News


రాణిస్తున్న రియల్టీ రంగ షేర్లు

Monday 19th August 2019
Markets_main1566199351.png-27863

మార్కెట్‌లో నెలకొన్న కొనుగోళ్ల మద్దతులో భాగంగా రియల్టీ షేర్లు లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 1.50శాతానికి పైగా ర్యాలీ చేసింది. నేడు నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 266.40 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఇండెక్స్‌ ఒక దశలో 1.60శాతం ర్యాలీకి చేసి 269.35 స్థాయిని అందుకుంది. అత్యధికంగా ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్స్‌ షేరు​ 9శాతం పెరిగింది. ఫోనిక్స్ లిమిటెడ్స్‌, డీఎల్‌ఎఫ్‌ 3శాతం, ఓబేరాయ్‌ ఇండస్ట్రీస్‌, మహీంద్రా లైఫ్‌ డెవెలపర్స్‌, సన్‌ టెక్‌ షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, బ్రిగ్రేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అరశాతం లాభపడ్డాయి. మరోవైపు గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఇండియాబుల్‌రియల్‌ఎస్టేట్స్‌ షేర్లు అరశాతం వరకు నష్టపోయాయి. మధ్యాహ్నం గం.12:15ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(265.10)తో పోలిస్తే 1.20శాతం లాభంతో 268.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

భారత్‌ మార్కెట్‌ ఖరీదైనది

Monday 19th August 2019

ఇన్వెస్టర్లు యుఎస్‌ ఈక్విటీల నుంచి బయటకొచ్చి చైనా, జపాన్ మార్కెట్‌లలో ​ప్రవేశించాలని నోమురా, ఆసియా పసిఫిక్ ఈక్విటీ రీసెర్చ్‌ జాయింట్‌ హెడ్‌, జిమ్ మక్కాఫెర్టీ అన్నారు. ‘యుఎస్‌ ఆర్థిక వ్యవస్థను నడిపించే సం‍స్థలలో వాల్‌మార్ట్‌ ముందుంటుంది. ఈ కంపెనీ నుంచి కొన్ని మంచి ఫలితాలను చూశాను.  ఇది వినియోగదారుల విశ్వాసాన్ని తెలుపుతోంది. అదే విధంగా ఆసియా మార్కెట్లను పరిశీలిస్తే, చైనా దిగ్గజ సంస్థ అలీబాబా, మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్

10900- 11250 పాయింట్ల రేంజ్‌లో నిఫ్టీ!

Monday 19th August 2019

యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ నిఫ్టీ స్వల్పకాలానికి పరిమిత రేంజ్‌లోనే కదలాడుతుందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ రాజేశ్‌ పల్వియా అభిప్రాయపడ్డారు. సూచీల కదలికలపై ఆయన అంచనాలు ఇలా ఉన్నాయి... నిఫ్టీ గతవారం స్వల్ప రేంజ్‌లో కదలాడి చివరకు స్వల్ప నష్టంతో ముగిసింది. వీక్లీ చార్టుల్లో నిఫ్టీ బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. ప్రస్తుతం సూచీలు లోయర్‌టాప్‌, లోయర్‌ బాటమ్‌ ఫార్మేషన్‌లో కదలాడుతున్నాయి. ట్రెండ్‌ ఇంకా బలహీనంగానే కనిపిస్తోంది. చార్టుల ప్రకారం నిఫ్టీ 11100 పాయింట్ల పైన

Most from this category