STOCKS

News


లాభాల స్వీకరణకు వెయిట్‌ చేయాలి...

Monday 3rd September 2018
Markets_main1535962957.png-19916

మార్కెట్లు స్తబ్ధత లేదా అలసట సంకేతాలు ఇచ్చినప్పుడు అధిక విలువ కలిగిన విభాగాల నుంచి కొంత డబ్బుని వెనక్కు తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం మార్కెట్లు ఇలాంటి సూచనలేమీ ఇవ్వడం లేదని, ఇన్వెస్ట్‌మెంట్లను ఉపసంహరించుకోవడానికి మరి కొంత కాలం వేచి ఉండాలని సూచించారు సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జగనాథం తునుగుంట్ల. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. యస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా రానా కపూర్‌ కొనసాగుతారని ఆర్‌బీఐ ప్రకటించినా కూడా మార్కెట్లు యస్‌ బ్యాంక్‌ స్టాక్‌పై వేచి చూసే దోరణలో ఉందని తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లను ఉటంకించారు. ఈ రెండూ బ్యాంకుల్లో మేనేజ్‌మెంట్‌ సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు వ్యాల్యుయేషన్స్‌ పడిపోయాయని గుర్తుచేశారు.  ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రైస్‌-టు-బుక్‌కు 1.5 రెట్లు వద్ద ట్రేడవుతుంటే, యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రైస్‌-టు-బుక్‌కు 2.4 రెట్లు వద్ద ట్రేడవుతుంటే.. యస్‌ బ్యాంక్‌ 3 రెట్లుకుపై స్థాయిలో ఉంటుందన్నారు. 
మార్కెట్‌లో ఎవరైనా ప్రాఫిట్‌ కోసం చూస్తారని, అయితే ఇప్పుడు మార్కెట్‌ ఇరుకుగా మారిందని జగనాథం పేర్కొన్నారు. కేవలం 40-50 స్టాక్స్‌ మాత్రమే మంచి పనితీరు కనబరుస్తున్నాయని తెలిపారు.  
మరికొద్ది కాలం మార్కెట్లతోపాటే ప్రయాణించాల్సి ఉందన్నారు. అప్పుడు ఒక తరుణంలో కొంత డబ్బుని వెనక్కు తీసుకోవచ్చన్నారు. అయితే దీనికి కొంత కాలం వేచి ఉండాలని తెలిపారు. మార్కెట్లు స్తబ్ధతను సూచిస్తే.. అప్పుడు అధిక విలువ ఉన్న విభాగాల నుంచి డబ్బుల్ని తీసుకోవచ్చని పేర్కొన్నారు. దీనికి కొంత కాలం పడుతుందన్నారు. 
మిడ్‌క్యాప్‌ ఐటీ స్టాక్స్‌లో హెక్జావేర్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని జగనాథం సిఫార్సు చేశారు. స్టాక్‌ పడిపోయినప్పుడు మరిన్ని షేర్లను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఏడాదికి 15 శాతం రిటర్న్స్‌ అందిస్తుందని పేర్కొన్నారు. రూపాయి క్షీణత నేపథ్యంలో లార్జ్‌క్యాప్‌ ఐటీ స్టాక్‌ను కొనుగోలు చేస్తే మంచిదని తెలిపారు. ఈ విభాగంలో ఇన్ఫోసిస్‌ లేదా టీసీఎస్‌ ఉత్తమమైన ఎంపికని పేర్కొన్నారు. 
పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ నాణ్యమైన స్టాక్‌ అని తెలిపారు. ఉత్తతమైన మేనేజ్‌మెంట్‌ సానుకూల అంశమని పేర్కొన్నారు. అజయ్‌ పిరమల్‌ వ్యాపారవేత్తగా కన్నా ఇన్వెస్టర్‌గా ఎక్కువగా ఆలోచిస్తారని తెలిపారు. పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో వృద్ధికి అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఇన్వెస్టర్‌ తప్పక కలిగి ఉండాల్సిన పోర్ట్‌ఫోలియో స్టాక్‌ ఇదని తెలిపారు. ఇది ట్రేడింగ్‌ స్టాక్‌ కాదని, దీర్ఘకాలంలో హోల్డ్‌ చేయాల్సిన షేరని పేర్కొన్నారు. ఇందులో సంపద సృష్టి చాలా ఎక్కువ స్థాయిలో ఉండొచ్చని అంచనా వేశారు. You may be interested

మహీంద్రా మరాజో వచ్చేసింది!

Monday 3rd September 2018

ధర రూ. 9.99 లక్షలు యుటిలిటీ వాహనాల విభాగంలో మారుతీ, టయోటాలను ఎదుర్కొనే క్రమంలో మహీంద్రా తన సరికొత్త మల్టీయుటిలిటీ వాహనం మరాజోను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎస్‌యూవీ, ఎంయూవీ విభాగాల్లో కోల్పోతున్న వాటాను తిరిగి దక్కించుకునేందుకు ఎంఅండ్‌ఎం ఈ కొత్త వాహనాన్ని తీసుకువచ్చింది. మారుతీ ఎర్టిగా, టయోటా ఇన్నోవాలకు దీటుగా మరాజోను తీర్చిదిద్దినట్లు మహీంద్రా తెలిపింది. ఇటలీకి చెందిన పినిన్‌ఫార్నియాతో కలిసి ఈ ఎనిమిది సీట్ల వాహనాన్ని తయారు చేసినట్లు

52వారాల గరిష్టానికి డాక్టర్‌ రెడ్డీస్‌

Monday 3rd September 2018

దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ షేరు సోమవారం బీఎస్‌ఈలో 52-వారాల గరిష్టాన్ని తాకింది. నేడు డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు బీఎస్‌ఈలో రూ.2510.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేటి ఇంట్రాడేలో ఫార్మా షేర్ల ర్యాలీలో భాగంగా ఈ షేరు 5శాతం లాభపడి రూ.2620.00ల వద్ద 52-వారాల గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గత ముగింపు ధర(రూ.2491.35)తో పోలిస్తే 5.14శాతం లాభపడి రూ.2614.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు

Most from this category