STOCKS

News


ఆయిల్‌ షేర్లు కుదేలు..

Thursday 4th October 2018
Markets_main1538649568.png-20861

ఆయిల్‌ రంగ షేర్లు ట్రేడింగ్‌ చివరి అర గంటలో భారీగా పతనమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయిల్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు బ్యారెల్‌కు 86 డాలర్లకు చేరిన నేపథ్యంలో ప్రజలపై ఆ భారం పడకుండా ఉండేందుకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గిస్తున్నట్లు ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు. పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.2.50 తగ్గిస్తామని తెలిపారు. ఇందులో భాగంగానే రూ.1.50ను ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలో తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ ధరను రూ.1 తగ్గించాలని కోరారు. దీంతో ఆయిల్‌ రంగ స్టాక్స్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపుతో రాష్ట్రాలు సైతం వ్యాట్‌ను రూ.2.50 తగ్గించాలని అరుణ్‌ జైట్లీ కోరారు. 

నిఫ్టీ-50లో హిందుస్తాన్‌ పెట్రోలియం ఏకంగా 22 శాతంమేర పతనమైంది. ఇక బీపీసీఎల్‌ 19 శాతంమేర క్షీణించింది. ఐఓసీ 18 శాతంమే తగ్గింది. ఓఎన్‌జీసీ 10 శాతం నష్టపోయింది. 



You may be interested

రూపాయి 74 దాటదు!

Thursday 4th October 2018

టీసీఎస్‌ అంచనా వర్ధమాన కరెన్సీల్లో అధ్వాన్న ప్రదర్శన చూపుతున్న భారత రూపాయి కుదురుకుంటుందని టీసీఎస్‌ అంచనా వేస్తోంది. డాలర్‌తో  రూపాయి మారకం విలువ 74 దిగువకు రాదని అభిప్రాయపడింది. రూపీ బాటమ్‌ అవుట్‌ అయ్యేందుకు రెడీగా ఉందని టీసీఎస్‌ ట్రెజరీ హెడ్‌ వెంకటేశన్‌ చెప్పారు. ఒక్క నెల్లో రూపాయి దాదాపు 3 శాతం మేర క్షీణించింది. ఇతర వర్ధమాన కరెన్సీలన్నింటిలో రూపాయి మాత్రమే ఎక్కువగా పతనమైంది. గురువారం ట్రేడింగ్‌లో రూపాయి కొత్త

బేర్స్‌ స్వైరవిహారం

Thursday 4th October 2018

సెన్సెక్స్‌ నష్టం 806 పాయింట్లు 10600ల దిగువకు నిఫ్టీ బేర్స్‌ చేసిన వీరవిహారానికి గురువారం మార్కెట్‌ నిలువునా పతనమయ్యింది. క్రితం రోజు నష్టాల ముగింపునకు కొనసాగింపుగా నేడు కూడా బేర్స్‌ హల్‌చల్‌ చేశారు. రూపాయి కొత్త జీవిత కాల కనిష్టానికి పతనం కావడం, ముడిచమురు మంటలు, వాణిజ్య లోటు, దేశీయ మార్కెట్ల నుంచి ఇన్వెస్టర్లు తరలిపోవడం తదితరకారణాలు మార్కెట్లో బేర్స్‌ పట్టును సాధించడానికి కారణయ్యాయి. ట్రేడింగ్‌ ఆద్యంతం సాగిన బేర్స్‌లో వేటలో సెన్సెక్స్‌

Most from this category