News


దీర్ఘకాలానికి ఐఐఎఫ్‌ఎల్‌ సిఫార్సులు.!

Friday 9th November 2018
Markets_main1541759590.png-21830

ముంబై: స్వల్పకాలనికి దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్యనే కొనసాగేందుకు ఆస్కారం ఉందని ఇండియ‌న్ ఇన్ఫోలైన్ లిమిటెడ్‌(ఐఐఎఫ్ఎల్‌) సీఈఓ అరిందం చందా అంచనావేశారు. అక్టోబర్‌, డిసెంబర్‌ భారీ పతనం నుంచి కోలుకుంటున్న సూచీలు.. పలు కార్పొరేట్‌ కంపెనీల ఎర్నింగ్స్‌ బాగుండడం, క్రమంగా సెంటిమెంట్‌ బలపడడం వంటి కారణాలతో ఆశాజనకంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ప్రతికూల అంశాలు, ద్రవ్యలభ్యత అంశాల కారణంగా షార్ట్‌టెర్మ్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. వచ్చే ఏడాది దీపావళి నాటికి ప్రస్తుత స్థాయి నుంచి 10 శాతం వరకు బలపడే అవకాశం ఉందన్నారు. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడి, కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా ఉండి, ముడిచమురు ధరలు శాంతిస్తే ఆకర్షణీయ రాబడిని మన మార్కెట్లు అందించే అవకాశం ఉందని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఇక గడిచిన ఏడాది నుంచి ఈ ఏడాది దీపావళి వరకు మార్కెట్‌ జర్నీని ఒకసారి గమినిస్తే.. నిఫ్టీ పెరుగుదల కేవలం 5 షేర్ల వల్లనే నమోదైందన్నారు. ఇన్ఫోసిస్, టిసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పెరగడం వల్లనే నిఫ్టీ 50 ఇండెక్స్‌ పెరిగిందని విశ్లేషించారు. ఈక్విటీ పన్నులు మారడం, సెబీ ఎంఎఫ్‌ స్కీం, జీఎస్ఎం/ఏఎస్‌ఎం సర్యూలర్స్‌ కారణాల వల్ల మ్యూచువల్‌ ఫండ్స్‌ భారీ అమ్మకాలకు పాల్పడడం వల్లనే మిడ్‌క్యాప్‌ రంగ షేర్ల పతనానికి ప్రధాన కారణం కాగా, ఐఎఫ్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం మరింత ఆజ్యం పోసిందన్నారు. అయితే ప్రస్తుతం స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ వాల్యుయేషన్స్‌ సమంజసంగా ఉన్నాయన్నారయన. వీటి వాల్యుయేషన్స్‌ 2014 పీఈ స్థాయికి పతనం అయ్యాయని, 2020 ఫార్వార్డ్‌ పీఈ పరంగా బాగున్న కంపెనీల షేర్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చని సూచించారు. మొత్తం రంగంలోని షేర్లను కాకుండా.. కేవలం వాల్యుయేషన్స్‌ సమంజసంగా ఉన్న కంపెనీల షేర్లను మాత్రమే కొనుగోలు చేయాలని అన్నారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టి.. వచ్చే 2-3 ఏళ్లు ఆగగలిగే వారి కోసం 5 షేర్లను సిఫార్సుచేశారు. అవేంటంటే..

వచ్చే 2-3 ఏళ్ల కోసం 5 షేర్లు
మైండ్‌ట్రీ: టార్గెట్‌ ధర రూ.1081
మదర్‌సన్ సుమి: టార్గెట్‌ ధర రూ.293
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌ షేర్లు 20-30 శాతం వరకు పెరిగే అవకాశం

ఇవి కేవలం ఐఐఎఫ్ఎల్‌ అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.

 You may be interested

బీమా, పెన్షన్‌ నిబంధనల్లో కీలక మార్పులు

Friday 9th November 2018

బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ ‘ఐఆర్‌డీఏ’ ఇటీవల పెన్షన్‌, బీమా ప్లాన్లలో పలు మార్పులను ప్రతిపాదించింది. వీటిలో కొన్ని పాలసీదారుల ప్రయోజనాల కోణంలో తీసుకొన్నవి. మరి వీటి ప్రభావం పాలసీదారులపై ఏ విధంగా ఉంటుందో నిపుణుల అభిప్రాయాల ఆధారంగా తెలుసుకుందాం...   60 శాతం నిధులు వెనక్కి కాలం ముగిసిన పెన్షన్‌ ప్లాన్ల నుంచి ఇకపై 60 శాతం నిధులను వెనక్కి తీసుకునే అవకాశం కల్పించడం ఒక ప్రతిపాదన. ప్రస్తుతం ఇది 33 శాతంగానే

స్వల్ప నష్టంతో ముగింపు

Friday 9th November 2018

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 79 పాయింట్లు నష్టంతో 35,158 వద్ద ముగిసింది. నిఫ్టీ 13 పాయింట్ల నష్టంతో 10,585 వద్ద ముగిసింది. ప్రపంచ ప్రతికూలతల నేపథ్యంలో నేడు దేశీ స్టాక్‌ సూచీలు లాభాలతో మొదలైనా,  వెంటనే వెనకడుగు వేశాయి. డాలర్‌ మారకంలో రూపాయి క్షీణతతో ఐటీ షేర్లు పతనం, హెవీవెయిట్‌ షేర్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీలు క్షీణించడం నేడు సూచీల నష్టాల ముగింపునకు

Most from this category