STOCKS

News


రెండు వారాల కనిష్టానికి ముడిచమురు ధర

Thursday 11th October 2018
Markets_main1539234314.png-21043

అంతర్జాతీయంగా ముడిచమురు ధర గురువారం రెండువారాల కనిష్టానికి చేరుకుంది. గతరాత్రి అమెరికా మార్కెట్లో 2.25శాతం నష్టపోయిన చమురు ధర గురువారం ట్రేడింగ్‌లో మరింత నష్టపోయింది. ప్రపంచమార్కెట్లో నేడు బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ఫ్యూచర్‌ ధర 1.77 శాతం నష్టపోయి 81.60డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేటి ఇంట్రాడేలో 1.72 డాలర్ల వరకు నష్టపోయి 81.37డాలర్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. ఇది చమురు ధరకు రెండువారాల కనిష్టస్థాయి. అమెరికా ఇన్వెస్టరీలలో ఊహించిన దాని కంటే ఎక్కువగా చమురు నిల్వలు నమోదు కావడంతో చమురు ధర దిగివస్తోంది. గతవారంలో హరికేన్‌ తుఫాన్‌ ప్రభావంతో మూతపడిన ఫ్లోరిడా చమురు యూనిట్‌ తిరిగి పునఃప్రారంభం కావడం కూడా చమురు ధర చల్లారడానికి మరో కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా మార్కెట్లో బుధవారం రాత్రి బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ఫ్యూచర్‌ ధర 2.25శాతం నష్టపోయి 82.43 డాలర్ల వద్ద ముగిసింది.



You may be interested

పెరిగిన పసిడి ధర

Thursday 11th October 2018

అంతర్జాతీయ మార్కెట్లో గురువారం పసిడి ధర పెరిగింది. ప్రపంచమార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవ్వడం, డాలర్‌ ఇండెక్స్‌ తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమయ్యాయి. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం 10:30ని.లకు ఔన్స్‌ పసిడి 3.30డాలర్లు పెరిగి 1,196.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బుధవారం రాత్రి అమెరికా మార్కెట్లు మూడు నెలల కనిష్టస్థాయికి పడిపోవడంతో, నేడు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు యెన్‌ కరెన్సీ నేడు

ఎన్‌బీఐతో ఎస్‌బీఐ ఒప్పందం

Thursday 11th October 2018

ముంబై: ఖాట్మండు నేషనల్‌ బ్యాంకింగ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌బీఐ)తో అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేసినట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. మౌలిక , పరిపాలనా సదుపాయాలను ఇరు సంస్థలు వినియోగించుకునేందుకు ఈ ఎంఓయూ వీలు కల్పిస్తుందని వివరించింది. బ్యాంకింగ్‌ రంగంలో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన మానవ వనరులను సమకూర్చడం కోసం వ్యూహాత్మక కూటమి ఏర్పాటు ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని పేర్కొంది.

Most from this category