STOCKS

News


గెయిల్‌, ఐఓసీల్లో వాటాను ఇప్పట్లో విక్రయించం: ఓఎన్‌జీసీ

Tuesday 2nd October 2018
Markets_main1538475433.png-20797

ముంబై:-  గెయిల్‌, ఐఓసీ కంపెనీల్లో తమ వాటాను ఇప్పట్లో విక్రయించేది లేదని ప్రభుత్వరంగ సం‍స్థ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్ప్‌(ఓఎన్‌జీసీ) తేల్చి చెప్పింది. ఇరు సంస్థల్లో వాటా విక్రయానికి సంబంధించి సరైన సమయంతో పాటు, ధర కోసం ఎదురుచూస్తున్నామని ఓఎన్‌జీసీ సీనియర్‌ అధికారి అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఓఎన్‌జీసీకి ఐఓసీ, గెయిల్ కంపెనీల నుంచి డివిడెండ్ రూపంలో రూ.3వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఇది మూలధనంపై మంచి ఆదాయమే. దీర్ఘకాలం పాటు కంపెనీలో వాటాలను కొనసాగించేందుకు ఈ కారణం సరిపోతుంది. ఐఓసీ షేరు ధర జనవరిలో రూ.195ల వద్ద ట్రేడ్‌ అయ్యింది. ఇప్పుడు 153-154 రేంజ్‌లో ట్రేడ్‌ అవుతోంది. ఈ సమయంలో సంస్థలో వాటాను అమ్మడం అర్థరహితమని ఆయన అన్నారు. ఓఎన్‌జీసీకి  ఐఓసీలో 13.77 శాతం వాటా(రూ.20,500 కోట్ల విలువైన వాటా)ఉండగా, గ్యాస్‌ ఉత్పత్తి సంస్థ గెయిల్‌లో 4.86శాతం వాటాను(రూ.4200 కోట్ల విలువైన వాటా)కలిగి ఉంది. అంతర్జాతీయంగా పెరిగిన ముడిచమురు ధరలు, దేశీయంగా రూపాయి క్షీణిత కంపెనీలకు తగిన ఆదాయాల్ని అందిస్తున్నాయని, ఈ నిధుల్ని హెచ్‌పీసీఎల్‌ కొనుగోలుకు వినియోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. హెచ్‌పీసీఎల్‌లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 51.11 వాటాను ఓఎన్‌జీసీ కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే.


IOC

You may be interested

నెల రోజులకు పది సిఫార్సులు

Tuesday 2nd October 2018

స్వల్పకాలానికి సుమారు 16 శాతం వరకు రాబడినిచ్చే పది షేర్లను నిపుణులు రికమండ్‌ చేస్తున్నారు. రెలిగేర్‌ బ్రోకింగ్‌ రికమండేషన్లు 1. లుపిన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 980. స్టాప్‌లాస్‌ రూ. 860. డైలీ చార్టుల్లో దీర్ఘకాలిక డీఎంఏ స్థాయిల వద్ద మంచి మద్దతు పొందింది. ప్రస్తుతం అక్కడనుంచి రీబౌండ్‌ చూపుతోంది. రూ. 890- 900 రేంజ్‌లో కొనుగోళ్లను పరిశీలించవచ్చు.  2. కెనెరా బ్యాంక్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 200. స్టాప్‌లాస్‌ రూ. 240. పలుమార్లు

మీ మార్కెట్‌ పెట్టుబడులపై వీటి ఎఫెక్ట్‌..

Tuesday 2nd October 2018

మిడ్‌క్యాప్స్‌ పతనం, రూపాయి క్షీణత, క్రూడ్‌ ధరల పెరుగుదల, ఎన్‌బీఎఫ్‌సీ లిక్విడిటీ ఆందోళనలు.. వీటన్నింటినీ మార్కెట్‌ చూసేసింది. మార్కెట్‌ గత శుక్రవారం ఒక్క దెబ్బతో ఇన్వెస్టర్ల సంపదను ఊడ్చుకెళ్లింది. ప్రస్తుత ఒడిదుడుకుల మీ పోర్ట్‌ఫోలియో సురక్షింతంగా ఉందా? వచ్చే ఆరు నెలల కాలంలో ఏ ఏ అంశాలు స్టాక్స్‌ రిటర్న్స్‌ను ప్రభావితం చేయబోతున్నాయి? ఒకసారి చూడండి..  రూపాయి ప్రస్తుత ఏడాది రూపాయి 13 శాతంమేర పతనమైంది. ఆసియా ప్రాంతంలో అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన

Most from this category