STOCKS

News


ఓఎన్‌జీసీ బైబ్యాక్‌ @ రూ.4,022 కోట్లు

Friday 21st December 2018
Markets_main1545368330.png-23121

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ కంపెనీ రూ.4,022 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌కు కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని ఓఎన్‌జీసీ వెల్లడించిది. షేర్ల బైబ్యాక్‌లో భాగంగా 1.97 శాతం వాటాకు సమానమైన 25.29 కోట్ల షేర్లను, ఒక్కో షేర్‌ను రూ.159కు కొనుగోలు చేస్తామని  పేర్కొంది. ఓఎన్‌జీసీలో కేంద్ర ప్రభుత్వానికి 65.64 శాతం వాటా ఉండటంతో ఓఎన్‌జీసీ షేర్ల బైబ్యాక్‌ కారణంగా ప్రభుత్వానికి రూ.2,640 కోట్ల నిధులు వస్తాయని అంచనా. కాగా మూలధన పెట్టుబడులు కోసం నిధులు ఖర్చుకాగా ఈ సారి మధ్యంతర డివిడెండ్‌ను ఓఎన్‌జీసీ చెల్లించడం లేదని సమాచారం. షేర్ల బైబ్యాక్‌లో భాగంగా కంపెనీ తాను జారీ చేసిన షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఇటీవలే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొ (ఐఓసీ) కంపెనీ రూ.4,435 కోట్ల మేర షేర్లను బైబ్యాక్‌ చేయనున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా రూ.6,556 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. 
కేంద్రం ఒత్తిడి...
నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను షేర్లను బైబ్యాక్‌ చేయాలని, అధిక డివిడెండ్‌ను చెల్లించాలని  కేంద్రం ఒత్తిడి చేస్తోంది. ఈ సంస్థల్లో అధిక వాటా ఉండటంతో  షేర్ల బైబ్యాక్‌ కారణంగా ప్రభుత్వానికి భారీగా నిధులు లభిస్తాయి. ఈ నిధులను బడ్జెట్‌ లోటు పూడ్చుకోవడానికి వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ప్రోద్బలంతో ఇప్పటికే డజనుకు పైగా ప్రభుత్వ రంగ కంపెనీలు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించాయి. ఐఓసీ, నాల్కో, భెల్‌, ఆయిల్‌ ఇండియా, కోల్‌ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌ఎల్‌సీ, కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌, కేఐఓసీఎల్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల షేర్ల బైబ్యాక్‌ కారణంగా కనీసం రూ.5,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

వచ్చే నెల 1 నుంచి ఎన్‌హెచ్‌పీసీ షేర్ల బైబ్యాక్‌ 
ఎన్‌హెచ్‌పీసీ షేర్ల బైబ్యాక్‌ వచ్చే నెల 1 నుంచి ప్రాంరభమవుతోంది. అదే నెల 14న ముగిసే ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా 2.09 శాతం వాటాకు సమానమైన 21.42 కోట్ల షేర్లను ఒక్కోటి రూ.28 ధరకు ఈ కంపెనీ కొనుగోలు చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌కు రికార్డ్‌ తేదీగా గత నెల 30ని కంపెనీ నిర్ణయించింది. 



You may be interested

స్టార్టప్స్‌కు గుజరాత్‌ బెస్ట్‌

Friday 21st December 2018

న్యూఢిల్లీ: కొత్త ఎంటర్‌ప్రెన్యూర్లు స్టార్టప్స్‌ స్థాపించుకునేందుకు కావలిసిన వసతుల కల్పనలో గుజరాత్‌ నెంబర్‌వన్‌గా నిలిచింది. ఆయా రాష్ట్రాల్లో స్టార్టప్‌ల ఏర్పాటుకున్న సానుకూల పరిస్థితులపై డీఐపీపీ (పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక శాఖ) పరిశీలన జరిపి ర్యాకింగ్స్‌ ఇచ్చింది. స్టార్టప్‌ పాలసీ, ఇంక్యుబేషన్‌ హబ్స్‌, ఇన్నోవేషన్స్‌, నియంత్రణా సవాళ్లు, ప్రొక్యూర్‌మెంట్‌, కమ్యూనికేషన్స్‌ తదితర విభాగాలకు సంబంధించి 27 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలను పరిశీలించారు. పరిశీలన అనంతరం అత్యున్నతం, ఉన్నతం, అగ్రగామి, కాబోయే

తగ్గిన రూపాయి

Friday 21st December 2018

ఇండియన్‌ రూపాయి శుక్రవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే నష్టపోయింది. ప్రపంచ ఆర్థిక వృద్ధిపై నెలకొన్న ఆందోళనల కారణంగా గ్లోబల్‌ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొనడం ప్రతికూల ప్రభావం చూపింది. ఉదయం 9:15 సమయంలో రూపాయి 70.05 వద్ద ట్రేడవుతోంది. తన మునపటి ముగింపు (గురువారం) 69.70తో పోలిస్తే 0.49 శాతం నష్టపోయింది. 69.94 వద్ద ప్రారంభమైన రూపాయి.. 69.70 గరిష్ట స్థాయిని, 70.06 కనిష్ట స్థాయిని తాకింది.  అమెరికా ప్రభుత్వం

Most from this category