STOCKS

News


త్వరలోనే 3 ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం..!

Friday 16th November 2018
Markets_main1542346871.png-22068

  • రూ.16,500 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణకు అవకాశం

ముంబై: పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఓఎన్‌జీసీ, ఐఓసీ, ఆయిల్‌ ఇండియాలో వాటాలను విక్రయించనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాన్ని అందుకోవడంలో భాగంగా మరోనెల రోజుల్లోనే ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలలో వాటాలను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలో విక్రయించడం, బైబ్యాక్‌ రూపంలో వాటాలను తగ్గించుకోవడం వంటి నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటోందని విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా వెల్లడైంది. నిర్థేశిత రూ.80,000 కోట్ల లక్ష్యంలో ఇప్పటివరకు నాలుగింట ఒక వంతు ఉపసంహరణ పూర్తిచేసిన ప్రభుత్వం.. త్వరలోనే ఓఎన్‌జీసీలో 5 శాతం, ఐఓసీలో 3 శాతం, ఆయిల్‌ ఇండియాలో 10 శాతం వాటాను త్వరలోనే విక్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఓఎన్‌జీసీలో ప్రభుత్వానికి ప్రస్తుతం 67.48 శాతం వాటా ఉండగా.. ఇందులో 5 శాతం వాటా విక్రయం ద్వారా రూ.10,000 కోట్లు చేకూరనున్నాయి. ఐఓసీలో 56.75 శాతం వాటా ఉండగా, ఇందులో 3 శాతం వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా డిజిన్వెస్ట్‌మెంట్‌ చేయడం వల్ల రూ.4,200 కోట్లు సమకూరుతాయి.  ఆయిల్‌ ఇండియాలో ప్రభుత్వానికి ఉన్న వాటా మొత్తం 66.13 శాతంలో నుంచి 10 శాతం వాటాను తగ్గించుకోవడం ద్వారా రూ.2,300 కోట్లు సమకూరనున్నాయి. తద్వారా కేంద్ర ప్రభుత్వానికి మొత్తంగా రూ.16,500 కోట్లు అందనుంది. ప్రస్తుతం ఓఎన్‌జీసీ షేరు ధర రూ.155, ఐఓసీ షేరు ధర రూ.145, ఆయిల్‌ ఇండియా షేరు ధర రూ.200 వద్ద ఉండగా.. మార్కెట్‌ ధర కంటే 5 శాతం డిస్కౌంట్‌లోనే షేర్లను విక్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ అనధికార నిర్ణయం నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్‌లో ఈ మూడు ప్రభుత్వ రంగ షేర్లు 4-5 శాతం మేర నష్టాలను నమోదుచేశాయి. 

అనుకున్న విధంగా ఈ మూడు కంపెనీలలో పెట్టుబడుల ఉపసంహరణ పూర్తయితే ఓఎన్‌జీసీలో ప్రభుత్వ వాటా 62.48 శాతానికి, ఐఓసీలో 53.75 శాతాని, ఆయిల్‌ ఇండియాలో వాటా 56.13 శాతానికి తగ్గిపోనుంది. తాజాగా కోల్‌ ఇండియాలో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా 3 శాతం వాటాను విక్రయించిన ప్రభుత్వం.. బైబ్యాక్‌ రూపంలో కూడా తమ వద్ద ఉన్నటువంటి వాటాను తగ్గించుకునే ప్రయత్నాలు ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ 19 నుంచి ఓఎన్‌జీసీ బైబ్యాక్‌ ప్రక్రియ కొనసాగించే దిశగా ప్రతిపాదన ఉండగా.. ఈ మార్గంలో వాటాలను తగ్గించి ద్వారా రూ.1,100 కోట్లు, ఐఓసీ బైబ్యాక్‌ ద్వారా రూ.4,000 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. అయితే, ఇందుకు పలువురు ఎగ్జిక్యూటీవ్స్‌ అభ్యంతరాలు తెలుపుతున్న నేపథ్యంలో ఈ మార్గం సుగమం అవుతుందా లేదా అనే సందేహం ఉందని ప్రభుత్వ అధికారి ఒకరి మీడియాతో అన్నారు. 



You may be interested

కోటక్‌ బ్యాంక్‌లో ఐఎన్‌జీ గ్రూప్‌ వాటా విక్రయం !

Friday 16th November 2018

న్యూఢిల్లీ: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో తన కున్న వాటాను డచ్‌ ఆర్థిక దిగ్గజం ఐఎన్‌జీ గ్రూప్‌ విక్రయించనుంది. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో ఈ గ్రూప్‌కు 3.73 శాతం వాటా ఉంది. ఈ వాటా మొత్తాన్ని ఈ వారంలో బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఐఎన్‌జీ గ్రూప్‌ విక్రయించనున్నదని సమాచారం. ఒక్కో షేర్‌ను రూ.1,070 ధర చొప్పున విక్రయించడానికి ఐఎన్‌జీ గ్రూప్‌ రెండు, మూడు సంస్థలతో డీల్‌ కుదుర్చుకున్నదని సంబంధిత వర్గాలు

బజాజ్‌ అలయంజ్‌ నుంచి రెండు కొత్త ఉత్పాదనలు!

Friday 16th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: రెండు కొత్త పాలసీలను తమ సంస్థ తేనున్నదని, అవి ఐఆర్‌డీఏ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయని బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అపాయింటెడ్‌ యాక్చువరీ సాయి శ్రీనివాస్‌ ధూలిపాళ తెలిపారు. ఇందులో ఒకటి యులిప్‌ పాలసీ అని వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీ మొత్తం 25 రకాల పాలసీలను అందుబాటులో ఉంచిందని గురువారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘‘ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య ఇండివిడ్యువల్‌ విభాగంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌ 9.9

Most from this category