STOCKS

News


ఓఎన్‌జీసీ షేరు 5శాతం అప్‌

Wednesday 18th July 2018
Markets_main1531900758.png-18436

  • పవన్‌హన్స్‌లో వాటా విక్రయానికి ఓఎన్‌జీసీ ఓకే..!

ముంబై:- పవన్‌హన్స్‌లో వాటా విక్రయానికి ఓఎన్‌జీసీ బోర్డు ఆమోదం తెలపడంతో ఓఎన్‌జీసీ షేర్లు బుధవారం బీఎస్‌ఈలో 5శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో ఓఎన్‌జీసీ షేర్లు రూ.157.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. పవన్‌హన్స్‌లో తనకున్న 49శాతం వాటా విక్రయించేందుకు ఓఎన్‌జీసీ బోర్డు ఆమోదం తెలిపినట్లు ఓఎన్‌జీసీ స్టాక్‌ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఈ వార్తల నేపథ్యంలో ఓఎన్‌జీసీ షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో ఇంట్రాడేలో 5శాతానికి పైగా లాభపడి రూ.163.70 గరిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం​ గం.1:20ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.156.1)తో పోలిస్తే 4.50శాతం లాభపడి రూ.163.25ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.152.45 రూ.212.90లుగా ఉన్నాయి. ఇదే సమయానికి  నిఫ్టీ - 50లో 5శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా ట్రేడ్‌ అవుతోంది.

 



You may be interested

బంధన్‌ బ్యాంక్‌ నికర లాభం 47 శాతం వృద్ధి

Wednesday 18th July 2018

కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రైవేట్‌ రంగ బంధన్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1 ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 47 శాతం వృద్ధితో రూ.482 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం రూ.327 కోట్లుగా ఉంది. వడ్డీ రేటు ఆదాయం ఎక్కువగా ఉండటం ఆదాయం దీనికి కారణం. బ్యాంక్‌ మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 39 శాతం వృద్ధితో

కళ తప్పిన లోహ షేర్లు..!

Wednesday 18th July 2018

ముంబై:- క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో ర్యాలీ చేసిన లోహ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో పాటు, ప్రపంచమార్కెట్లో లోహా ధరల పతనంతో బుధవారం లోహ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో లోహ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ సూచి మంగళవారం 3.30 శాతం పైగా క్షీణించింది. మధ్యాహ్నం గం.12:30లకు నిఫ్టీ మెటల్‌ గత ముగింపు 3223 పాయింట్లతో పోలిస్తే 2.63శాతం నష్టంతో 3,138 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Most from this category