STOCKS

News


పెట్రోమార్కెటింగ్‌ కంపెనీల డౌన్‌గ్రేడ్‌

Friday 5th October 2018
Markets_main1538721210.png-20888

బ్రోకరేజ్‌ సంస్థలు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల స్టాక్స్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాయి. కేంద్ర ప్రభుత్వం గరువారం సాయంత్రం లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2.50 తగ్గింపు ప్రకటించింది. రూ.2.50లో ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు రూ.1.50 అయితే, మరో రూ.1 ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తగ్గిస్తాయని పేర్కొంది. వ్యాట్‌ తగ్గింపును కలుపుకొని గుజరాత్‌, మహరాష్ట్ర రాష్ట్రాలు డీజిల్‌, పెట్రోల్‌ ధరలను లీటరుకు రూ.5 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. 
కేంద్ర ప్రభుత్వపు ప్రకటనతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు గురువారం చివరి పది నిమిషాల ట్రేడింగ్‌ సమయంలో భారీగా కుప్పకూలాయి. ఇక శుక్రవారం మార్నింగ్‌ సెషన్‌లోనూ ఇదే ట్రెండ్‌ కనిపించింది. ఉదయం 11:46 సమయంలో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) 18 శాతం క్షీణతతో రూ.272 వద్ద, హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) 22 శాతం క్షీణతతో రూ.169 వద్ద, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) 14 శాతం క్షీణతతో రూ.120 వద్ద ట్రేడవుతున్నాయి. ఒకానొక సమయంలో ఈ షేర్లు 20 శాతానికిపైగా పతనమయ్యాయి. 

ఆయిల్‌ షేర్లపై బ్రోకరేజ్‌ సంస్థల స్పందన..
► గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ.. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలపై ‘సెల్‌’ రేటింగ్‌ను కొనసాగించింది. ఐఓసీ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.155 నుంచి రూ.105కి తగ్గించింది. బీపీసీఎల్‌ టార్గెట్‌ ధరను రూ.390 నుంచి రూ.240కి, హెచ్‌పీసీఎల్‌ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.270 నుంచి రూ.150కి తగ్గించింది. కేంద్ర ప్రభుత్వపు చర్య వల్ల ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల ఈపీఎస్‌ 23-46 శాతంమేర తగ్గొచ్చని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. క్రూడ్‌ ధరలు మరింత పెరిగితే పరిస్థితి మరింత జఠిలంగా మారుతుందని తెలిపింది. ఓఎన్‌జీసీ, గెయిల్‌ షేర్లపై కూడా ప్రతికూల ప్రభావం పడొచ్చని పేర్కొంది. ఓఎన్‌జీసీ, గెయిల్‌ షేర్లు మార్నింగ్‌ సెషన్‌లో 10 శాతానికిపైగా పడ్డాయి. 
► కేంద్ర ప్రభుత్వపు ప్రకటన ఇండియన్‌ ఎనర్జీ విభాగంలో సమీప కాలంలో ఇన్వెస్ట్‌మెంట్లకు ప్రతికూల పరిస్థితులు తలెత్తాయని జేపీ మోర్గాన్‌ పేర్కొంది. ఐఓసీ, బీపీసీఎల్‌లపై ఎర్నింగ్స్‌ ప్రభావం ఉంటుందని, అయితే వీటి కన్నా హెచ్‌పీసీఎల్‌పై ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలిపింది. 
► ఐఓసీ, బీపీసీఎల్‌పై బై రేటింగ్‌ కొనసాగించింది మోతీలాల్‌ ఓస్వాల్‌. అయితే ఐవోసీ టార్గెట్‌ ధరను రూ.254 నుంచి రూ.164కి, బీపీసీఎల్‌ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.535 నుంచి రూ.393కి తగ్గించింది. హెచ్‌పీసీఎల్‌ రేటింగ్‌ను బై నుంచి న్యూట్రల్‌కు మార్చింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.428 నుంచి రూ.203కి తగ్గించింది. కేంద్ర ప్రభుత్వపు ప్రకటన వల్ల ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల ఈపీఎస్‌ 24-28 శాతంమేర తగ్గొచ్చని అంచనా వేసింది. 
► గోల్డ్‌మన్‌ శాక్స్‌ కూడా ఐఓసీ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.185 నుంచి రూ.125కి తగ్గించింది. బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ స్టాక్స్‌ను విక్రయించొచ్చని పేర్కొంది. బీపీసీఎల్‌ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.470 నుంచి రూ.260కి, హెచ్‌పీసీఎల్‌ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.345 నుంచి రూ.170కి తగ్గించింది. ఆయిల్‌ రిటైల్‌ మార్కెట్‌లో హెచ్‌పీసీఎల్‌ వాటా ఎక్కువగా ఉండటం వల్ల దీనిపైనే అధిక ప్రభావం ఉంటుందని పేర్కొంది. You may be interested

పాత తప్పిదాలే పుట్టి ముంచుతాయి

Friday 5th October 2018

ఆగస్టు నుంచి ఆరంభమైన సంక్షోభం ధాటికి దేశీయ మార్కెట్లలో దాదాపు 17 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. చిన్న ఇన్వెస్టర్ల నుంచి బడా హౌస్‌లవరకు అందరికీ ఈ దఫా గట్టి దెబ్బే తగిలింది. అయితే మార్కెట్లో దెబ్బలకు మన సొంత తప్పిదాలే అధిక కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎప్పుడూ చేసే తప్పులే మనకు తెలియకుండా రిపీట్‌ చేస్తుంటామని చెబుతున్నారు.  తాజా పతనంలో ఏమి నేర్చుకోవాలి... - ‘రోమ్‌ ఒక్కరోజులో నిర్మితం కాలేదు..

స్థూల ఆర్థికాంశాలు మారాయ్‌... ఎర్నింగ్స్‌ సమీక్షించాలి..

Friday 5th October 2018

ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు గురువారం రోజు 2 శాతానికిపైగా పతనమయ్యాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసని తెలిపారు. నిఫ్టీ తన 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ 10,777 పాయింట్ల దిగువకు వచ్చేసిందని పేర్కొన్నారు. సగటు కన్నా ఎక్కువ వ్యాల్యూమ్స్‌తో మార్కెట్లు పడిపోయాయని తెలిపారు. ఇది ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు విక్రయాలను తెలియజేస్తోందని, వీళ్లు ఐటీ సర్వీసెస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, పలు ప్రైవేట్‌ బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు సహా

Most from this category