STOCKS

News


పుత్తడి, వెండిల్లో కమోడిటీ డెరివేటివ్స్‌

Saturday 13th October 2018
Markets_main1539409318.png-21107

ముంబై: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) పుత్తడి, వెండిల్లో కమోడిటీ డెరివేటివ్స్‌ను శుక్రవారం నుంచి ప్రారంభించింది. కమోడిటీ డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌లో భాగంగా ముందుగా వ్యవసాయేతర కమోడిటీ డెరెవేటివ్స్‌ ట్రేడింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని ఎన్‌ఎస్‌ఈ ఎమ్‌డీ, సీఈఓ విక్రమ్‌ లిమాయే చెప్పారు. ఆ తర్వాత వ్యవపాయ ఉత్పత్తులను కూడా అందుబాటులోకి తెస్తామని వివరించారు. ప్రస్తుతం పుత్తడిలో ఒక కేపీ, 100 గ్రాములు, వెండి(30కేజీ) విభాగాల్లో కమోడిటీ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కాంట్రాక్టులు ఎక్స్‌పైరీ అయిన తర్వాత సదరు వస్తువులను అహ్మదాబాద్‌లో డెలివరీ చేస్తామని, త్వరలో అన్ని ప్రధాన మెట్రో నగరాలకు డెలివరీ సెంటర్లను విస్తరిస్తామని వివరించారు.



You may be interested

బిగ్‌ ఛాలెంజ్‌ డే..!

Saturday 13th October 2018

న్యూఢిల్లీ: దేశీ ఈ–కిరాణాలో హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ పోటీ దిగ్గజ విదేశీ కంపెనీలైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల మధ్యనే తారస్థాయిలో కొనసాగుతోంది. భారత ఆన్‌లైన్‌ అంగడిలో నెంబర్‌ వన్‌ ర్యాంకును, సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకోవడం కోసం పోటీకి ఎదురు నిలబడి... ఇరు సంస్థలు భారీ ప్రకటనలు, ధీటైన సవాళ్లతో హోరెత్తిస్తున్నాయి. జరుగుతున్నది పోటీనే అని నేరుగా ఒప్పుకోకపోయినా, ప్రత్యక్ష వ్యాఖ్యలతో చెప్పకనే చెబుతున్నాయి. ఇక్కడి మార్కెట్లో తమకు

ప్రభుత్వానికి రూ.6 లక్షల కోట్ల నష్టం

Saturday 13th October 2018

ముంబై: స్టాక్‌ మార్కెట్లలో దిద్దుబాటు కేంద్ర ప్రభుత్వానికీ భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. తాజా పతనంలో ప్రభుత్వరంగ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ గణనీయంగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ నష్టం రూ.6 లక్షల కోట్లకు పైమాటే. గణాంకాలను గమనిస్తే... 41 ప్రభుత్వరంగ కంపెనీల (పీఎస్‌యూలు) మార్కెట్‌ విలువ వాటి 52 వారాల గరిష్ట ధర నుంచి చూస్తే సగానికి పడిపోయింది. మరో 32 పీఎస్‌యూల మార్కెట్‌ విలువ 12- 44 శాతం మధ్యలో

Most from this category