STOCKS

News


వెలుగులో పెట్రో మార్కెటింగ్‌ షేర్లు

Thursday 11th October 2018
Markets_main1539249948.png-21051

ప్రపంచమార్కెట్లో నెలకొన్న అమ్మకాల ట్రెండ్‌ భాగంగా మన మార్కెట్‌ భారీగా నష్టపోయినప్పటికీ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నేడు ముడిచమురు ధరలు రెండువారాల కనిష్టానికి చేరుకోవడంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ షేర్లు వెలుగులోకి వచ్చాయి.  కిరోసిన్‌, ఎల్‌పీజీల సబ్సిడీ భారాన్ని చమురు కంపెనీలపై మోపబోమం‍టూ ప్రభుత్వం  తెలిపింది. ఈ నేపథ్యంలో ఎంఓసీ షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలోని టాప్‌-5 గెయినర్లలో 5 షేర్లు అయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు షేర్లు కావడం విశేషం. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ షేర్లలో ప్రధాన షేర్లైన హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, గెయిల్‌, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌ షేర్లు 10.66శాతం నుంచి 3.66శాతం వరకు లాభపడ్డాయి. అత్యధికంగా హెచ్‌పీసీఎల్‌ షేరు 10.66శాతం లాభపడింది. అలాగే ఐఓసీ షేరు 4.50శాతం, బీపీసీఎల్‌ షేర్లు 4శాతం వరకు నష్టపోయాయి.You may be interested

మరో 15 శాతం పతనం మిగిలేఉంది!

Thursday 11th October 2018

నిపుణుల అంచనా దేశీయ మార్కెట్లో కరెక‌్షన్‌ క్లోజయిందని భావిస్తున్నారా? మెల్లగా కొనుగోళ్లు జరుపుతున్నారా? జాగ్రత్త... సూచీల్లో ఇంకో 15 శాతం పతనం మిగిలిఉందని మార్కెట్‌ పండితులు హెచ్చరిస్తున్నారు. సూచీలు తమ సరైన వాల్యూలకు ఇంకా 10- 15 శాతం అధికంగా ట్రేడవుతున్నాయని ప్రముఖ అనలిస్టు సౌరవ్‌ ముఖర్జీ చెప్పారు. 2008లో అంతర్జాతీయ సంక్షోభాన్ని ముందుగా ఊహించిన అనలిస్టుగా ఈయనకు మంచి పేరుంది. ప్రస్తుతం సూచీలు ఆగస్టు స్థాయిలతో పోలిస్తే దాదాపు 14

కరెక‌్షన్‌కు కారణాలేంటి?

Thursday 11th October 2018

ట్రేడ్‌ టెన్షన్లు, వడ్డీరేట్లు, కరెన్సీలే ప్రధాన భయాలు ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి తర్వాత మార్కెట్లు మహా పతనం చవిచూస్తున్నాయి. డౌజోన్స్‌ ఒక్కరోజులో 830 పాయింట్లకు పైగా పతనమై కీలక 26000 పాయింట్లను కోల్పోయింది. ఈ దెబ్బకు గురువారం అటు జపాన్‌ నుంచి ఇటు యూకే వరకు ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉన్నట్లుండి ఎందుకు మార్కెట్లలో ఇంతభారీ అమ్మకాలు ఆరంభమయ్యాయని సామన్య ఇన్వెస్టర్లు ఆందోళన పడుతున్నాడు. అయితే ఇది

Most from this category