STOCKS

News


బ్యాంకుల ఎర్నింగ్స్‌పై ఆర్‌బీఐ నిబంధనల ప్రభావం తప్పదు..!

Wednesday 14th February 2018
Markets_main1518598148.png-13950

ముంబై: ఆర్‌బీఐ నూతన ఎన్‌పీఏ నిబంధనలు స్వల్పకాలంలో బ్యాంకింగ్‌ రంగ ఎర్నింగ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని ఈరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రూ.500 కోట్లు మించిన అకౌంట్‌ విషయంలో వారం వారీ నివేదికలు సమర్పించాల్సిరావడం వల్ల ఈతరహా శాశ్వత ఖాతాలపై ప్రభావం ఉంటుందని, ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు స్వల్పకాలంలో ఎర్నింగ్స్‌పై కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతాయని ఐసీఐసీఐ డైరెక్ట్‌ వెల్లడించింది. బాండ్‌ ఈల్డ్‌ పెరగడం, ఇదే సమయంలో అధిక ప్రొవిజనింగ్ జరగడం అనేది ప్రత్యేకించి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు (పీఎస్‌యూ)పై నెగటీవ్‌గా ఉంటుందని అభిప్రాయపడుతున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇంతకుముందు జరిగిన ప్రభుత్వ ములధన కేటాయింపు వల్ల బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్‌ క్లీన్‌ అయ్యి, వృద్ధికి దోహదపడుతుందని.. దీర్థకాలంగా మాత్రమే ఇది ఈరంగాన్ని బలోపేతం చేస్తుందని విశ్లేషించింది. అయితే, తాజా నిబంధనల కారణంగా మధ్యకాలం వరకు ఎర్నింగ్స్‌పై ప్రభావం తప్పదని భావిస్తోంది. సవరించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ.2,000 కోట్లు.. లేదంటే, అంతకుమించి రుణాల బకాయిలు తీరని పక్షంలో 180 రోజుల్లోగా పరిష్కార ప్రణాళిక అమలు జరగాల్సి ఉంటుంది. ఈ విధంగా వసూలు జరగకపోతే దివాలా ప్రక్రియ మొదలుపెట్టాలని ఆర్బీఐ సూచించింది. ఈ నిబంధనలు ప్రైవేట్‌ బ్యాంకులపై, కార్పొరేట్‌ రుణ మంజూరీ చేసిన బ్యాంకులపైన అత్యంత ఎక్కువగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ వెల్లడించింది. స్వతంత్ర క్రెడిట్ మూల్యాంకన నిబంధన వల్ల లిస్టెడ్‌ క్రెడిట్ రేటింగ్ సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించింది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐఐబీ షేర్లు తమ టాప్‌ పిక్స్‌గానే కొనసాగుతాయని ఈ సందర్భంగా వెల్లడించింది. కార్పొరేట్‌ బ్యాంక్‌లలో ఐసీఐసీఐ టాప్‌ పిక్‌ అని వెల్లడించింది.You may be interested

జనవరిలో మ్యూచువల్‌ ఫండ్లు కొన్న 9 షేర్లు ఇవే..!

Wednesday 14th February 2018

ముంబై: ఇంతకుముందు తమ జాబితాలో లేని 9 నూతన షేర్లను దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ హౌస్‌లు జనవరిలో జతచేసుకున్నాయి. మార్కెట్‌ నూతన గరిష్టస్థాయిలను తాకుతున్న సమయంలో ఓరియంట్ ఎలక్ట్రిక్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా, గెలాక్సీ సర్‌ఫ్రాక్టన్స్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్‌వేర్‌, ఇమామీ పేపర్, నాథ్ బయో-జెనీస్, అపోలో మైక్రో, హెచ్‌ఓఈసీ, పిలాని ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీల షేర్లలోనికి మ్యూచువల్‌ ఫండ్‌ల పెట్టుబడులు తరలివెళ్లాయి. ఈ నూతన పెట్టుబడులతో కలుపుకుని డిసెంబరులో దేశీయ

ఆల్‌టైం హైకి అశోక్‌లేలాండ్‌

Wednesday 14th February 2018

ముంబై:- ఆటోమొబైల్‌ దిగ్గజం అశోక్‌ లే లాండ్‌ షేరు బుధవారం 4శాతం లాభపడి ఆల్‌టైం హైని నమోదు చేసింది. నేడు బీఎస్‌ఈలో రూ.134.60ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ క్యూ3లో సాధించిన అశాజనక ఆర్థిక ఫలితాలు, షేరుపై బ్రోకరేజ్‌ సంస్థలకు ఉన్న సానుకూల ధోరణి తదితర అంశాలతో గతవారం రోజులుగా షేరు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది.  నేటి ఇంట్రాడేలో కూడా అదే దూకుడును కనబరుస్తూ 4శాతం లాభపడి రూ.138.70ల వద్ద ఆల్‌టైం

Most from this category