STOCKS

News


ఆయిల్‌ ఇండియా బైబ్యాక్‌ క్రెడిట్‌ నెగటివ్‌-మూడీస్‌

Monday 26th November 2018
Markets_main1543226147.png-22392

ముంబై: ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్‌ ఇండియా షేరు ధర సోమవారం ట్రేడింగ్‌లో 2.9 శాతం పతనమైంది. ఇంట్రాడేలో రూ.199.2 వద్దకు పడిపోయింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఎన్‌ఎస్‌ఈలో రూ.5.6 (2.73 శాతం) నష్టపోయి రూ.199.55 వద్ద ట్రేడవుతోంది. కంపెనీ ప్రతిపాదించిన షేర్ల బైబ్యాక్‌ కారణంగా సంస్థ నికర రుణాలు మార్చి 2019 నాటికి రూ.11,000 కోట్లకు చేరేందుకు అవకాశం ఉందని మూడీస్‌ అంచనావేసింది. మార్చి 2018 నాటికి మొత్తం రుణాలు రూ.9,000 కోట్లుగా ఉన్నాయి. బైబ్యాక్‌ ప్రతిపాదన క్రెడిట్‌ నెగటివ్‌ అని పేర్కొంది. 4.45 శాతం వాటాకు సమానమైన మొత్తం 5.04 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయడానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని ఆయిల్‌ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో షేర్‌ను రూ.215 ధరకు బైబ్యాక్‌ చేస్తామని, ఈ షేర్ల బైబ్యాక్‌ విలువ రూ.1,085 కోట్ల వరకూ ఉండొచ్చని వివరించింది. ఇక కంపెనీ అంచనా పీఈ 7.17 వద్ద ఉండగా.. సెక్టార్‌ యావరేజ్‌ 8.78 వద్ద ఉంది. 



You may be interested

వచ్చే 2 వారాల కోసం 7 సిఫార్సులు..

Monday 26th November 2018

ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల రిత్యా ఎంపిక చేసిన షేర్లను మాత్రమే చూడడం మంచిదని పలువురు టెక్నికల్‌ అనలిస్టులు సూచిస్తు‍న్నారు. జీ20 సదస్సు వంటి పరిణామాలతో పాటు టెక్నికల్‌ అంశాలను బేరీజు వేసుకుని వచ్చే రెండు వారాల కోసం 7 సిఫార్సులను ప్రకటించారు. ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సిఫార్సులు బీఈఎంఎల్‌  | సిఫార్సు: కొనొచ్చు ​| టార్గెట్ ధరల శ్రేణి: రూ.810-830 | స్టాప్ లాస్‌: రూ.700 డాక్టర్ రెడ్డీస్ | సిఫార్సు: కొనొచ్చు ​| టార్గెట్

డిసెంబర్‌ సిరీస్‌ కోసం 10 సిఫార్సులు

Monday 26th November 2018

ముంబై: నవంబర్‌ ఎఫ్‌ అండ్‌ ఓ సిరీస్‌ ముగింపు కారణంగా ఈ వారంలో ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని టెక్నికల్‌ అనలిస్టులు భావిస్తున్నారు. నిఫ్టీ 10,700 పాయింట్ల కీలక మద్దతు స్థాయిని ఈ సిరీస్‌లో నిలుపుకోలేకపోయిందని, 10,774 పాయింట్ల సింగ్‌హై నుంచి 10,500 స్థాయికి పతనమైందని విశ్లేషించారు. 10,650 పాయింట్ల దిగువన ఉన్నంతవరకు అప్‌సైడ్‌ మూవ్‌ పరిమితంగానే ఉంటుందని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ చందన్ తపరియా అన్నారు. ప్రస్తుతం

Most from this category