STOCKS

News


భారీగా పడిన స్టాక్స్‌... పెరిగిన ప్రమోటర్ల వాటా

Friday 21st December 2018
Markets_main1545416805.png-23144

2018 సంవత్సరంలో కొన్ని కంపెనీల షేర్లు వివిధ కారణాల నేపథ్యంలో పతనాలను చవిచూశాయి. ఆశ్చర్యకరంగా ఈ కంపెనీల్లో ప్రమోటర్ల వాటా స్వల్పంగా పెరిగింది. ఆ వివరాలే ఇవి....

 

మన్‌పసంద్‌ బెవరేజెస్‌
గుజరాత్‌ కేంద్రంగా పనిచేసే పళ్ల రసాల తయారీ కంపెనీ. ఈ ఏడాది ఈ స్టాక్‌ 80 శాతం పడిపోయింది. ప్రమోటర్ల వాటా మాత్రం 0.36 శాతం పెరిగింది. జూన్‌ క్వార్టర్‌ ఫలితాలకు ముందు, కంపెనీ సమాచారం ఇవ్వడం లేదంటూ ఆడిటింగ్‌ సంస్థ తప్పుకోవడం... ఈ కంపెనీ కార్యకలాపాలపై సందేహాలకు అవకాశం ఇచ్చింది. దీంతో ఈ స్టాక్‌ను ఇన్వెస్టర్లు తెగనమ్మేశారు. 
ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌
నివాస, వాణిజ్య భవనాల నిర్మాణంలో ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ప్రధాన కంపెనీల్లో ఒకటి. ఈ కంపెనీ షేరు ఈ ఏడాది 59 శాతం వరకు పతనం కాగా, ప్రమోటర్ల వాటా 5.3 శాతం పెరిగింది.  
డిష్‌ టీవీ ఇండియా
డీటీహెచ్‌ టెలివిజన్‌ సేవల్లోని ఈ కంపెనీ స్టాక్‌ ఈ ఏడాది 53 శాతం నష్టపోయింది. ప్రమోటర్ల వాటా మాత్రం 29.55 శాతం నుంచి 58.92 శాతానికి పెరిగింది.
జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌
మైక్రో ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ తయారీలో ఉన్న పురాతన కంపెనీ ఇది. ఈ ఏడాది ఈ స్టాక్‌ ధర 47 శాతం పడిపోయింది. ప్రమోటర్లు మాత్రం తమ వాటాను 0.63 శాతం పెంచుకున్నారు.  
ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌
కిషోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ గ్రూపు కంపెనీయే ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌. ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల తయారీ, ఫ్యూచర్‌ గ్రూపు స్టోర్లతో పాటు, ఇతర స్టోర్ల ద్వారా మార్కెటింగ్‌లో ఉంది. ఈ స్టాక్‌ ఈ ఏడాది 36 శాతం పడిపోగా, ప్రమోటర్లు తమ వాటాను ఏకంగా 4.9 శాతం పెంచుకోవడం విశేషం. 
లారస్‌ ల్యాబ్స్‌
ఈ కంపెనీలోనూ ప్రమోటర్లు తమ వాటాను 9.2 శాతం పెంచుకున్నారు. స్టాక్‌ ధర 28 శాతం క్షీణించింది. ఇంకా జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాలో 2.1 శాతం, ట్రిడెంట్‌లో ఒక శాతం, ఐడీఎఫ్‌సీ బ్యాంకులో 6 శాతం చొప్పున ప్రమోటర్ల వాటా పెరిగింది. 



You may be interested

మళ్లీ మోదీయే... విశ్లేషకుల అంచనాలు

Friday 21st December 2018

ఈ ఏడాది ఎన్ని ఎత్తు పల్లాలను చవిచూసినా... చివరికి బుల్స్‌దే పై చేయిగా కనిపిస్తోంది. ఎందుకంటే 2018 ముగియడానికి మరో వారమే మిగిలి ఉండగా, ఇప్పటి వరకు చూసుకుంటే మార్కెట్లు నికరంగా లాభాల్లో ఉన్నట్టే. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ మాత్రం మూడింట రెండొంతులు నష్టాల్లోనే ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారు మార్కెట్లు తిరిగి ఎప్పుడు ర్యాలీ చేస్తాయా? అని కళ్లల్లో వొత్తులు వేసుకుని చూస్తున్న పరిస్థితి ఉంది.

నిఫ్టీ 200 పాయింట్ల పతనం

Friday 21st December 2018

సెన్సెక్స్‌ 689 పాయింట్లు డౌన్‌ 35,742 వద్ద ముగింపు రెండు వారాల నుంచి ప్రపంచ మార్కెట్లతో సంబంధం లేకుండా అలుపెరుగని ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు శుక్రవారం హఠాత్‌ పతనాన్ని చవిచూశాయి. ఇండెక్స్‌లు దాదాపు 2 శాతం మేర పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 689 పాయింట్ల నష్టంతో 35,742 వద్ద, నిఫ్టీ 198 పాయింట్ల నష్టంతో 10,754 వద్ద ముగిశాయి.   ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 35,694- 36,483 పాయింట్ల శ్రేణిలో, నిఫ్టీ 10,738- 10,963 పాయింట్ల శ్రేణిలో

Most from this category