News


రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం ఎన్‌ఎస్‌ఈ ‘జీ-సెక్‌’ ప్లాట్‌ఫామ్‌

Tuesday 20th November 2018
Markets_main1542684723.png-22204

ముంబై: రిటైల్‌ ఇన్వెస్టర్లు ప్రభుత్వ సెక్యూరిటీలను సులభంగా కొనుగోలు చేయటానికి వీలుగా ఎన్‌ఎస్‌ఈ వెబ్‌ పోర్టల్‌తో పాటు మొబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఎన్‌ఎస్‌ఈ గోబిడ్‌’ పేరిట రూపొందించిన ఈ మొబైల్‌ అప్లికేషన్‌ను సెబీ చైర్మన్‌ అజయ్‌త్యాగి సోమవారం ముంబైలో ఆవిష్కరించారు. ట్రెజరీ బిల్లులు 91 రోజులు, 182 రోజులు, 364 రోజుల కాల వ్యవధి కోసం, ఇతర ప్రభుత్వ బాండ్లలో (ఏడాది నుంచి 40 ఏళ్ల కాల వ్యవధి) ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు ఈ యాప్‌ ఉపకరిస్తుంది. ‘‘దేశంలో డిజిటల్‌ చెల్లింపులు పెరిగిన తరుణంలో ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు ఈ యాప్‌ తీసుకురావడం కీలక మైలురాయిగా భావిస్తున్నాం. నాన్‌ కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేసేందుకు సెబీ స్టాక్‌ ఎక్సేంజ్‌లను అనుమతించాకే... ప్రభుత్వ సెక్యూరిటీల్లో రిటైల్‌ ఇన్వెస్టర్లు పాల్గొనడం ప్రారంభమైంది’’ అని అజయ్‌త్యాగి ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఆఫర్‌ చేసే రాబడుల కంటే ప్రభుత్వ బాండ్లు మెరుగైన రాబడులను ఇస్తున్నట్టు చెప్పారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించారు. అలాగే, ప్రభుత్వ సెక్యూరిటీల్లో రిటైల్‌ ఇన్వెస్టర్ల ప్రాతినిథ్యం ప్రస్తుతం తక్కువగా ఉందని, ఇది పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైతే మెరుగుదలకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్లపై రాబడి 7.80- 7.83 శాతం మధ్య ఉంది.



You may be interested

గోల్డ్‌ హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి?

Tuesday 20th November 2018

న్యూఢిల్లీ: దేశంలో విక్రయించే బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఆహారం, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం పసిడి ఆభరణాల హాల్‌మార్కింగ్‌ తప్పనిసరికాదు. హాల్‌మార్కింగ్‌ అనేది విలువైన మెటల్‌కు ఒక స్వచ్చత ధ్రువీకరణ పత్రం. వినియోగ వ్యవహారాల మంత్రిత్వశాఖ నియంత్రణలోనే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండెర్ట్స్‌ (బీఐఎస్‌) హాల్‌మార్కింగ్‌ నిర్వహణాపరమైన అధికారాన్ని కలిగి ఉంది. వరల్డ్‌

సీపీఎస్‌ఈ 4వ ఇష్యూతో కేంద్రానికి రూ.14,000 కోట్లు

Tuesday 20th November 2018

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం సీపీఎస్‌ఈ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ నాలుగో విడత జారీ ద్వారా రూ.14,000 కోట్లను సమీకరించనున్నట్టు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి. గత మూడు విడతల జారీల్లో కేంద్ర మొత్తం మీద రూ.11,500 కోట్ల మేర సమీకరించింది. నాలుగో విడత ఇష్యూ వచ్చే వారం ప్రారంభం అవుతుందని, ఇన్వెస్టర్లకు 3.5-4 శాతం వరకు తగ్గింపు లభిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం రూ.8,000 కోట్ల

Most from this category