STOCKS

News


డెరివేటివ్స్‌ మార్జిన్లు పెంచిన ఎన్‌ఎస్‌ఈ

Thursday 17th January 2019
Markets_main1547721010.png-23643

బడ్జెట్‌ సెషన్‌ సమయంలో తీవ్ర ఒడిదుడుకులను తట్టుకునేందుకు ఎఫ్‌అండ్‌ఓ విభాగంలో మార్జిన్లను పెంచుతున్నట్లు ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. పార్లమెంట్‌లో బడ్జెట్‌ సెషన్‌ జరిగే వేళ డెరివేటివ్స్‌లో తీవ్ర కదలికలుంటాయని, వీటిని కట్టడి చేసేందుకు మార్జిన్లను దాదాపు 40 శాతం మేర పెంచుతున్నామని ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. వచ్చే సోమవారం(జనవరి 21)నుంచి కొత్త మార్జిన్లు అమల్లోకి వస్తాయి. నిజానికి ప్రస్తుతం దేశీయ వీఐఎక్స్‌ స్వల్పకాలిక సరాసరి 16 వద్దే ఉంది. అంటే మార్కెట్లో పెద్దగా ఆటుపోట్లు లేవని వీఐఎక్స్‌ సూచిస్తోంది. అందువల్ల రాబోయే రోజుల్లో ఆటుపోట్లను దృష్టిలో ఉంచుకొని ఎక్చేంజ్‌ ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు భావిస్తున్నారు. నిజానికి ఎన్‌ఎస్‌ఈ తీసుకున్న ఈ నిర్ణయంతో డెరివేటివ్స్‌లో స్వల్పకాలిక ఒడిదుడుకులు చోటు చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పెరిగిన మార్జిన్లను సమకూర్చలేని ట్రేడర్లు హడావుడిగా పొజిషన్లను స్క్వేర్‌ఆఫ్‌ చేసుకునేందుకు యత్నిస్తారని, అందువల్ల తీవ్రంగా కదలికలుంటాయని నిపుణుల అభిప్రాయం. అయితే బడ్జెట్‌కు ముందు పొజిషన్లు తక్కువగా ఉండడంతో గతంతో పోలిస్తే బడ్జెట్‌ వేళ మార్కెట్లో తీవ్ర కదలికలకు ఆస్కారం ఉండకపోవచ్చని అంచనా. 



You may be interested

ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ను అమ్మేస్తున్నారా..? ఒక్క నిమిషం!

Thursday 17th January 2019

ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే, ప్రభుత్వం ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కనుక ఈఎల్‌ఎస్‌ఎస్‌లో పెట్టుబడులపైనే పన్ను మినహాయింపు కానీ, అవిచ్చే రాబడులపై మాత్రం కాదన్న విషయాన్ని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. కనుక ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ను విక్రయించే సమయంలో

10900పైన నిఫ్టీ ముగింపు

Thursday 17th January 2019

మూడోరోజూ లాభాలే ఆదుకున్న హెవీవెయిట్‌ షేర్ల ర్యాలీ ఆద్యంతం ఒడిదుడుకుల ట్రేడింగ్‌ను సాగించిన సూచీలు చివరకు స్వల్ప లాభంతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 52 పాయింట్ల లాభపడి 36,374 వద్ద, ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 15 పాయింట్లు లాభపడి 10,905 వద్ద ముగిసింది. సూచీలకు ఇది వరుసగా మూడో రోజూ లాభాల ముగింపు కావడం విశేషం.  యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ అండతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 27500లపై ముగిసింది. డాలర్‌

Most from this category