STOCKS

News


నష్టాల్లో మెటల్‌ షేర్లు

Friday 30th November 2018
Markets_main1543560985.png-22522

బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్లు నష్టాల్లోకి మళ్లడంతో శుక్రవారం ట్రేడింగ్‌ సమయానికి సూచీలు ఆరంభ నష్టాల్ని కోల్పోయాయి. మెటల్‌ షేర్లు ఈవారంలో వరుసగా నాలుగురోజులు ర్యాలీ చేయడంతో ఈ రంగ షేర్లలో నేడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1శాతానికి పైగా నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గతముగింపు(3,177.25)తో పోలిస్తే 0.50 అరశాతం నష్టంతో 3,161 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో భాగమైన మొత్తం 15 షేర్లలో 10 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 5 షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా వెల్‌స్పాన్‌కార్పోరేషన్‌ 2శాతం నష్టపోయింది. కోల్‌ ఇండియా, వేదాంత లిమిటెడ్‌, జిందాల్‌ స్టీల్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి. టాటాస్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, నాల్కో, హిందూస్తాన్‌ కాపర్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు మెయిల్‌, హిందూస్థాన్‌ జింక్‌ 2శాతం లాభపడ్డాయి. జేఎస్‌ఎల్‌హిస్సార్‌ 1.50శాతం, ఏపిల్‌ అపోలో, సెయిల్‌ షేర్లు 1శాతం లాభపడ్డాయి. అలాగే ఎన్‌ఎండీసీ షేరు​ అరశాతం లాభపడింది.



You may be interested

టాటామోటర్స్‌ రివర్స్‌ గేర్‌..!

Friday 30th November 2018

4శాతం నష్టపోయిన టాటామోటర్స్‌ షేరు దేశీయ ఆటోరంగ దిగ్గజం టాటామోటర్స్‌ షేరు శుక్రవారం 4శాతం నష్టపోయింది. చైనాలో డిజిల్‌ కార్ల డిమాండ్‌ తగ్గడం, యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడం తదితర అంశాలతో టాటామోటర్స్‌ యూకే అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్‌ మోటర్స్‌ తమ ఉత్పత్తులను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అలాగే ఇంగ్లాండ్‌లోని తన ప్రధాన తయారీ ఇంజన్ల కార్మాగారం వోల్వెర్హాంప్టన్ యూనిట్‌ నుంచి 500 మంది ఉద్యోగులకు తాత్కలిక ఉద్వాసన

డిసెంబర్‌ సిరీస్‌కు షార్ట్‌ రోలోవర్స్‌..

Friday 30th November 2018

ఎన్నికల ఫలితాల ప్రభావమంటున్న విశ్లేషకులు ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ జోరు మీదుంది. ఐదో రోజు లాభాల్లోనే ట్రేడవుతోంది. అయితే ట్రేడర్లు వారి షార్ట్‌ పొజిషన్లను నవంబర్‌ నుంచి డిసెంబర్‌ సిరీస్‌కు ఫార్వర్డ్‌ చేసుకున్నారు. డిసెంబర్‌లో వెలువడనున్న ఎన్నికల ఫలితాలు ఇందుకు ప్రధాన కారణం కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్స్‌ రోలోవర్‌ 82 శాతంగా ఉంది. గత మూడు సిరీస్‌ల సగటు 81 శాతం కన్నా ఇది స్వల్పంగా ఎక్కువ

Most from this category