STOCKS

News


220 షేర్లు - 52-వారాల కనిష్టానికి...

Monday 24th September 2018
Markets_main1537780440.png-20525

ముంబై:- మార్కెట్‌ పతనం గంట గంటకు పెరుగుతోంది. మిడ్‌సెషన్‌ సమయానికి సెన్సెక్స్‌ 550 పాయింట్ల నష్టంతో 36,341 వద్ద, నిఫ్టీ 185 పాయింట్ల నష్టంతో 10955 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల, దేశీయ స్టాక్‌ మార్కెట్‌ నుంచి ఎఫ్‌ఐఐల నిధుల ఉపసంహరణ, ఎన్‌బీఎఫ్‌సీ డెట్‌ సంక్షోభం, డాలర మారకంలో రూపాయి విలువ బలహీనపడటం...  తదితర కారణాలు సూచీల పతననానికి కారణవుతున్నాయి. మార్కెట్లో జరుగుతున్న అమ్మకాల సునామీలో భాగంగా నేటి ఇంట్రాడేలో ఎన్‌ఎస్‌ఈలో 220 షేర్లు 52 - వారాల కనిష్టానికి పతనమయ్యాయి.

  • యస్‌బ్యాంక్‌, ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌, అలహదాబాద్‌ బ్యాంక్‌, ఏపిల్‌ అపోలో ట్యూబ్స్‌, అశోకా బిల్డింగ్‌ కాన్‌, బీఈఎంఎల్‌లు షేర్లు 52- వారాల కనిష్టానికి పతనమయ్యాయి.
  • వాటితో పాటు బ్లూ డార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, కెనరా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్స్‌, ఎంఏఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఎంఐసీ ఎలక్ట్రానిక్స్‌, ఎంటీఎన్‌ఎల్‌, రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌, సాగర్‌ సిమెంట్స్‌, శ్రద్ధ మోటర్‌ ఇండస్ట్రీస్‌, సింఫనీ, టీవీస్‌ శ్రీచక్ర, ఉజ్జాయిని ఫైనాన్స్‌ సర్వీసెస్‌, యూనిటెక్‌ షేర్లు కూడా తాజా 52- వారాల కనిష్టాని‍్న తాకాయి.
  • ఎన్‌ఎస్‌ఈలో ఒక్క ఐటీ ఇండెక్స్‌(2.20శాతం) తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.
  •  నిఫ్టీ-50 ఇండెక్స్‌లో మొత్తం 38 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 12 షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

ఎన్‌బీఎఫ్‌సీ స్టాకుల్లో ఎక్కువ ఎక్స్‌పోజర్‌ ఉన్న ఎంఎఫ్‌లు ఇవే!

Monday 24th September 2018

శుక్రవారం ఉన్నట్లుండి హెచ్‌ఎఫ్‌సీ, ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల షేర్లు కుప్పకూలడం జరిగింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన బాండ్స్‌ను డీఎస్‌పీ ఎంఎఫ్‌ విక్రయించిందన్న వార్తలు మార్కెట్లో విపరీతమైన సెల్లింగ్‌ను సృష్టించాయి. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం బయటపడ్డ సమయంలో ఈ వార్తలు మార్కెట్లో లిక్విడిటీపై మరింత భయాందోళనలు పెంచాయి. ఇవన్నీ కలిసి ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో అమ్మకాల జోరు పెంచాయి. వడ్డీరేట్ల పెంపుదల ఎన్‌బీఎఫ్‌సీల వ్యాపారంపై ప్రభావం చూపుతుందన్న భయాలు, మార్కెట్లో నిధుల సమీకరణ కష్టంగా

ఈ పరిస్థితుల్లో ఎంఎఫ్‌ మదుపరులు ఏం చేయాలి?

Monday 24th September 2018

కేవలం ఒక్క రోజులో యస్‌ బ్యాంక్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు భారీగా పతనమయి ఇన్వెస్టర్లను దెబ్బతీశాయి. రిటైల్‌ మదుపరులే కాకుండా పలు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ సైతం ఈ దెబ్బకు కుదేలయ్యాయి. యస్‌ బ్యాంక్‌, హౌసింగ్‌ఫైనాన్స్‌ కంపెనీలు(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఐబీ హౌసింగ్‌ తదితరాలు) శుక్రవారం దాదాపు 10- 60 శాతం మేర క్షీణించాయి. దీంతో పలు ఎంఎఫ్‌ల నికర ఆస్తుల విలువ(ఎన్‌ఏవీ) 2 శాతం వరకు పతనమైంది. కేవలం ఎంఎఫ్‌లే కాకుండా

Most from this category