STOCKS

News


నిఫ్టీ 50 వీక్లీ ఆప్షన్లు షురూ

Tuesday 12th February 2019
news_main1549949209.png-24144

  • సోమవారం నుంచి ప్రారంభం

న్యూఢిల్లీ: పెట్టుబడిదారులు తమ పోర్టిఫోలియో రిస్కును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు.. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో మరో అదనపు హెడ్జింగ్ సాధనం అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రధాన సూచీలో తాజాగా వారాంత ఆప్షన్లను నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) ప్రారంభించింది. మూడు నెలలు, త్రైమాసికం, అర్థ సంవత్సరాంత ఆపన్లకు సరసన వీక్లీ ఆప్షన్లు కూడా సోమవారం నుంచి ప్రారంభించినట్లు ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈఓ విక్రం లిమాయే వెల్లడించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. ‘నిఫ్టీ 50 ఇండెక్స్‌ డెరివేటీవ్స్‌ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ట్రేడవుతున్నాయి. ఈ ప్రధాన సూచీ ఎక్స్ఛేంజ్‌ ప్లాగ్‌షిప్‌ ఇండెక్స్‌.’ అని అన్నారు. ఇక నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో వీక్లీ ఆప్షన్లకు కూడా సెబీ వద్ద నుంచి ఎన్‌ఎస్‌ఈ అనుమతి పొందిన విషయం తెలిసిందే కాగా, ఈ సూచీ ట్రేడింగ్‌ను సైతం త్వరలోనే ప్రారంభించనుందని సమాచారం.


NSE

You may be interested

నెంబర్‌ 2 @ 2030

Tuesday 12th February 2019

అత్యంత వేగంగా భారత్‌ వృద్ధి ప్రధాని నరేంద్రమోదీ విశ్వాసం 2019 పెట్రోటెక్‌ సదస్సు ప్రారంభం గ్రేటర్‌ నోయిడా: భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. 2030 నాటికి దేశం ప్రపంచంలోనే రెండవ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) సంస్థ, ప్రపంచబ్యాంక్‌ వంటి దిగ్గజాలు భారత్‌ వృద్ధి వేగం కొనసాగుతుందని పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులనూ దేశం తట్టుకుని తగిన వృద్ధి రేటును

ఎస్సార్‌స్టీల్‌ ఇక ఆర్సెలర్‌ మిట్టల్‌ దే!

Tuesday 12th February 2019

ఎస్సార్‌ దివాలా కేసుపై నిర్ణయానికి ఎన్‌సీఎల్‌టీకి లైన్‌క్లియర్‌ అడ్డంకులను తొలగించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: ఎస్సార్‌ స్టీల్‌ దివాలా కేసు పురోగతిలో అడ్డంకులను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం తొలగించింది. దీంతో ఎస్సార్‌ స్టీల్‌ కోసం ఆర్సెలర్‌ మిట్టల్‌ తరఫున దాఖలైన అత్యధిక బిడ్‌పై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అహ్మదాబాద్‌ బెంచ్‌ ఒక నిర్ణయం తీసుకోగలుగుతుంది. వివరాల్లోకి వెళితే... ఎస్సార్‌ స్టీల్‌ కోసం ఆర్సెలర్‌ మిట్టల్‌ దాఖలు చేసిన రూ.42,000 కోట్ల

Most from this category