STOCKS

News


11000- 11400 పాయింట్ల రేంజ్‌లో నిఫ్టీ!

Monday 24th September 2018
Markets_main1537767765.png-20514

స్వల్పకాలానికి నిపుణుల అంచనా
రూపాయి పతనం, క్రూడాయిల్‌ ధర పెరుగుదలతో సూచీల్లో ఆరంభమైన పతనాన్ని పెరిగిన బాండ్‌ ఈల్డ్స్‌, కంపెనీల క్రెడిట్‌ సమస్యలు మరింత వేగవంతం చేశాయి. దీంతో సూచీలు రోజురోజుకీ కొత్త కనిష్ఠాలను నమోదు చేస్తూపోతున్నాయి. ఇండియా వీఐఎక్స్‌ ప్రస్తుతం 15.36 స్థాయిలకు పైన ట్రేడవుతూ మరింత పతనాన్ని సూచిస్తోంది. శుక్రవారం ఇందుకు సూచనగా సూచీలు, స్టాకులు ఒక్కమారుగా ఢమాల్‌మని చివర్లో కాస్త రికవరీ అయ్యాయి. నిఫ్టీ 11320కి దిగువన ట్రేడవడం బలహీనతనే సూచిస్తోంది. ప్రస్తుతానికి నిఫ్టీకి వందరోజుల డీఎంఏ స్థాయి 11025 పాయింట్ల వద్ద బలమైన మద్దతుంది. దీనికి దిగువన 200 రోజుల డీఎంఏ స్థాయి 10740 పాయింట్ల వద్ద ఉంది. ఈ రెండిటిలో ఎక్కడో ఒక చోట మద్దతు గ్యారెంటీగా లభించవచ్చని అంచనా. ఆప్షన్‌ డేటా సైతం ఇదే అంశాన్ని సూచిస్తోంది. ప్రస్తుతం నిఫ్టీలో 11000, 11100 పాయింట్ల వద్ద గరిష్ఠస్థాయిలో పుట్స్‌, 11500, 11400 పాయింట్ల వద్ద కాల్స్‌ భారీగా ఉన్నాయి. దీన్ని బట్టి స్వల్పకాలానికి నిఫ్టీ 11000- 11500 పాయింట్ల రేంజ్‌లో కదలాడవచ్చని అంచనా. నిఫ్టీ 11320 పాయింట్ల పైన బలంగా క్లోజయితే 11550- 11600 పాయింట్ల వరకు ఎగబాకవచ్చు. 



You may be interested

ఎన్‌బీఎఫ్‌సీలకు లిక్విడిటీ అందిస్తాం: జైట్లీ

Monday 24th September 2018

ముంబై: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), మ్యూచువల్‌ ఫండ్స్‌కు (ఎంఎఫ్‌లు), చిన్న మధ్యతరహా పరిశ్రమలకు (ఎస్‌ఎంఈలు) లిక్విడిటీ అందుబాటులో ఉంచేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ భరోసానిచ్చారు. సోమవారం ఉదయం ఆయన ఒక ట్వీట్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణాల చెల్లింపుల పరంగా విఫలమైనట్లు వెల్లడికావడంతో నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలకు లిక్విడిటీకి సంబంధించి ఆందోళనలు ఏర్పడటం వల్ల శుక్రవారం మార్కెట్లు ఒక్కసారిగా

నష్టాల బాటలో బ్యాంక్‌ షేర్లు

Monday 24th September 2018

ముంబై:- మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అన్ని ప్రధాన సూచీలోకెల్లా అత్యధికంగా నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.50శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌:- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (1శాతం), ఇండస్‌

Most from this category