News


ఓఎన్‌జీసీని పిండేస్తున్న కేంద్రం!

Sunday 6th January 2019
Markets_main1546796194.png-23441

చమురు అన్వేషణ, ఉత్పత్తిలో అతిపెద్ద ప్రభుత్వరంగ కంపెనీ ఓఎన్‌జీసీ... కేంద్ర ప్రభుత్వానికి బంగారు బాతులు పెట్టే గుడ్డు మాదిరిగా మారిపోయింది. కేంద్రం తన నిధుల సమీకరణ అవసరాల్లో భాగంగా ప్రభుత్వరంగ కంపెనీలపై ఒత్తిడి తెచ్చి మరీ షేర్ల బైబ్యాక్‌, డివిడెండ్ల రూపంలో ఆదాయం పొందుతోంది. ఈ కార్యక్రమంలో ఓఎన్‌జీసీ కూడా భాగమైపోయింది. అప్పులు తీసుకుని మరీ, కేంద్రానికి నిధులను ధారబోస్తోంది ఓఎన్‌జీసీ.

 

ఓఎన్‌జీసీ 2016-17, 2017-18లో అస్సలు రుణాలే తీసుకోలేదు. మరీ ముఖ్యంగా గత కొన్నేళ్లలో అసలు రుణాలు తీసుకోవాల్సిన అవసరమే రాలేదు. నగదు నిల్వలు దండిగా ఉన్న సంస్థ. కానీ, ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం రుణాల వేటలోకి దిగిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. కేంద్ర ప్రభుత్వం 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ, వాటాల విక్రయం ద్వారా రూ.80,000 కోట్లు సమీకరణ లక్ష్యాన్ని పెట్టుకుంది. దీంతో తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో నగదు నిల్వలు దండిగా ఉన్న కంపెనీలపై దృష్టి పెట్టింది. ఓఎన్‌జీసీ కూడా ఈ కోవలోకి వస్తుంది కనుక... హెచ్‌పీసీఎల్‌లో తనకున్న వాటాలను ఓఎన్‌జీసీతో కొనుగోలు చేయించడం ద్వారా రూ.36,000 కోట్లను కేంద్రం సొంతం చేసుకుంది. నిజానికి ఈ మొత్తంలో ఓఎన్‌జీసీ రూ.24,000 కోట్లను రుణంగా తీసుకుని మరీ హెచ్‌పీసీఎల్‌ను కొనుగోలు చేసింది. అయితే, సంస్థకు ఉన్న నగదు ప్రవాహాల బలంతో స్వల్ప కాలంలోనే రూ.14,000 కోట్ల వరకు రుణాన్ని తగ్గించుకుంది. ఇక మార్కెట్‌ పరిస్థితులు అననుకూలంగా ఉండడంతో, డివిడెండ్లు పెద్ద మొత్తంలో ఇవ్వాలని, మిగులు నిధులతో షేర్లను తిరిగి కొనుగోలు చేసే కార్యక్రమాలను చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో ఓఎన్‌జీసీకి కూడా కేంద్రం కోరికలను మన్నించక తప్పలేదు. హెచ్‌పీసీఎల్‌ కొనుగోలు నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు తాము డివిడెండ్లను చెల్లించలేమని లేదా బైబ్యాక్‌ చేపట్టలేమని  ఓఎన్‌జీసీ కేంద్రానికి తెలియజేసింది. అయినా, కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అదే పనిగా అభ్యర్థనలు వస్తుండడంతో, చివరికి 2.34 శాతం వాటాలను బైబ్యాక్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.4,022 కోట్లను ఖర్చు చేయనుంది.  

 

నిధులు ఏ రూపంలో...?
ఐవోసీలో ఓఎన్‌జీసీకి వాటా ఉంది. 134 కోట్ల షేర్లు ఉన్నాయి. ఐవోసీ ఒక్కో షేరుకు రూ.6.75 డివిడెండ్‌గా గత నెలలో ఇచ్చింది. ఈ రూపంలో రూ.903 కోట్ల నిధులు ఓఎన్‌జీసీకి వచ్చాయి. ఐవోసీ షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుండడంతో ఓఎన్‌జీసీ 3 శాతం వాటాలను విక్రయించనుంది. దీంతో మరో రూ.600 కోట్లు సమకూరనున్నాయి. మరో రూ.224 కోట్లు పీడీవీఎస్‌ఏ నుంచి డివిడెండ్‌ బకాయిలను అందుకుంది. వీటితో ఓఎన్‌జీసీ తాజాగా బైబ్యాక్‌ చేయడానికి కావాల్సిన మొత్తంలో 40 శాతం సమకూరతాయి. మిగిలిన మొత్తాన్ని రుణంగా తీసుకోవాల్సిందే. You may be interested

10,900 సమీపంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Monday 7th January 2019

అంతర్జాతీయ సానుకూల ట్రెండ్‌ ఫలితంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 10,900 పాయింట్ల స్థాయిని సమీపించింది. వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక ఉద్దీపన ఉపసంహరణ పాలసీ నుంచి వెనక్కుతగ్గే సంకేతాల్ని అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పొవెల్‌ వెల్లడించడంతో ప్రపంచ ప్రధాన మార్కెట్లు పెద్ద ర్యాలీ జరిపిన నేపథ్యంలో భారత్‌లో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్లకు అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.20 గంటలకు110 పాయింట్ల

స్వల్ప కాలం కోసం మూడు స్టాక్‌ రికమండేషన్లు

Sunday 6th January 2019

మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ చాలా చౌకగా మారాయని ఈక్విటీ99 వ్యవస్థాపకుడు సుమిత్‌ బిల్‌గయాన్‌ అన్నారు. గత రెండు నెలల్లో అమెరికా మార్కెట్లు చాలా అస్థిరతలకు గురయ్యాయని, ఇది మన మార్కెట్లపైనా ప్రభావం చూపించినట్టు పేర్కొన్నారు. మూడో త్రైమాసికం ఫలితాల సీజన్‌లోకి ప్రవేశించామని, ప్రధాన కంపెనీల్లో చాలా వరకు రానున్న 20 రోజుల్లో ఫలితాలు ప్రకటించనున్నాయని చెప్పారు. ఈ కాలంలో స్టాక్‌ వారీ కదలికలు ఉంటాయని అంచనా వేశారు. అస్థిరతల నేపథ్యంలో

Most from this category