STOCKS

News


క్రూడ్‌ క్రాష్‌...భారత్‌కు లబ్ది

Wednesday 14th November 2018
Markets_main1542174269.png-21988

65.03 డాలర్లకు పతనమైన బ్రెంట్‌ క్రూడ్‌
ఒక్కరోజులోనే 4.65 డాలర్ల పతనం
అభివృద్ధి చెందుతున్న దేశాలకు సానుకూలం

ముంబై: ముడిచమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజులోనే 7.1 శాతం పడిపోయాయి.  మంగళవారం రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో జరిగినఈ భారీ పతనం.. గడిచిన మూడేళ్లలో అతి పెద్దది.  జనవరి 19తో ముగిసే బ్యారెల్‌ బ్రెంట్ ఆయిల్ ఫ్యూచర్స్ బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో 65.03 డాలర్ల కనిష్టస్థాయిని నమోదుచేసింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి (భారత కాలమానం ప్రకారం) 70 డాలర్ల వద్ద బ్రెంట్‌ ధర.. ఒక్కరోజులోనే 5 డాలర్ల మేర పతనమైంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్‌మీడియట్ (డబ్ల్యూటీఐ) బ్యారెల్‌ క్రూడ్‌ ధర ఇంట్రాడేలో 55.15 డాలర్ల కనిష్టస్థాయికి పడిపోయింది. సరిగ్గా ఆరు వారాల కిందట 87 డాలర్లు (2014 స్థాయి)కి చేరుకున్న బ్యారెల్‌ బ్రెంట్‌ ధర.. ఈనెల ప్రారంభం నుంచి క్రమంగా తగ్గుతూ, గరిష్టస్థాయి నుంచి 22 డాలర్ల మేర పతనమైంది. ముడిచమురు ధరలను నిలబెట్టడంలో భాగంగా సౌదీ అరేబియా చమురు శాఖ మంత్రి ఖలీద్ అల్ ఫలీహ్ చేసిన కీలక వ్యాఖ్య ఇంతటి భారీ పతనానికి కారణమని కమోడిటీ రంగానికి చెందిన మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. తాజాగా జరిగిన వరల్డ్‌ పెట్రోలియం ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫెరెన్స్‌లో మాట్లాడిన ఆయన రోజుకు 10 లక్షల బ్యారెళ్ల వరకు ముడిచమురు ఉత్పత్తిని తగ్గించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఈ వ్యాఖ్యపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తనదైన శైలిలో ట్వీట్‌ చేసి ధరల పతనానికి బాటలువేశారు. ‘సౌదీ అరేబియా, పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమైన ఒపెక్‌లు తాము అనుకుంటున్న విధంగా ఉత్పత్తిలో కోత విధించే అవకాశం లేదని భావిస్తున్నాను. సప్లై పెరుగుతున్న కారణంగా ముడిచమురు ధరలు దిగువస్థాయిలకు చేరుకునే అవకాశం ఉంది.’ అని తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. ఈయన చేసిన కామెంట్‌కు క్రూడ్‌ ధరలు ప్రభావితమై మంగళవారం భారీగా పనమయ్యాయి. ట్వీట్‌ అనంతరం.. అవుట్‌లుక్‌పై నెలకొన్న నీలినీడల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడి క్రూడ్‌ ధరలు నేలకు దిగివచ్చేలా చేశారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలపై పతన ప్రభావం
ముడిచమురు దిగుమతులపై ఆధారపడుతున్న ఎమర్జింగ్‌ మార్కెట్లపై ఒపెక్‌ ఉత్పత్తి కోత నిర్ణయం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఈ నిర్ణయం పెను సవాలుగా మారనుంది. కరెన్సీ విలువ కుప్పకూలి పోవడం, కరెంట్‌ ఖాతాలోటు పెరిగిపోవడం వంటి తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి. అయితే, ట్రంప్‌ ట్వీట్‌తో మారిన ముడిచమురు మార్కెట్‌ పరిణామాలు అభివృద్ధి చెందుతున్న దేశాల భారీ ఊరటనిచ్చాయి. వారాల వ్యవధిలోనే బ్యారెల్‌ బ్రెంట్ ఆయిల్ 22 డాలర్ల మేర తగ్గిపోవడంతో ఈ దేశాలకు అధిక మొత్తంలో ప్రయోజనం చేకూరుతోంది. ముడిచమురు ధరల తాజా పతనం వల్ల భారత రూపాయి మారకం విలువకు, టర్కీ కరెన్సీ లిరాకు ప్రయోజనం చేకూరుతుందని సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఫారెన్‌ ఎక్స్ఛేంజ్‌ నట్‌వెస్ట్ మార్కెట్స్ సంస్థ నిపుణులు మన్సూర్ మోహిఉద్దీన్‌ అన్నారు. 
 



You may be interested

కృష్ణపట్నం రైల్వేలో సాగరమాల పెట్టుబడులు

Wednesday 14th November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కృష్ణపట్నం రైల్వే కంపెనీలో (కేఆర్‌సీఎల్‌) సాగరమాల డెవలప్‌మెంట్‌ కంపెనీ రూ.125 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఓబుళాపురం, కృష్ణపట్నం పోర్ట్‌ రైల్‌ కారిడార్‌ అనుసంధానం కోసం ఈ నిధులను సమీకరించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 114 కిలోమీటర్ల ఈ ప్రాజెక్ట్‌ మొత్తం వ్యయం రూ.1,850 కోట్లు. ఈ మార్గం అనుసంధానంతో కృష్ణపట్నం పోర్ట్‌కు ఒకవైపు వెంకటాచలం, మరో మార్గంలో ఓబులాపురం అనుసంధానం అవుతాయి. రైల్వే వికాస్‌

ఎన్‌సీసీ లాభం రూ.125 కోట్లు

Wednesday 14th November 2018

హైదరాబాద్‌: సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో ఎన్‌సీసీ నికర లాభం రూ.125.65 కోట్లకు చేరింది. గత ఆర్ధిక సంవత్సరం ఇదే సమయానికి లాభం రూ.20.30 కోట్లుగా ఉంది. 2017 క్యూ2లో రూ.1,342 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఇప్పుడు 134 శాతం వృద్ధితో రూ.3,137 కోట్లకు చేరింది. ఎబిటా రూ.365 కోట్లకు చేరింది.  

Most from this category