STOCKS

News


చమురు ధరలు పతనంతో పెట్రో షేర్ల ర్యాలీ

Wednesday 14th November 2018
Markets_main1542175006.png-21990

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పతనం ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ(ఓఎంసీ) షేర్లకు కలిసొస్తుంది. అధిక డిమాండ్‌ , సరఫరా అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ఒక్కరోజులోనే 4.65 డాలర్ల పతనమై 65.03 డాలర్ల వద్దకు చేరుకున్నాయి. చమురుధరలు పతనంతో కంపెనీ మార్జిన్లు పెరుగవచ్చనే అంచనాలతో ఓఎంసీ షేర్ల ర్యాలీ కొనసాగుతోంది.  నేడు ఓఎంసీ షేర్లలో ప్రధానంగా హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీ షేర్లు 12శాతం ర్యాలీ చేశాయి. నిఫ్టీ-50 సూచీలో ఈ మూడు షేర్లు టాప్‌-5 గెయినర్లలో మొదటి మూడు స్థానాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఓంఎంసీ షేర్లకు ఇది రెండో రోజూ ర్యాలీ కావడం విశేషం. చమురు పతనంతో ఓఎంసీ షేర్లతో పాటు పెయింటింగ్‌, ఏవియేషన్‌ షేర్లలో కూడా లాభాల బాట పట్టాయి.
హెచ్‌పీసీఎల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.242ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఇంట్రాడేలో కొనుగోలు పెరగడంతో 12.50శాతం లాభపడి రూ.261.65 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:00లకు షేరు గతముగింపు ధర(రూ.232.80)తో 8.50శాతం లాభంతో రూ.252ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
బీపీసీఎల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.313.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఇంట్రాడేలో కొనుగోలు పెరగడంతో 8.50శాతం లాభపడి రూ.329.40 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:00లకు షేరు గతముగింపు ధర(రూ.303.15)తో 7శాతం లాభంతో రూ.325ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
ఐఓసీ:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.146.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఇంట్రాడేలో కొనుగోలు పెరగడంతో 10శాతం లాభపడి రూ.155.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:00లకు షేరు గతముగింపు ధర(రూ.141.40)తో 7శాతం లాభంతో రూ.152ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.You may be interested

టాటా స్టీల్‌ను మెచ్చిన అనలిస్టులు

Wednesday 14th November 2018

‘బై రేటింగ్‌’ కొనసాగించిన సీఎల్‌ఎస్‌ఏ ‘అవుట్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌’ ఇచ్చిన మాక్వైరీ ముంబై:  ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2018-19) రెండో త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో టాటా స్టీల్‌ లిమిటెడ్‌ షేరు ధర బుధవారం 4 శాతం మేర లాభపడింది. ఇంట్రాడేలో రూ.610.60 గరిష్టస్థాయిని తాకింది. క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో కంపెనీ నికర లాభం రూ.3,116 కోట్లుగా నమోదైనట్లు మంగళవారం టాటా స్టీల్‌ బోర్డ్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. ఏడాది ప్రాతిపదికన 269 శాతం వృద్ధిరేటు నమోదైనట్లు

కృష్ణపట్నం రైల్వేలో సాగరమాల పెట్టుబడులు

Wednesday 14th November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కృష్ణపట్నం రైల్వే కంపెనీలో (కేఆర్‌సీఎల్‌) సాగరమాల డెవలప్‌మెంట్‌ కంపెనీ రూ.125 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఓబుళాపురం, కృష్ణపట్నం పోర్ట్‌ రైల్‌ కారిడార్‌ అనుసంధానం కోసం ఈ నిధులను సమీకరించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 114 కిలోమీటర్ల ఈ ప్రాజెక్ట్‌ మొత్తం వ్యయం రూ.1,850 కోట్లు. ఈ మార్గం అనుసంధానంతో కృష్ణపట్నం పోర్ట్‌కు ఒకవైపు వెంకటాచలం, మరో మార్గంలో ఓబులాపురం అనుసంధానం అవుతాయి. రైల్వే వికాస్‌

Most from this category