STOCKS

News


నిఫ్టీ 50లో వీక్లీ ఆప్షన్లు

Wednesday 19th December 2018
Markets_main1545194377.png-23070

న్యూఢిల్లీ: నిఫ్టీ-50 సూచీలో వీక్లీ ఆప్షన్లకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. దీంతో ట్రేడర్లకు తమ పోర్ట్‌ఫోలియో నష్టభయాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించుకోవడానికి తాజాగా మరో హెడ్జింగ్‌ టూల్‌ లభించనున్నది. మరోవైపు సెన్సెక్స్‌కు సంబంధించిన వీక్లీ ఫ్యూచర్స్‌, ఆప్షన్ల కాంట్రాక్టులను ఈ నెల 21 నుంచి అందుబాటులోకి తేనున్నామని బీఎస్‌ఈ తెలిపింది. 
ప్రతి గురువారం ఎక్స్‌పైరీ...
నిఫ్టీ 50 సూచీ వీక్లీ ఆప్షన్లకు ట్రేడర్లు, ఇన్వెస్టర్ల స్పందన ఎలా ఉండనుందో ప్రస్తుతం మదింపు చేస్తున్నామని ఎన్‌ఎస్‌ఈ ఎమ్‌డీ సీఈఓ విక్రమ్‌ లిమాయే తెలిపారు. నీఫ్టీ వీక్లీ ఆప్షన్లకు ఎప్పటి నుంచి అందుబాటులోకి తెచ్చేది త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఏడు వరుస వారాల వీక్లీ ఆప్షన్లు అందుబాటులోకి తేనున్నామని తెలిపారు. ఈ వీక్లీ ఆప్షన్లు ప్రతి గురువారం ఎక్స్‌పైరీ అవుతాయని పేర్కొన్నారు. ఒకవేళ గురువారం మార్కెట్‌కు సెలవు రోజు అయితే, అంతకు ముందటి ట్రేడింగ్‌ రోజును ఎక్స్‌పైరీ డేగా పరిగణిస్తారు. ప్రస్తుతమున్న మూడు నెలల, మూడు క్వార్టర్లు, ఎనిమిది సెమీ-యాన్యువల్‌ ఆప్షన్‌ కాంట్రాక్టులు కొనసాగుతాయని వివరించారు. నిఫ్టీ బ్యాంక్‌ సూచీలో వీక్లీ ఆప్షన్లకు మంచి స్పందన లభిస్తోందని, దీంతో నిఫ్టీ 50 సూచీలో కూడా వీక్లీ ఆప్షన్లకు డిమాండ్‌ పెరిగిందని పేర్కొన్నారు. 


 



You may be interested

యూఐడీఏఐకి మరిన్ని అధికారాలు

Wednesday 19th December 2018

న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన ఆధార్ చట్ట సవరణల ప్రతిపాదనల ప్రకారం విశిష్ట గుర్తింపు సంఖ్యల ప్రాధికార సంస్థ యూఐడీఏఐకి మరిన్ని అధికారాలు లభించనున్నాయి. ఒక రకంగా నియంత్రణ సంస్థ పాత్ర పోషించనుంది. బయోమెట్రిక్‌ ఐడీ దుర్వినియోగం చేసే వారిపైనా, నిబంధనలు ఉల్లంఘించేవారిపైనా భారీగా జరిమానాలు విధించేందుకు కూడా దీనికి అధికారాలు దఖలుపడనున్నాయి. సవరణ ప్రతిపాదనల ప్రకారం.. ఆధార్ డేటాబేస్‌లోకి అనధికారికంగా చొరబడిన పక్షంలో 10 ఏళ్ల దాకా కఠిన

ఫండ్ వ్యాపారానికి డీహెచ్‌ఎఫ్‌ఎల్ గుడ్‌బై

Wednesday 19th December 2018

ముంబై: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రామెరికా అసెట్ మేనేజర్స్‌ మ్యూచువల్ ఫండ్ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు గృహ రుణాల సంస్థ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్‌ఎఫ్ఎల్‌) వెల్లడించింది. జాయింట్ వెంచర్‌లో తమకున్న మొత్తం వాటాలను భాగస్వామి ప్రుడెన్షియల్‌ ఫైనాన్షియల్‌కు విక్రయిస్తున్నామని, డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రామెరికా ట్రస్టీస్ నుంచి కూడా పూర్తిగా తప్పుకుంటున్నామని పేర్కొంది. 2015లో ఫండ్ వ్యాపారంలో 50 శాతం వాటాలను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కొనుగోలు చేసింది. ఇందులో 17.12 శాతం వాటాలు నేరుగా, 32.88

Most from this category