News


భిన్నమైన ఈ ఫార్మా కంపెనీలే నయం: దీపేన్‌ మెహతా

Saturday 8th September 2018
Markets_main1536346289.png-20066

పెద్ద ఫార్మా కంపెనీలకు బదులు భిన్నమైన వ్యాపార నమూనా కలిగిన ఫార్మా కంపెనీలను పెట్టుబడుల కోసం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ సభ్యుడు మెహతా సూచించారు. పెట్టుబడుల కోసం ఆయన పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, సువెన్‌, దివిస్‌ ఫార్మా కంపెనీలను సూచించారు. అలాగే, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ సైతం మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ బెట్‌గా పేర్కొన్నారు.

 

బాలకృష్ణ ఇండస్ట్రీస్‌

‘‘ఈ కంపెనీలో మాతోపాటు, మా క్లయింట్లు కూడా ఇన్వెస్ట్‌ చేసి ఉన్నారు. ఈ కంపెనీకి ఉన్న విభిన్నమైన వ్యాపార నమూనా కారణంగా గత కొన్నేళ్ల కాలంలో అద్భుత పనితీరు చూపించింది. ఈ కంపెనీ విస్తరణ ప్రణాళికలు కూడా పెద్ద పాత్ర పోషించాయి. వ్యాల్యూషన్లు అధిక స్థాయిలో ఉన్నాయి. అయితే, భవిష్యత్తు వృద్ధి అవకాశాల విషయంలో కంపెనీ ఎంతో ఆశావహంతో ఉంది. ఎన్నో మార్కెట్లలోకి కంపెనీ అడుగు పెట్టింది. ఇది వృద్ధి చోదకం. ధరల పరంగా కంపెనీకి అనుకూలత ఉంది. అలాగే, రూపాయి పతనం వల్ల కంపెనీకి లాభం కలుగుతుంది. పోటీ టైర్‌ కంపెనీలతో పోలిస్తే అధిక విలువల వద్ద ఉందనడంలో సందేహం లేదు. కరెక్షన్‌ సమయంలో కొనుగోలును పరిశీలించొచ్చు. ప్రతి ఒక్కరూ దీన్ని పోర్ట్‌ఫోలియోలోకి చేర్చుకోవచ్చు’’ అని మెహతా వివరించారు. 

 

ఫార్మా రంగంపై...

ఫార్మా రంగం విషయంలో ప్రతికూలంగా ఉన్నట్టు దీపేన్‌ మెహతా తెలిపారు. నియంత్రణ సంస్థ, మార్కెట్‌ శక్తుల కారణంగా జనరిక్‌ ధరలు తక్కువ స్థాయిలో ఉండడాన్ని కారణంగా పేర్కొ‍న్నారు. కనుక ఎగుమతుల మార్కెట్లపై ఆధారపడి ఉన్న మన దేశానికి చెందిన పెద్ద ఫార్మా కంపెనీల పట్ల ప్రతికూలంగా ఉన్నట్టు వివరించారు. అదే సమయంలో కాంట్రాక్టు తయారీలో ఇతర ప్రముఖ ఫార్మా కంపెనీలైన సువెన్‌, దివీస్‌ ల్యాబ్స్‌, డిష్‌మ్యాన్‌ ఫార్మా కంపెనీలను సిఫారసు చేశారు. వీటి వ్యాపార నమూనా భిన్నమైనదిగా గుర్తు చేశారు. మాలిక్యూల్స్‌ అభివృద్ధి, మూడు, నాలుగో దశ నుంచి వాణిజ్య ఉత్పత్తి వరకు ఈ కంపెనీల పాత్ర ఉంటుందని, వీటివల్ల లబ్ధి పొందేవిగా పేర్కొన్నారు. అలాగే, భారత ఫార్మా ఎంఎన్‌సీలను కరెక్షన్‌లో కొనుగోలు చేయవచ్చని సూచించారు. ఈ విషయంలో పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ను సూచించారు. ఈ కంపెనీలోని ఫార్మా, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వ్యాపారాలను వేరు చేస్తే మైనారిటీ షేర్‌హోల్డర్లకు విలువ చేకూరుతుందని తెలిపారు. కాంట్రాక్టు తయారీతోపాటు, కౌంటర్‌లో విక్రయించే ఫార్మా ఉత్పత్తుల్లో ఉన్న ఈ కంపెనీకి మంచి వృద్ధి అవకాశాలున్నాయని పేర్కొ‍న్నారు.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నష్టాల్లో ముగింపు

Saturday 8th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం నష్టాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 50 పాయింట్ల నష్టంతో 11,584 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో శుక్రవారం నాటి ముగింపు 11,632 పాయింట్లుగా ఉంది. నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌తో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో ముగిసిందని గమనించాలి. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిప్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే

ట్రేడింగ్‌ వేళల పెంపుపై ఏకాభిప్రాయం కీలకం

Saturday 8th September 2018

ప్రధాన స్టాక్‌ ఎక్సేంజీల ట్రేడింగ్‌ వేళల్ని అర్ధరాత్రి వరకు పెంచాలన్న ప్రతిపాదనను బ్రోకర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సెబీ కోరుతోంది. మరోసారి బ్రోకర్లతో ఇదే అంశంపై చర్చించాలని ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలను సెబీ కోరింది. ట్రేడింగ్‌ వేళలను పెంచడం అన్నది ఏకాభిప్రాయం మేరకు ఉండాలని, ఇందుకు వారి అభిప్రాయాలు కీలకమన్నది సెబీ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.    బ్రోకర్లు, స్టాక్‌ ఎక్సేంజ్‌లు ఒకే తాటిపైకి

Most from this category