STOCKS

News


అమ్మో! అక్టోబర్‌..

Tuesday 2nd October 2018
Markets_main1538477645.png-20800

మహా పతనాలన్నీ ఈ నెల్లోనే 
మరోమారు రిపీటవుతుందా?

మార్కెట్లపై మార్క్‌ట్వయిన్‌ అద్భుతమైన కొటేషన్‌ తెలుసా..

‘ స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్టర్లకు ప్రమాదకరమైన నెలల్లో అక్టోబర్‌ ఒకటి. మిగిలినవి.. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌, నవంబర్‌, డిసెంబర్‌.’

..అంటే ఏడాదంతా ఇన్వెస్టర్లకు ప్రమాదమేనని ట్వయిన్‌ ఛలోక్తి..

కానీ నిజంగా కొందరు ఇన్వెస్టర్లు అక్టోబర్‌ అంటే గడగడా వణికిపోతారు. ఇది ఎంతవరకు కరెక్టో చూద్దాం....

స్టాక్‌ మార్కెట్లకు అక్టోబర్‌ నెల వచ్చిందంటే దడ మొదలవుతుంది. గతంలో వచ్చిన మహా పతనాలన్నీ అక్టోబర్‌ నెలలోనే ఎక్కువగా వచ్చాయి. యూఎస్‌ మార్కెట్లలో 1929 గ్రేట్‌ క్రాష్‌, 1987 వన్‌డే క్రాష్‌, 2008లో దేశీయ మార్కెట్లలో వచ్చిన 25 శాతం పతనం.. ఇవన్నీ అక్టోబర్‌లోనే వచ్చాయి. ప్రస్తుతం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కరెక‌్షన్‌ కొనసాగుతోంది. ఈ సమయంలో అక్టోబర్‌ నెల ఎంటరయింది. దీంతో ఈ దఫా మరో భారీ పతనం వస్తుందన్న భయాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులన్నీ మరో మహా పతనాన్ని సూచిస్తున్నాయని, అది ఈ నెల్లోనే ఉంటుందని చెబతున్నారు. కానీ ఈ భయాలు అనవసరమని, కొన్నిసార్లు మినహా ఎక్కువసార్లు అక్టోబర్‌లో ఈక్విటీలు పాజిటివ్‌గానే స్పందించాయని మార్కెట్‌ నిపుణులు భరోసా ఇస్తున్నారు. అక్టోబర్‌లో ఒడిదుడుకులు అధికంగా ఉండొచ్చు కానీ భారీ పతనానికి అవకాశం తక్కువని చెబుతున్నారు. గతంతో పోలిస్తే మార్కెట్‌ నిర్మాణంలో చాలా మార్పులు వచ్చాయంటున్నారు.

బీస్పోక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌ డేటా ప్రకారం మార్కెట్లలో ఇన్వెస్టర్లను భయపెట్టేది ఎక్కువగా సెప్టెంబర్‌ నెలని తేలింది. అక్టోబర్‌ సరాసరిన పాజిటివ్‌గా ఉంటుందని తెలిపింది. గత శతాబ్ధకాలపు డేటా చూస్తే అమెరికా మార్కెట్లు అక్టోబర్‌లో సరాసరిన 0.40 శాతం పాజిటివ్‌ వార్షిక రాబడినిచ్చాయి. 50 సంవత్సరాల డేటా చూస్తే 0.84 శాతం పాజిటివ్‌ వార్షిక రాబడినిచ్చాయి. 20 సంవత్సరాల గణాంకాలు పరిశీలిస్తే ఇరవై ఏళ్లలో పదిహేను మార్లు అక్టోబర్‌లో మార్కెట్‌ పాజిటివ్‌గా ముగిసింది. ఈ ఇరవైఏళ్లలో డాట్‌కామ్‌ సంక్షోభం, 2008 సంక్షోభం, 13ఏళ్ల బేర్‌ మార్కెట్‌ వచ్చాయి. దీన్ని బట్టి అక్టోబర్‌లో మార్కెట్లు ఎక్కువమార్లు పాజిటివ్‌గానే ఉన్నాయని తెలుస్తోంది. గత పదేళల్లో ఐదు మార్లు మార్కెట్లు అక్టోబర్‌లో గ్రీన్‌లో క్లోజయ్యాయి. అయితే గతంలో భారీ పతనాలు(1929, 1987, 2008) అక్టోబర్‌లో రావడంతో ఈ నెలంటే ఇన్వెస్టర్లు కాస్త భయపడడం జరుగుతోంది. ఇవి తప్ప మిగిలిన మహా పతనాలు అక్టోబర్‌ నెలలో రాలేదని ఎకనమిస్టులు గుర్తు చేస్తున్నారు. ఉదాహరణకు టెక్‌ బబుల్‌ పతనం 2000 మార్చిలో, ఫ్లాష్‌క్రాష్‌ 2010 మేలో, 1901 మేలో, 1921 ఆగస్టులో, 2008 జనవరిలో పెద్ద పతనాలు వచ్చాయి. నిజానికి ఈ నెల్లో పతనం రావాలి, ఆ నెల్లో రాకూడదని రూలేం లేదు. పతనమైనా, ర్యాలీ అయినా ఎప్పుడైనా రావచ్చు. అందువల్ల దీర్ఘకాలిక ధృక్పథంతో నాణ్యమైన షేర్లను ఎంచుకోవడమే ఇందుకు విరుగుడని నిపుణులు సూచిస్తున్నారు. 


ఈ అక్టోబర్‌లో 10557 పాయింట్ల పైన నిఫ్టీ కదలాడినంతవరకు ఇబ్బంది లేదని, దీన్ని కాపాడుకోలేకుంటే మరింత పతనం తప్పదని అనలిస్టుల అంచనా. పైస్థాయిలో 11500 పాయింట్లను దాటితేనే మార్కెట్‌ బుల్లిష్‌గా మారుతుందని అంచనా. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Wednesday 3rd October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:43 సమయంలో 49 పాయింట్ల లాభంతో 11,006 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 11,061 పాయింట్లతో పోలిస్తే 55 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ బుధవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అమెరికా

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై మోర్గాన్‌ స్టాన్లీ బుల్లిష్‌

Tuesday 2nd October 2018

గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ మోర్గాన్‌ స్టాన్లీ.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై ఓవర్‌వెయిట్‌తో ఉంది. ఇటీవలి కరెక‌్షన్‌ తర్వాత వ్యాల్యుయేషన్స్‌ ఆకర్షణీయంగా మారాయని పేర్కొంది. బ్యాలెన్స్‌ షీటు పటిష్టంగా ఉందని, రుణాల్లో బలమైన వృద్ధి అంచనాలున్నాయని తెలిపింది. స్థూల ఆర్థికాంశాలు మెరుగుపడి.. రుణ వృద్ధి పుంజుకుంటే.. అప్పుడు స్టాక్‌ ధర ఏడాది కాలంలో రూ.3,020 స్థాయికి చేరొచ్చని అంచనా వేసింది. సోమవారం నాటి  ముగింపు రూ.2,035 స్థాయితో పోలిస్తే దాదాపు 51 శాతం

Most from this category