STOCKS

News


అక్టోబరు 12న ఎన్‌ఎస్‌ఈ కమోడిటీ డెరివేటివ్స్‌

Saturday 29th September 2018
Markets_main1538201921.png-20704

న్యూఢిల్లీ: కమోడిటీ డెరివేటివ్స్‌ ప్రారంభానికి ముహుర్తం ఖరారైనట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) ప్రకటించింది. అక్టోబరు 12న ఈ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లు ఒక ప్రకటన ద్వారా వెల్లడించిన ఎన్‌ఎస్‌ఈ.. సభ్యులందరి సూచన మేరకు ఈ ముహుర్తాన్ని నిర్ణయించినట్లు తెలిపింది. అక్టోబరు ఒకటి నుంచే సేవలు ప్రారంభంకావాల్సి ఉన్నప్పటికీ.. సమయాన్ని పొడిగించడం వల్ల మార్కెట్‌ ఇంటర్‌మీడియరీస్‌కు సౌకర్యవంతంగా ఉంటుందనే సభ్యుల సూచనలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించింది. తగిన వ్యవస్థ ఏర్పాటుకు సమయం ఇవ్వడం, నవరాత్రి ప్రారంభం తరువాత ముహుర్తం ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ విభాగ ప్రారంభానికి సెప్టెంబరు 19న సెబీ నుంచి అనుమతులు పొందగా.. గోల్డ్‌ 1కేజీ, గోల్డ్‌ మినీ 100 గ్రామ్‌, సిల్వర్‌ 30 కేజీ ఫ్యూచర్‌ కాంట్రాక్టుల ట్రేడింగ్‌కు తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు వివరించింది. మరోవైపు బొంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ) అక్టోబరు 1న కమోడిటీ డెరివేటివ్స్‌ ప్రారంభించనుంది. 



You may be interested

భారత్‌ విదేశీ మారక నిల్వలు 402 బిలియన్‌ డాలర్లు

Saturday 29th September 2018

ముంబై: భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు సెప్టెంబర్‌ 21వ తేదీతో ముగిసిన వారంలో స్వల్పంగా 1.3 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. దీనితో మొత్తంగా 401.79 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  విదేశీ మారక నిల్వలు 2018 ఏప్రిల్‌ 13తో ముగిసిన వారంలో 426.02 బిలియన్‌ డాలర్లతో రికార్డు స్థాయికి చేరాయి. అటు తర్వాత కొంచెం ఒడిదుడుకులతో ప్రస్తుత స్థాయికి తగ్గుతూ వచ్చాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా విడుదల

ఇన్ఫీబీమ్‌కు వాట్సాప్‌ మెసేజ్‌ డ్యామేజ్‌ !

Saturday 29th September 2018

న్యూఢిల్లీ: ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌ షేర్‌ శుక్రవారం 70 శాతం.. అక్షరాలా 70 శాతం క్షీణించింది. బీఎస్‌ఈలో గురువారం రూ.196  వద్ద ముగిసిన ఈ షేర్‌ శుక్రవారం 70.24 శాతం(రూ.139) నష్టపోయి రూ.58.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 73 శాతం పతనంతో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.53.80ను తాకింది. బీఎస్‌ఈలో 1.9 కోట్లు, ఎన్‌ఎస్‌ఈలో 15 కోట్లకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. ఒక్క రోజులోనే కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ ముప్పావు

Most from this category