STOCKS

News


మార్కెట్లో మెటల్‌ షేర్ల మెరుపులు

Wednesday 29th August 2018
Markets_main1535526827.png-19760

ముంబై:- పరిమిత శ్రేణిలో ట్రేడ్‌ అవుతున్న మార్కెట్లో బుధవారం మెటల్‌ షేర్లు మెరుస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ సూచీలకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 2.50శాతానికి పైగా లాభపడింది. ఈ సూచీలో భాగమైన మొత్తం 15 షేర్లలో 10 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 5 షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మధ్యాహ్నం గం.12:15ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(3,597.20)తో పోలిస్తే 1.50శాతం లాభంతో 3,639.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి మెటల్‌ సూచీలో అత్యధికంగా జేఎస్‌డబ్ల్యూ షేరు 7శాతం లాభపడగా, జిందాల్‌ స్టీల్‌, జేఎస్‌ఎల్‌ హిస్సార్‌, నాల్కో, సెయిల్‌ షేర్లు 4నుంచి 2శాతం లాభపడ్డాయి. అలాగే వేదాంత, ఎన్‌ఎండీసీ, హిందూస్థాన్‌ జింక్‌ షేర్లు 1నుంచి అరశాతం వరుకు లాభపడ్డాయి. మరోవైపు ఇదే సూచీలోని ఏపిల్‌అపోలో, వెల్‌స్పాన్‌కార్ప్‌, కోల్‌ ఇండియా షేర్లు 3శాతం నష్టపోయాయి. మెయిల్‌, హిందాల్కో షేర్లు అరశాతం నష్టపోయాయి.

  • ఈ సూచీలోని వేదాంత లిమిటెడ్‌ 41ఆయిల్‌, గ్యాస్‌ బ్లాక్‌లను వేలంలో దక్కించుకుంది. ఫలితంగా నేటి ఎన్‌ఎస్‌ఈలో ట్రేడింగ్‌లో 2శాతానికి పైగా లాభపడింది.
  • ఇదే సూచీలోని జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ లుపిన్‌ స్థానంలో నిఫ్టీ-50లో చోటు దక్కించుకుంది. ఫలితంగా నేటి ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్‌లో 8శాతం లాభపడి 52-వారాల గరిష్టానికి తాకింది.



You may be interested

రూపీ: ఆల్‌టైమ్‌ కనిష్టానికి పతనం

Wednesday 29th August 2018

డాలర్‌ బలమైన డిమాండ్‌ నేపథ్యంలో రూపాయి బుధవారం జీవిత కాల కనిష్ట స్థాయికి పతనమైంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ మార్కెట్‌లో మధ్యాహ్నం 12:35 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఏకంగా 42 పైసలు క్షీణించి 70.52 స్థాయికి పడిపోయింది. 2018లో ఆసియా కరెన్సీల్లో కెల్లా ఇండియన్‌ రూపాయే అత్యంత చెత్త పనితీరు కనబరచింది. ఈ ఏడాది మొత్తంగా ఇది 9.82 శాతమేర క్షీణించింది. కాగా అమెరికా డాలర్‌తో పోలిస్తే

నిఫ్టీ ఇండెక్స్‌ స్టాక్స్‌: బంపర్‌ రిటర్న్స్‌

Wednesday 29th August 2018

దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియాపై తొలినాళ్లలో ఎవరైతే విశ్వాసముంచి స్టాక్స్‌ కొనుగోలు చేసి ఉంటారో.. వారిప్పుడు అదిరిపోయే రిటర్న్స్‌ను సొంతం చేసుకొని ఉంటారు. 2003 జూలైలో లిస్టైన ఈ స్టాక్‌ గత 15 ఏళ్లలో ఏకంగా 5,400 శాతానికిపైగా ర్యాలీ చేసింది. ఈ స్టాక్‌ 2004లో నిఫ్టీ-50 క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం మైలురాయిగా చెప్పుకోవచ్చు. మారుతీ తర్వాత మార్కెట్‌లో లిస్టైన మరో 12 స్టాక్స్‌ కూడా

Most from this category