణాంకాలను చూపించిన అనంతరం పనితీరు మెరుగుపడుతుందని ఆశించగా, బదులుగా మరింత పతనమై షేరు ధర రూ.3.3కు చేరినట్టు తెలిపారు. 

 

ఎస్‌బీఐ వరుస నష్టాల తర్వాత డిసెంబర్‌ క్వార్టర్లో రూ.4,823 కోట్ల లాభాలను ప్రకటించింది. యూనియన్‌ బ్యాంకు రూ.153 కోట్లు, సిండికేట్‌ బ్యాంకు 107 కోట్లు, డిష్‌ టీవీ 152 కోట్లు, టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ 136 కోట్లు, ఓబీసీ రూ.145 కోట్లు, ఆస్ట్రా జెనెకా ఫార్మా 29 కోట్లు, సీమెక్‌ 36 కోట్లు, బిర్లా కార్పొరేషన్‌ రూ.27 కోట్ల చొప్పున లాభాలను చూపించాయి. ఇలా టర్న్‌ అరౌండ్‌ అయిన కంపెనీల్లో మంచి నాణ్యమైన వ్యాపారం కలిగి, ఆకర్షణీయమైన వ్యాల్యూషన్ల వద్ద లభిస్తున్న వాటిని గుర్తించడం ద్వారా సంపద సృష్టించుకోవచ్చని ఉమేష్‌ మెహతా సూచించారు. ‘‘ట్రేడర్‌ కోణంలో చూస్తే.. స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి టర్న్‌ అరౌండ్‌ కంపెనీల్లో లాభాలు పొందొచ్చు. అయితే, ముందు జాగ్రత్తగా తగిన స్టాప్‌ లాస్‌లను ఏర్పాటు చేసుకోవాలి’’ అని ఆయన తెలిపారు. ఈ కంపెనీల వివరాలతో ఇన్వెస్టర్లు ఓ జాబితాగా ఏర్పాటు చేసుకుని, ఏవైనా సానుకూల పరిణామాలు జరుగుతున్నాయా అన్నది గమనించాలని సూచించారు. రెండో త్రైమాసికంలోనూ మంచి ఫలితాలనే నమోదు చేస్తే ప్రతికూలతలు దాదాపుగా తొలగిపోయినట్టేనన్నారు.You may be interested

ఎనిమిది రోజుల నష్టాలు... తర్వాత ఏంటి?

Wednesday 20th February 2019

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డిసెంబర్‌ త్రైమాసికం ఫలితాలు నిరాశ కలిగించడం, రానున్న ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి ఇలా పలు కారణాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో ఎనిమిది సెషన్లలోనూ మార్కెట్లు నష్టాల పాలయ్యాయి. కానీ, ఏం జరుగుతోందోనన్న ఆందోళన సాధారణ ఇన్వెస్టర్లలో నెలకొంది. రిస్క్‌ తీసుకునేందుకు కూడా ధైర్యం చేయలేని పరిస్థితి నెలకొన్నదంటున్నారు నిపుణులు. కార్పొరేట్‌ ఫలితాలు నిరాశపరచడం, బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీలో నెలకొన్న సంక్షోభం,

బీఎస్‌ఎన్‌ఎల్‌పై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు

Tuesday 19th February 2019

నిర్ణయాల్లో జాప్యంతో ప్రైవేటు కంపెనీలకు లబ్ధి ఉద్యోగుల సంఘం ఆరోపణ న్యూఢిల్లీ: తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం నుంచి మూడు రోజుల సమ్మెకు దిగిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. సంస్థ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా ప్రయత్నించటం లేదని, తద్వారా ప్రైవేటు టెలికం కంపెనీలకు ప్రయోజనం కలిగేలా వ్యవహరిస్తోందని ఉద్యోగుల సంఘం ఆరోపించింది. 4జీ సేవలకు గాను బీఎస్‌ఎన్‌ఎల్‌కు స్పెక్ట్రమ్‌ కేటాయింపు, భూ నిర్వహణ

Most from this category