STOCKS

News


క్రూడ్‌లో పెరిగిన షార్ట్‌ సెల్లింగ్‌

Saturday 17th November 2018
Markets_main1542444849.png-22145

  • 2011 నాటి గరిష్టస్థాయిని తాకిన బేరిష్‌ బెట్స్‌

ముంబై: ముడిచమురు ధరలు భారీగా పతనమయ్యాయి. గడిచిన వారం రోజుల్లో 6.2 శాతం నష్టపోయాయి. శుక్రవారం రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో డిసెంబర్‌ 18తో ముగిసే వెస్ట్ టెక్సాస్ ఇంటర్‌మీడియట్ (డబ్ల్యూటీఐ) బ్యారెల్‌ క్రూడ్‌ ధర 56.83 డాలర్ల వద్ద ముగిసింది. జనవరి 19తో ముగిసే బ్యారెల్‌ బ్రెంట్ ఆయిల్ ఫ్యూచర్స్ వారంతాన 67 డాలర్ల వద్ద ముగిసింది. సరిగ్గా ఆరు వారాల కిందట 87 డాలర్లు (2014 స్థాయి)కి చేరుకున్న బ్యారెల్‌ బ్రెంట్‌ ధర.. ఈనెల ప్రారంభం నుంచి క్రమంగా తగ్గుతూ, గరిష్టస్థాయి నుంచి ఇప్పటివరకు 20 డాలర్ల మేర పతనమైంది. ఇంతలా పడిపోయిన క్రూడ్‌ ధరలు మరింత పడిపోయే అవకాశం ఉందని సంకేతాలు అందుతున్నట్లు కమోడిటీ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. భారీగా తగ్గిపోతున్న ధరలు ఇక నుంచి మరింత తగ్గకుండా చూడడం కోసం పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్‌) తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం లేదని హెడ్జ్‌ ఫండ్స్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఓపెక్‌ సభ్యదేశాలన్నీ ముడిచమురు ఉత్పత్తిని రోజుకు 10 బ్యారెళ్ల మేర తగ్గించాలని ఒత్తిడి కొనసాగుతున్నప్పటికీ.. ఇది ఆచరణలో సాధ్యంకాకపోవచ్చనే అంచనాల నేపథ్యంలో డబ్ల్యూటీఐ ఫ్యూచర్‌ మార్కెట్‌ షార్ట్‌ సెల్లింగ్స్‌ గణనీయంగా పెరిగిపోయాయి. యూఎస్ కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడ్ కమీషన్, ఐసీఈ ఫ్యూచర్స్ యూరోప్‌ల సమాచారం మేరకు.. శుక్రవారం రోజున అత్యధిక షార్ట్‌ సెల్లింగ్స్‌ నమోదయ్యాయి. సెప్టెంబర్‌ 13తో పోల్చితే గడిచిన వారంలో బేరిష్‌ బెట్స్‌ ఏకంగా మూడు రెట్లు పెరిగినట్లు వెల్లడైంది. గడిచిన వారంలో అమెరికా వద్ద నిల్వలు అంచనాల కంటే మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు వెల్లడికావడంతో క్రూడ్‌లో షార్ట్‌ సెల్లింగ్స్‌ 2011 నాటి గరిష్టస్థాయికి చేరుకున్నాయి. 



You may be interested

ఇండియన్‌ హోటల్స్‌ కొనొచ్చు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

Saturday 17th November 2018

ముంబై:- ప్రముఖ రేటింగ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఇండియన్‌ హోటల్స్‌ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది.  ఆతిథ్య రంగంలో సేవలు అందించే ఇండియన్‌ హోటల్స్‌ షేరుపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషణ ఇలా ఉంది. రంగం:- హోటల్స్‌ రేటింగ్‌:- కొనొచ్చు టార్గెట్‌ ధర:- రూ.150 విశ్లేషణ:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే నమోదయ్యాయి. ఈ క్యూ2లో కంపెనీ రూ.960 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే ఇది 15శాతం అధికం.

ఎస్‌ఎంఎల్‌ ఇసుజుపై హెచ్‌డీఎఫ్‌సీ పాజిటివ్‌

Saturday 17th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఎస్‌ఎంఎల్‌ ఇసుజుపై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: ఎస్‌ఎంఎల్‌ ఇసుజు రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.675 టార్గెట్‌ ప్రైస్‌: రూ.904 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. ఎస్‌ఎంఎల్‌ ఇసుజుపై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.904గా నిర్ణయించింది. కంపెనీ క్యూ2లో మిశ్రమ పనితీరు కనబర్చిందని పేర్కొంది. రెవెన్యూ వార్షికంగా 30 శాతం మేర పెరిగిందని తెలిపింది. విక్రయాలు 28

Most from this category