STOCKS

News


ఈ కంపెనీల్లో మీకు ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉన్నాయా?

Sunday 9th September 2018
Markets_main1536516978.png-20099

ఎన్‌ఎస్‌ఈ 36 కంపెనీలకు నోటీసులను జారీ చేసింది. త్రైమాసిక ఫలితాల వివరాలను స్టాక్‌ ఎక్సేంజ్‌కు ఫైల్‌ చేయకపోవడంతో నోటీసులను జారీ చేసింది. గీతాంజలి జెమ్స్‌, ఏబీజీ షిప్‌యార్డ్‌ కంపెనీలు జూన్‌ క్వార్టర్‌ త్రైమాసిక ఫలితాలను నిర్ణీత గడువులోపు సమర్పించలేదని సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ తెలిపింది. క్వాలిటీ లిమిటెడ్‌, యూనిటెక్‌, ఆమ్టెక్‌ ఆటో, ఎలక్ట్రోస్టీల్‌ స్టీల్స్‌, మోసర్‌ బేర్‌ ఇండియా, ఎస్‌ఆర్‌ఎస్‌, జేవీఎల్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌, భారతి డిఫెన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, శిల్పి కేబుల్‌ టెక్నాలజీస్‌, అట్లాస్‌ సైకిల్స్‌ (హర్యానా) లిమిటెడ్‌, సురానా కొర్పొరేషన్‌, టుడే రైటింగ్‌ ఇనుస్ట్రుమెంట్స్‌, ఎడ్యుకాంప్‌ సొల్యూషన్స్‌, ఆర్చిడ్‌ ఫార్మా, ఈసన్‌ రీరోల్‌, సుప్రీం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండియా, పనోరమిక్‌ యూనివర్సల్‌, డైమండ్‌ పవర్‌ ఇన్‌ఫ్రా, నేషనల్‌ స్టీల్‌ అండ్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌లకు ఎన్‌ఎస్‌ఈ నోటీసులు జారీ అయ్యాయి. లిస్టింగ్‌ నిబంధనల ప్రకారం 36 సంస్థలు ఆర్థిక ఫలితాల వివరాలను నిర్ణీత సమయంలోపు సమర్పించలేదని సీడీఎస్‌ఎల్‌ తెలిపింది. ఇందుకు గాను ఈ కంపెనీలకు ఎక్సేంజ్‌ ఇప్పటికే జరిమానాలను విధించిందని, నోటీసులు కూడా జారీ చేసిందని పేర్కొంది. ఈ నిబంధనలను పాటించడంలో వరుసగా విఫలమైతే సస్పెన్షన్‌ సహా తదుపరి నియంత్రణ పరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇన్వెస్టర్లకు సీడీఎస్‌ఎల్‌ తెలియజేసింది.



You may be interested

బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ ఎంపిక భిన్నం

Sunday 9th September 2018

బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న వారు, ఇన్వెస్ట్‌ చేయదలిచిన వారు తప్పకుండా కొన్ని అంశాలను కూలంకుషంగా తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే ఇటీవలి మార్పుల అనంతరం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ప్రాథమికంగా 10 కేటగిరీలు, హైబ్రిడ్‌ ఫండ్స్‌లో ఆరు కేటగిరీలు ఉన్నాయి. వీటన్నింటికీ ఈక్విటీల్లో ఎంత, డెట్‌లో ఎంత మేర ఇన్వెస్ట్‌ చేయాలి అనే విషయంలో కచ్చితమైన పరిమితులు నిర్ణయించడం జరిగింది. ఒక్క బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌ విషయంలో

60ల తర్వాతి జీవితం కోసం... కొద్ది మందే పొదుపు

Sunday 9th September 2018

ఉద్యోగ జీవితం మహా అంటే 58-60 వరకే. ఆ తర్వాత మహా అంటే మరో ఐదేళ్లు పార్ట్‌ టైమ్‌గా చేయగలరు. 60 ఏళ్లకు సీనియర్‌ సిటిజన్‌గా మారే వారు, ఆ తర్వాత జీవితం కోసం ముందు నుంచే తగిన నిధిని సమకూర్చుకోవడం ఎంతైనా అవసరం. పెరిగిపోతున్న జీవనశైలి వ్యాధులు, అదే సమయంలో మెరుగైన, అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటు ఫలితంగా సగటు జీవన కాలం పెరిగిపోతోంది. కనుక ఎంతలేదనుకున్నా 60ల

Most from this category