STOCKS

News


21 కంపెనీలపై ఎన్‌ఎస్‌ఈ అదనపు నిఘా

Friday 8th February 2019
Markets_main1549564471.png-24074

ప్రముఖ స్టాక్‌ ఎక్సేంజ్‌ ఎన్‌ఎస్‌ఈ 21 కంపెనీలను అదనపు నిఘా చర్యల కార్యాచరణ (ఏఎస్‌ఎం) పరిధిలోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ జాబితాలో రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, రిలయన్స్‌ నేవల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, బినానీ ఇండస్ట్రీస్‌, బల్లార్‌పూర్‌ ఇండస్ట్రీస్‌, జీటీఎల్‌ ఇన్‌ఫ్రా, మంధన ఇండస్ట్రీస్‌, శ్రీ అధికారి బద్రర్స్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ ఉన్నాయి. ఓ కంపెనీ షేరు ధరల్లో గరిష్ట, కనిష్ట ధరల మధ్య వ్యత్యాసం, ఇంట్రాడే పొజిషన్లు, క్లయింట్లు, ఎన్ని సార్లు ప్రైస్‌బ్యాండ్‌ను హిట్‌ చేశాయి, పీఈ రేషియో తదితర అంశాల ఆధారంగా వాటిని ఎన్‌ఎస్‌ఈ ఏఎస్‌ఎం పరిధిలోకి తీసుకొస్తుంది. దీని పరిధిలో ఉన్న షేర్లకు మార్జిన్‌ రేటును ప్రస్తుతమున్న దానికి 1.5 రెట్లు లేదా 40 శాతం ఏది ఎక్కువైతే అది అమలవుతుంది. గరిష్ట మార్జిన్‌ రేటు 100 శాతం మించదు. పూర్తిగా మార్కె్‌ట్‌ నిఘా చర్యల ఆధారంగానే స్టాక్స్‌ను ఏఎస్‌ఎం పరిధిలోకి తీసుకురావడం జరుగుతుందని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. ఈ సమయంలో కంపెనీలపై కఠినమైన చర్యలు ఉండవని స్పష్టం చేసింది. భారీ వోలటాలిటీ ఉన్న స్టాక్స్‌లో ఏదైనా కృత్రిమ చర్యలు జరుగుతుంటే గుర్తించేందుకు తమ నిఘాను పటిష్టం చేయాలని స్టాక్‌ ఎక్సేంజ్‌లను సెబీ ఈ వారం కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏదైనా అవకతవకలు గుర్తిస్తే తమకు తెలియజేయాలని సెబీ ఆదేశించినట్టు పేర్కొన్నాయి. 

 

ఏడు కంపెనీలపై బీఎస్‌ఈ సస్పెన్షన్‌ వేటు
షెల్‌ కంపెనీలుగా అనుమానిస్తున్న ఏడు సంస్థలను శుక్రవారం నుంచి సస్పెండ్‌ చేయాలని మరో స్టాక్‌ ఎక్సేంజ్‌ బీఎస్‌ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ వెంచర్స్‌, బ్లూ సర్కిల్‌ సర్వీసెస్‌, ఐకేఎఫ్‌ టెక్నాలజీస్‌, ప్రభావ్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌టీ సర్వీసెస్‌, సిల్వర్‌పాయింట్‌ ఇన్‌ఫ్రాటెక్‌, వినీ కమర్షియల్‌ అండ్‌ ఫిస్కల్‌ సర్వీసెస్‌ ఉన్నట్టు బీఎస్‌ఈ తెలిపింది. నిర్ణీత కాలంలోపు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేసేందుకు ఈ కంపెనీలు సహకారం అందించలేదని స్టాక్‌ ఎక్సేంజ్‌ పేర్కొంది. షెల్‌ కంపెనీలుగా అనుమానిస్తున్న ఈ ఏడు కంపెనీలు సహా 18 సంస్థల ఖాతాలను ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేసేందుకు సెబీ ఆదేశించినట్టు బీఎస్‌ఈ తెలిపింది.You may be interested

ఈ స్టాక్స్‌లో భవిష్యత్తు రాబడులు?

Friday 8th February 2019

స్టాక్‌ ఎంపికే రాబడులకు కీలకమన్న విషయాన్ని ఇన్వెస్టర్లు అందరూ అంగీకరిస్తారు. మరి రాబడులను ఇచ్చేవి ఏవి? అన్న ప్రశ్న తలెత్తితే... అప్పుడు నిపుణులైన ఫండ్స్‌ మనేజేర్లు, వ్యాల్యూ ఇన్వెస్టర్లు చేసే కొనుగోళ్లు, అమ్మకాలను పరిశీలించొచ్చు. దేశంలో ఆస్తుల పరంగా అతిపెద్ద మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ జనవరి నెలలో బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, విద్యుత్‌, చమురు రంగాలకు చెందిన షేర్లను కొనుగోలు చేసింది. అలాగే, కొన్ని

సెన్సెక్స్‌ మైనస్‌ : నిఫ్టీ ప్లస్‌

Thursday 7th February 2019

ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయంతో మార్కెట్‌ గురువారం మిశ్రమంగా ముగిసింది. సెన్సెక్స్‌ 4పాయింట్ల స్వల్ప నష్టంతో 36,971 వద్ద, నిఫ్టీ 7పాయింట్ల స్వల్ప లాభంతో 11,069 వద్ద స్థిరపడ్డాయి. ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్ల తగ్గింపు నేపథ్యంలో అటో, ఫార్మా, ఎఫ్‌ఎంజీసీ రంగ షేర్లలో కొనుగోళ్లు జరగ్గా, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రియల్టీ రంగ షేర్లలో అమ్మకాలు జరిగాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 27,387 వద్ద

Most from this category