STOCKS

News


మార్కెట్లకు భారీ దాడుల ప్రమాదం

Wednesday 5th September 2018
Markets_main1536124740.png-19970

ముంబై: ఫైనాన్షియల్‌ మార్కెట్ల తాలూకు ఆస్తులపై చాలా తక్కువ ఖర్చుతోనే భారీ స్థాయిలో దాడులు జరిపే ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా పొంచి ఉందని ఎన్‌ఎస్‌ఈ ఆందోళన వ్యక్తం చేసింది. మేథో సాధికారత, ఆవిష్కరణలపై పెట్టుబడుల ద్వారా తగిన ప్రమాణాలను నెలకొల్పాలని ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో విక్రం లిమాయే అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ అనుసంధానత పెరుగుతుండడం, వ్యవస్థల సంక్లిష్టతతో భారీ స్థాయి సైబర్‌ దాడుల రిస్క్‌ ఉందని మంగళవారం ముంబైలో జరిగిన ఎన్‌ఎస్‌ఈ ఫ్యూచర్‌ టెక్‌ 2018 కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. క్యాపిటల్‌ మార్కెట్‌ విభాగంలో అగ్రగాములుగా ఉన్నందున ప్రమాణాలను నెలకొల్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మేథో సాధికారత, ఆవిష్కరణలపై పెట్టుబడుల ద్వారా మార్పు తీసుకొచ్చేందుకు చేపట్టిన చర్యల్లో ఫ్యూచర్‌ టెక్‌ ఒకటిగా పేర్కొన్నారు. 



You may be interested

‘అమ్రపాలి’ ప్రాజెక్టులను 36 నెలల్లో పూర్తి చేస్తాం

Wednesday 5th September 2018

న్యూఢిల్లీ: రియల్టీ కుంభకోణంలో చిక్కుకున్న అమ్రపాలి గ్రూప్‌ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సిద్ధమేనని సుప్రీం కోర్టుకు ప్రభుత్వ రంగ ఎన్‌బీసీసీ వెల్లడించింది. దాదాపు 15 హౌసింగ్‌ ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 46,575 ఫ్లాట్స్‌ను 36 నెలల్లో దశల వారీగా నిర్మించి ఇవ్వగలమని... ఇందుకు దాదాపు రూ.8,500 కోట్ల నిధులు కావాలని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రతిపాదించింది. కేసును విచారిస్తున్న జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ యూయూ లలిత్‌ల ధర్మాసనం.. ఎన్‌బీసీసీ

జూలై క్వార్టర్లో తగ్గిన వ్యాపార విశ్వాసం

Wednesday 5th September 2018

న్యూఢిల్లీ: నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌) నిర్వహించే వ్యాపార విశ్వాస సూచీ (ఎన్‌-బీసీఐ) జూలై చివరి నాటికి  12.9 శాతం (ఏప్రిల్‌ త్రైమాసికంతో పోలిస్తే) తగ్గింది. వార్షికంగా చూస్తే 15.9 శాతం తగ్గినట్టు. పలు విభాగాల్లో వ్యాపార సెంటిమెంట్‌ దెబ్బతినడమే ఇందుకు కారణం. కన్జ్యూమర్‌ గూడ్స్‌ రంగంలో క్షీణత ఇతర రంగాలతో పోలిస్తే మోస్తరుగా ఉంది. క్యాపిటల్‌ గూడ్స్‌, సేవల రంగాల్లో విశ్వాస సూచీ 18

Most from this category