STOCKS

News


కళ తప్పిన మెటల్‌ షేర్లు

Wednesday 5th December 2018
Markets_main1543991125.png-22658

అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లో బుధవారం మెటల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇటీవల అమెరికా-చైనా దేశాల కుదిరిన వాణిజ్య యుద్ధ సం‍ధి ప్రశ్నార్థకంగా మారడంతో లండన్‌ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లో మెటల్‌ ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అలాగే ప్రపంచ అతిపెద్ద మెటల్‌ వినియోగదారుగా పేరోందిన చైనా మెటల్‌ డిమాండ్‌ పై ఆందోళనలు రేకెత్తాయి. ఈ ప్రతికూలాంశాలు దేశీయ మెటల్‌ స్టాక్స్‌ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 3.50శాతం నష్టపోయింది. ఉదయం గం.11:25ని.లకు ఇండెక్స్‌ గతముగింపుతో పోలిస్తే 3,135.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలోని మొత్తం 15 షేర్లన్నీ నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా జిందాల్‌స్టీల్‌ షేరు 6శాతం నష్టపోయింది. హిందాల్కో, సెయిల్‌ షేర్లు 4శాతం నష్టపోయాయి. ఎన్‌ఎండీసీ, టాటాస్టీల్‌ వేదాంత, నాల్కో, కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ షేర్లు 3శాతం క్షీణించాయి. వెల్‌స్పాన్‌కార్పోరేషన్‌, హిందూస్థాన్‌కాపర్‌, హిందూస్థాన్‌జింక్‌, ఏపిఎల్‌అపోలో షేర్లు 1శాతం నష్టపోయాయి. అలాగే జేఎస్‌ఎల్‌హిస్సార్‌, మొయిల్‌ షేర్లు అరశాతం పతనమయ్యాయి. ఇదే సమయానికి నిఫ్టీ-50 సూచిలో టాప్‌-5 లూజర్లలో హిందాల్కో, టాటాస్టీల్‌ మొదటి రెండు స్థానాల్లో ట్రేడ్‌ అవుతుండగా, వేదాంత చివరి స్థాయిలో ట్రేడ్‌ అవుతోంది.You may be interested

బ్యాంకులకు మాల్యా కొత్త ఆఫర్‌

Wednesday 5th December 2018

ప్రత్యక్షంగా బ్యాంకులకు పరోక్ష్యంగా దేశ ప్రజానీకానికి కుచ్చు టోపి పెట్టి విదేశానికి పరారైన విజయ్‌ మాల్యా పంథం మార్చుకున్నట్లున్నారు. ఈయన శ్రీమంతుడు సినిమాలోని ‘తిరిగిచ్చేయాలి లేకపోతే లావైపోతారు’ అనే డైలాగ్‌ విన్నారో ఏమో కానీ.. బ్యాంకుల దగ్గర తీసుకున్న రూ.5,500 కోట్లను (ఆసలు మాత్రమే వడ్డీ కాదు) తిరిగి చెల్లిచేస్తానంటూ ట్వీట్‌ చేశారు. తీసుకున్న రుణాలను చెల్లించకుండా దేశం విడిచి పారిపోయిన మాల్యా గత రెండేళ్లుగా యూకేలో నివసిస్తున్న విషయం

మార్కెట్లను కుదిపేసిన ‘సెల్‌ ద ర్యాలీ’ వ్యూహం

Wednesday 5th December 2018

అమెరికా, చైనాల మధ్య సంధి కుదిరిన 24 గంటల్లోగానే మార్కెట్‌ ర్యాలీ ఆవిరి అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్‌లో జరిగిన జీ–20 సదస్సు సందర్భంగా అమెరికా, చైనాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం తొలుత మార్కెట్ల ర్యాలీకి సహకరించినప్పటికీ.. ఇప్పుడు అదే ఒప్పందం సూచీలు కుప్పకూలేలా చేసింది. కనీసం 24 గంటలు కూడా గడవక ముందే ర్యాలీ చల్లబడిపోయింది. అదనపు సుంకాల విధింపులను 90 రోజుల పాటు నిలిపివేయాలని ఇరు దేశాల

Most from this category