STOCKS

News


క్రూడ్‌ తగ్గితే.. మార్కెట్‌ పరుగు!!

Tuesday 9th October 2018
Markets_main1539060535.png-20964

ఒకవేళ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 70 డాలర్లకు వస్తే అప్పుడు స్టాక్‌ మార్కెట్‌లో పెరుగుదల ఉండొచ్చని కోటక్‌ ఏఎంసీ ఎండీ నీలేశ్‌ షా తెలిపారు. ఇప్పటి నుంచి ముందుకెళ్లే కొద్దీ క్రూడ్‌ ధరలు, ఎన్నికలు.. మార్కెట్లను ప్రభావం చేస్తాయని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యలో ఈ విషయాలు వెల్లడించారు. డెట్‌ మార్కెట్‌, క్రెడిట్‌ మార్కెట్‌, కరెన్సీ మార్కెట్‌, ఆయిల్‌ మార్కెట్‌లలో ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయని తెలిపారు. క్రూడ్‌ ధరలు 55 డాలర్లన నుంచి 85 డాలర్లకు ఎగశాయని పేర్కొన్నారు. ఆయిల్‌ ధరల పెరుగుదల వల్ల భారత్‌ కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరిగిందని తెలిపారు. వడ్డీ రేట్ల కూడా పెరిగాయన్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగాయని పేర్కొన్నారు. అధిక క్రూడ్‌ ధరల వల్ల ద్రవ్యలోటు కట్టుతప్పొచ్చనే ఆందోళనలున్నాయని తెలిపారు. రూపాయి 74 స్థాయి దిగువకు పతనమైందని పేర్కొన్నారు. వీటన్నింటీ వల్ల లిక్విడిటీ తగ్గిందన్నారు. దీంతో ఎన్‌బీఎఫ్‌సీలకు గడ్డు పరిస్థితులు తలెత్తాయని తెలిపారు. క్రెడిట్‌ మార్కెట్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ సమస్య ఉందని పేర్కొన్నారు. క్రూడ్‌ ధరల పెరుగుదల, వడ్డీ రేట్ల పెంపు, కరెన్సీ క్షీణత, ద్రవ్యలోటు పెరుగుదల అంచనాలు, లిక్విడిటీ తగ్గుదల, క్రెడిట్‌ మార్కెట్‌ సమస్యలు వంటి అంశాలన్నీ ఈక్విటీ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని వివరించారు.
ఇండియన్‌ మార్కెట్లు ప్రీమియంతో ట్రేడవుతున్నాయని నీలేశ్‌ షా తెలిపారు. జవవరి 16న గత పదేళ్ల ప్రైస్‌-టు-బుక్‌  సగటుతో పోలిస్తే స్మాల్‌ క్యాప్స్‌ 33 శాతం ప్రీమియంతో, మిడ్‌క్యాప్స్‌ 25 శాతం ప్రీమియంతో, లార్జ్‌ క్యాప్స్‌ 10 శాతం ప్రీమియంతో ట్రేడయ్యాయని పేర్కొన్నారు. గత శుక్రవారం రోజున మిడ్‌ క్యాప్స్‌ 12 శాతం ప్రీమియంతో, స్మాల్‌ క్యాప్స్‌ 5 శాతం ప్రీమియంతో, లార్జ్‌ క్యాప్స్‌ 3 శాతం ప్రీమియంతో ట్రేడయ్యాయని తెలిపారు.  
వడ్డీ రేట్లు పరంగా చూస్తే.. రియల్‌ వడ్డీ రేట్లు 4 శాతానికి పైగా ఉన్నాయని నీలేశ్‌ షా తెలిపారు. ఈల్డ్స్‌ 100 బేసిస్‌ పాయింట్లకుపైగా పెరిగాయని పేర్కొన్నారు. క్రూడ్‌ ధరలు పెరిగినప్పటికీ ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందని తెలిపారు. బాండ్‌ ఈల్డ్స్‌ ప్రస్తుత స్థాయిల్లోనే నిలకడగా ఉండొచ్చని పేర్కొన్నారు. ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వపు చర్యల వల్ల లిక్విడిటీ సమస్య తటస్థంగా ఉందని తెలిపారు. రూపాయిలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. కొంత కాలంపాటు ప్రస్తుత స్థాయిల్లోనే కదలాడవచ్చని పేర్కొన్నారు. క్రెడిట్‌ మార్కెట్‌ నుంచి చూస్తే.. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ బోర్డును కేంద్రం రద్దు చేసిందని గుర్తుచేశారు. కొత్త బోర్డును నియమించిందని తెలిపారు. అందువల్ల సమస్య పరిష్కారమవ్వొచ్చని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటోందని, క్రెడిట్‌ సమస్యలను కాదని తెలిపారు. డెట్‌ మార్కెట్‌, క్రెడిట్‌ మార్కెట్‌, కరెన్సీ మార్కెట్‌, లిక్విడిటీ సమస్యల వల్ల స్టాక్స్‌ ధరలు తగ్గాయని పేర్కొన్నారు. మార్కెట్‌పై ఇంకా 10-15 శాతం నెగటివ్‌ ప్రభావం ఉండొచ్చని తెలిపారు. క్రూడ్‌ ధరలు 100 డాలర్లకు వెళ్లితే.. అప్పుడు స్టాక్‌ మార్కెట్‌ మరింత పడుతుందని పేర్కొన్నారు. 
 



You may be interested

భారీగా క్షీణించిన వెండి బంగారాలు.!

Tuesday 9th October 2018

ముంబై:- అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లో సోమవారం రాత్రి పసిడి, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. అమెరికా ట్రేడింగ్‌లో ఔన్సు బంగారం ధర 12 డాలర్ల మేర క్షీణిం‍చి 1,188 డాలర్ల వద్దకు చేరడం, వెండి ధర కూడా 2 శాతంపైగా పడిపోవడంతో పాటు గతరాత్రి ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి తొలిసారిగా 74స్థాయికి పైన ముగిసింది. ఫలితంగా గత రాత్రి ఎంసీఎక్స్‌లో 10గ్రాముల ధర ధర

‘బుల్‌’ను గుర్తించడం సులువు..

Tuesday 9th October 2018

బేర్‌ మార్కెట్‌ కన్నా బుల్‌ మార్కెట్‌ను గుర్తుపట్టడం సులువంటున్నారు ఫస్ట్‌ గ్లోబల్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శంకర్‌ శర్మ. ‘నేను చాలా బుల్‌ మార్కెట్లను చూశాను. అలాగే బేర్‌ మార్కెట్లను కూడా చూశాను. బుల్‌ మార్కెట్లను గుర్తుపట్టడం సులువు. స్టాక్స్‌కు ఒక స్థాయి అంటూ ఉంటుంది. అక్కడి దాకా అవి క్షీణించగలవు. ఏవీ సున్నా స్థాయికి అయితే పడిపోవు. అయితే మార్కెట్లు అలా కాదు. పడుతూ ఉంటాయి. పెరుగుతూ ఉంటాయి.

Most from this category