STOCKS

News


మిడ్‌క్యాప్స్‌లో ర్యాలీకి అవకాశం: ఐఐఎఫ్‌ఎల్‌

Tuesday 18th December 2018
Markets_main1545071602.png-23011

మార్కెట్లపై నిరాశావాదం ముగిసిందని, నిఫ్టీ 11,000కు సమీపానికి చేరువైందని ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన సంజీవ్‌ భాసిన్‌ అన్నారు. తాను మార్కెట్‌ పట్ల బుల్లిష్‌గా ఉన్నట్టు చెప్పారు. ఇప్పటికీ ఎంతో భయాలు ఉన్నాయని, ఇన్వెస్టర్లు కరెక్షన్‌ కోసం ఎదరు చూస్తున్నారని పేర్కొన్నారు. ముడి చమురు బేర్స్‌ గుప్పిట్లోకి రావడంతో భారత్‌ తిరిగి ఆకర్షణీయంగా మారిందన్నారు. ఆర్‌బీఐ, ప్రభుత్వం విషయంలో ఉన్న అనిశ్చితులకు తెరపడినట్టు చెప్పారు. వచ్చే 3-4 నెలల పాటు మార్కెట్లు ఆశ్చర్యానికి గురి చేయవచ్చని, కంపెనీల ఫలితాలు ఉత్ప్రేరకంగా నిలవొచ్చన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోలు దారులుగా మారినట్టు చెప్పారు. స్థానికంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు, సిప్‌ పెట్టుబడులు చోదకంగా నిలుస్తున్నట్టు సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. వచ్చే కొన్ని నెలల పాటు మిడ్‌క్యాప్స్‌ మంచి పనితీరు చూపిస్తాయని తాను అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ దృష్ట్యానే ఎంపిక చేసిన మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ను మంచి పనితీరుకు అవకాశం ఉన్న రంగాల్లో కొనుగోలుకు సిఫారసు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

 

ఐటీ రంగానికి దూరంగా ఉండొచ్చని భాసిన్‌ సూచించారు. వీటి ఎర్నింగ్స్‌ అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చన్నారు. మెటల్స్‌ పట్ల చాలా బుల్లిష్‌గా ఉన్నట్టు చెప్పారు. అమెరికాలో రక్షణ ధోరణితో 2019 కూడా కంపెనీలకు ఫలితాల పరంగా మంచి సంవత్సరం అవుతుందన్నారు. స్థానికంగా స్టీల్‌ ధరలు పెరగడాన్ని పేర్కొంటూ... జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, వేదాంత, హిందాల్కో ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. ఎస్‌బీఐ, కెనరా బ్యాంకు, ఇండియన్‌ బ్యాంకులు ప్రభుత్వరంగంలో మంచి ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్టు చెప్పారు. కార్పొరేట్‌ బ్యాంకుల్లో ఐసీఐసీఐ, ఫెడరల్‌ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకులను సిఫారసు చేశారు. మహానగర్‌ గ్యాస్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌, గెయిల్‌ కూడా చార్ట్‌ల పరంగా చూస్తే ఆకర్షణీయంగా ఉన్నట్టు చెప్పారు. విద్యుత్‌ రంగంలో సీఈఆర్‌సీ తాజా ఉత్తర్వుతో ప్రభుత్వరంగంలోని ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌ కంపెనీలకు సానుకూలమన్నారు. 2019లో ‘క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ పవర్‌’ స్టాక్‌ను డార్క్‌ హార్స్‌గా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ రంగంలో సీఈఆర్‌సీని కూడా సూచించారు.You may be interested

2018లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పనితీరు ఇలా...

Tuesday 18th December 2018

ఈక్విటీ ఇన్వెస్టర్లకు 2008 మాదిరే 2018 బాగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడిన కాలం ఇది. ముఖ్యంగా ఈ ఏడాది మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ బాగా నష్టపోయాయి. వీటితో పోలిస్తే లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో నష్టాలు తక్కువగా ఉన్నాయి. ఇక మ్యూచువల్‌ ఫండ్స్‌ విషయానికొస్తే... ఏ పథకాలు మంచి పనితీరు చూపించాయి, వేటి పనితీరు చతికిలపడిందన్న డేటా ఇన్వెస్టర్లకు తెలుసుకోవాల్సి ఉంది...    ముఖ్యంగా ఈ ఏడాది ఐటీ విభాగం

బైబ్యాక్‌, డివిడెండ్‌కు ఐవోసీకి తగిన వెసులుబాటు: ఫిచ్‌

Tuesday 18th December 2018

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ షేర్ల బైబ్యాక్‌, డివిడెండ్‌ పంపిణీకి ఇటీవల బోర్డులో నిర్ణయం తీసుకోగా, ఇందుకు రూ.11,000 కోట్ల నిధులను వ్యయం చేయనుంది. అయితే, ఈ మేర నిధుల సమీకరణ వనరులు దానికి ఉన్నట్టు ఫిచ్‌ రేటింగ్‌ సంస్థ పేర్కొంది. 3.06 శాతం వాటాకు సమానమైన 29.76 కోట్ల ఈక్విటీ షేర్లను ఐవోసీ బైబ్యాక్‌ చేయాలని నిర్ణయించింది. ఒక్కో షేరు కొనుగోలు ధరగా రూ.149ను ఖరారు చేసింది. ఈ మొత్తానికి

Most from this category