ఎన్టీపీసీ టార్గెట్ ధరను తగ్గించిన సిటీ
By Sakshi

ముంబై: ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్టీపీసీ షేరు ధర సోమవారం ట్రేడింగ్‌లో 52 వారాల కనిష్టస్థాయిని తాకింది. ఇంట్రాడేలో రూ.141.70 వద్దకు పడిపోయింది. ఉదయం 12 గంటల సమయానికి ఎన్ఎస్ఈలో రూ.3.55 (2.43 శాతం) నష్టపోయి రూ.142 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరుకు పలు దిగ్గజ బ్రోకింగ్ సంస్థలు టార్గెట్ ధరలను వరుసగా తగ్గిస్తున్న నేపథ్యంలో షేరు ధరలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం (క్యూ1, ఏప్రిల్-జూన్)లో కంపెనీ నికర లాభం 1.15 శాతం క్షీణతతో రూ.2,588 కోట్లకు తగ్గిన విషయం తెలిసిందే. ఫలితాల అనంతరం (ఈనెల 5న) డాయిషీ బ్యాంక్ సంస్థ షేరు టార్గెట్‌ను అంతకుముందు ఇచ్చిన రూ.200 నుంచి రూ.190 వద్దకు తగ్గించినట్లు ప్రకటించింది. అదే సమయంలో రూ.203 టార్గెట్‌తో బై రేటింగ్ ఇచ్చిన సిటీ.. తాజాగా టార్గెట్ ధరను రూ.190 వద్దకు సవరించింది. ఫైనాన్స్ వ్యయం పెరగడం వంటి కీలక అంశాల ఆధారంగా టార్గెట్‌ను తగ్గించినట్లు వెల్లడించింది.
You may be interested
నష్టాల బాటలో మెటల్ షేర్ల పయనం
Monday 26th November 2018మిడ్‌సెషన్ సమయానికి సూచీలు ప్రారంభ లాభాల్ని కోల్పోయి పరిమితి శ్రేణిలో ట్రేడ్ అవుతున్నాయి. ఈ క్రమంలో మెటల్ షేర్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో మెటల్ ధరలు పెరుగుతున్ననేపథ్యంలో రానున్న రోజుల్లో కంపెనీల మార్జిన్లు తగ్గవచ్చనే అంచనాలతో మెటల్ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్ఎస్ఈలో మెటల్ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్ ఇండెక్స్ నేటి ట్రేడింగ్‌లో 3శాతానికి పైగా నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్ గత ముగింపు(3,214)తో పోలిస్తే
చిన్నారులకు మీరిచ్చే కానుక
Monday 26th November 2018చిన్నారులకు మీరిచ్చే కానుక హెచ్డీఎఫ్సీ చిల్ట్రన్స్ గిఫ్ట్ ఫండ్ చిన్నారుల భవిష్యత్తు అవసరాల కోసం ఓ నిధి ఏర్పాటు చేసుకోవాలని భావించే వారు పరిశీలించతగిన పథకాల్లో హెచ్డీఎఫ్సీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ కూడా ఒకటి. సెబీ సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ విభాగంలోకి ఇది వస్తుంది. గతంలో ఈ తరహా పథకాల్లో మూడేళ్ల పాటు లాకిన్ పీరియడ్ ఉండేది. ఇటీవల సెబీ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీల పునర్వ్యవస్థీకరణ తర్వాత... ఈ పథకంలో లాకిన్ అన్నది