STOCKS

News


నవంబర్‌లో బేర్స్‌దే పైచేయి..!

Thursday 15th November 2018
Markets_main1542277120.png-22054

ముంబై: అక్టోబరులో 5 శాతం పతనాన్ని నమోదుచేసిన సెన్సెక్స్‌ ఆ తరువాత కాస్త కోలుకుని నవంబర్‌లో ఇప్పటివరకు 2 శాతం లాభాలను పొందింది. ఈ మేరకు రిలీఫ్‌ వచ్చినప్పటికీ, గతంలో నవంబర్‌ నెలల్లో చోటుచేసుకున్న పరిణామాలను చూసి ఇన్వెస్టర్లు జంకుతున్నట్లు దలాల్‌ స్ట్రీట్‌ పండితులు వెల్లడించారు. గడిచిన 10 ఏళ్లలో ఏకంగా 7 సార్లు మార్కెట్‌ బేర్స్‌ పట్టులోనే కొనసాగింది. ఈ నెలలో సెన్సెక్స్‌ 1-12 శాతం మేర నష్టాలను చవిచూసింది. 2016 నవంబర్‌లో 4.3 శాతం, 2011లో 7.7 శాతం పతనాన్ని నమోదుచేసిన సెన్సెక్స్‌.. 2008 నవంబర్‌లో అత్యధికంగా 12 శాతం క్షీణించింది. లాభపడిన 3 సంవత్సరాలలో 2009లో అత్యధికంగా 10 శాతం, 2012లో 4.1 శాతం, 2014 నవంబర్‌లో 3 శాతం లాభపడింది. అయితే, అత్యధిక సందర్భాల్లో నష్టాలనే నమోదుచేసిన సూచీ.. ఈసారి ఏవిధంగా ఉండనుందనే ఆందోళనలు నెలకొన్నాయి. 

గడిచిన రెండు నెలల్లో భారీ నష్టాలనే నమోదుచేసిన ‍దేశీ స్టా్క్‌ మార్కెట్లు ఇప్పటివరకు అయితే నవంబర్‌లో ఆశాజనకంగానే కనబడుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో 13 శాతం నష్టపోయిన నిఫ్టీ.. ప్రస్తుతం కన్సాలిడేషన్‌ దశలో కొనసాగుతూ పాజిటీవ్‌ బయాస్‌తోనే ఉందని చార్ట్‌వ్యూ ఇండియా డాట్‌ ఇన్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ చీఫ్‌ స్ట్రాటజిస్‌ మజర్‌ మహ్మద్‌ విశ్లేషించారు. నిఫ్టీకి ప్రధాన నిరోధం 10840 పాయింట్ల వద్ద ఉండగా.. ఈ స్థాయిని అధిగమిస్తే 11,089 వరకు చేరే అవకాశం ఉందన్నారు. పడిపోయిన పక్షంలో 10,100 కీలక మద్దతు స్థాయిగా ఉంటుందని విశ్లేషించారు. సెన్సెక్స్‌ 36200 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉన్నందున నవంబర్‌లో ఆశాజనకంగానే ఉన్నట్లు కేఐఎఫ్‌ఎస్‌ ట్రేడ్‌ కాపిటల్‌ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ రితేష్‌ అషార్ అన్నారు.



You may be interested

ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్ 10 శాతం అప్‌

Thursday 15th November 2018

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ షేరు గురువారం ఇంట్రాడేలో 10 శాతం మేర లాభాలను నమోదుచేసింది. ఉదయం సెషన్లో 9.6 శాతం లాభపడి రూ.238.6 వద్దకు చేరుకుంది. మార్కెట్‌ ముగింపు సమయానికి ఎన్‌ఎస్‌ఈలో 8 శాతం లాభపడి రూ.234.90 వద్ద ముగిసింది. క్యూ2లో కంపెనీ నికర లాభం రూ.44.3 కోట్లుకు చేరుకుందని బుధవారం మార్కెట్‌ ట్రేడింగ్‌ ముగిసిన

రూపాయి ర్యాలీతో లాభాల ముగింపు

Thursday 15th November 2018

మళ్లీ 10600 పాయింట్ల పైన ముగిసిన నిఫ్టీ డాలర్‌ మారకంలో రూపాయి ర్యాలీ మార్కెట్‌కు కలిసొచ్చింది. ఫలితంగా గురువారం సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభాల్ని ఆర్జించగా, నిప్టీ సూచీ మళ్లీ 10600 మార్కును అందుకుంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితితో సూచీలు మిడ్‌సెషన్‌ వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. మిడ్‌సెషన్‌ సమయానికి డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం, ఆసియా మార్కెట్ లాభాల ముగింపు  ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. రూపాయి

Most from this category