News


బుల్లిష్‌ సంకేతాలు ఇవే..?

Sunday 9th June 2019
Markets_main1560104178.png-26186

నిఫ్టీ, సెన్సెక్స్‌ ఎన్నికల ఫలితాల తర్వాత నూతన గరిష్ట స్థాయిలకు దూసుకుపోయాయి. స్థిరమైన ప్రభుత్వం, మునుపటి విధానాల కొనసాగింపు, బలమైన నిర్ణయాలకు అవకాశం ఇన్వెస్టర్లను కొనుగోళ్ల వైపు కదిలించింది. 2014లో స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ గరిష్టాలకు ర్యాలీ చేయడాన్ని చూశాం. మరి 2014తో పోలిస్తే మరింత బలమైన మెజారిటీతో ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో 2019లోనూ అదే తరహా ర్యాలీ ఉంటుందని అంచనా వేయడం సహజం. నిజానికి ఆ దిశగా మార్కెట్లు సంకేతాలు కూడా ఇచ్చాయంటున్నారు నిపుణులు.  

 

నిఫ్టీకి వెలుపలి స్టాక్స్‌ ర్యాలీ చేయడం అన్నది మొదటి సంకేతంగా పేర్కొంటున్నారు. నాన్‌ నిఫ్టీ స్టాక్స్‌ ధరలు, వ్యాల్యూమ్‌ కదలికల్లో మార్పులపై చేసిన ఓ అధ్యయనం... మెగా క్యాప్‌ స్టాక్స్‌కు వెలుపల అవకాశాల కోసం ఇన్వెస్టర్లు రిస్క్‌ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. గడిచిన కొన్ని సెషన్లలో మిడ్‌క్యాప్‌ వ్యాల్యూమ్స్‌, మొత్తం ఎన్‌ఎస్‌ఈ వ్యాల్యూమ్‌లతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. నిఫ్టీ వ్యాల్యూమ్స్‌లో 37-38 శాతానికి పడిపోయిన తర్వాత, అక్కడి నుంచి ఇవి ప్రస్తుతం 50 శాతాన్ని అధిగమించినట్టు సంబంధిత అధ్యయనం తెలిపింది. సాధారణంగా ఇన్వెస్టర్లలో రిస్క్‌ తీసుకునే సామర్థ్యం తగ్గిపోయినప్పుడు మొత్తం వ్యాల్యూమ్స్‌లో నిఫ్టీ-50 స్టాక్స్‌ వ్యాల్యూమ్స్‌ అధిక భాగంగా ఉంటుంది. 2018లో ఇదే చూశాం. ఎన్‌ఎస్‌ఈ వ్యాల్యూమ్స్‌లో 60 శాతం నిఫ్టీ-50వే ఉన్నాయి. అలాగే, రిస్క్‌ తీసుకునేందుకు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చినప్పుడు ఈ పరిస్థితి మారిపోతుంది. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ బాగా ర్యాలీ చేసిన 2017లో, ఎన్‌ఎస్‌ఈ మొత్తం వ్యాల్యూమ్స్‌లో నిఫ్టీ వ్యాల్యూమ్‌లు 38.6 శాతానికి తగ్గాయి. మిడ్‌క్యాప్‌వైపు ఇన్వెస్టర్లు చూస్తుండడం అది భవిష్యత్తు బుల్లిష్‌ సెంటిమెంట్‌కు సంకేతమని, ఇన్వెస్టర్లు రిస్క్‌వైపు అడుగులు వేస్తున్నారని ప్లస్‌ డెల్టా ఫోర్ట్‌ఫోలియోస్‌ ఫండ్‌ మేనేజర్‌ ఆదిత్య అయ్యర్‌ పేర్కొన్నారు. 

 

కొన్ని సంవత్సరాలుగా బాగా దిద్దుబాటుకు గురైన రంగాలు తిరిగి ఊపు సంతరించుకుంటున్నాయి. ఉదాహరణకు నిఫ్టీ రియల్టీ సెక్టార్‌ పదేళ్లుగా క్షీణతలో ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరి కనిష్టాల నుంచి 22 శాతం ర్యాలీ చేసింది. నిఫ్టీ పీఎస్‌యూ సూచీ ఫిబ్రవరి కనిష్టాల నుంచి 31 శాతం ర్యాలీ చేసింది. అలాగే, చాలా స్టాక్స్‌ ఇటీవలి కనిష్ట స్థాయిల నుంచి ర్యాలీ చేయడం చాలా వేగవంతమైన ర్యాలీగా నిపుణులు పేర్కొంటున్నారు. మొన్నటి వరకు కేవలం కొన్ని స్టాక్స్‌ ర్యాలీపైనే మార్కెట్లు ఆధారపడి నడవడగా, ఇప్పుడు ఈ ర్యాలీ విస్తృతంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇది మిడ్‌క్యాప్‌ చక్కని పనితీరు చూపనుందడనానికి సంకేతంగా పేర్కొంటున్నారు. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగాలు లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే ఇటీవలి వరకు చాలా ప్రతికూల పనితీరును చూపించాయి. ఇప్పటికీ చాలా స్టాక్స్‌ వాటి 52 వారాల గరిష్ట స్థాయితో పోలిస్తే సగం మేర తక్కువలోనే ట్రేడవుతున్నాయి. వ్యాల్యూషన్‌ అంతరం కూడా గరిష్ట స్థాయికి చేరడం గమనార్హం. మిడ్‌క్యాప్‌ ఫార్వార్డ్‌ పీఈ ప్రస్తుతం నిఫ్టీ ఫార్వార్డ్‌ పీఈతో పోలిస్తే 19శాతం తక్కువలో ఉందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఈ అంశాలన్నీ త్వరలో బుల్‌ మార్కెట్‌కు, మిడ్‌, స్మాల్‌క్యాప్‌ ర్యాలీని తెలియజేసేవిగా చెబుతున్నారు.You may be interested

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Monday 10th June 2019

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో సోమవారం భారత్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 316 పాయింట్ల పెరుగుదలతో 39,930 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 93 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,963 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. యస్‌బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, వేదాంత షేర్లు 2 శాతం వరకూ ప్రారంభలాభాల్ని ఆర్జించగా, ఐఓసీ, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, ఎం అండ్‌ ఎంలు స్వల్పంగా నష్టపోయాయి. 

ఈ స్టాక్స్‌లో నిఫ్టీకి మించి రాబడులు...!

Sunday 9th June 2019

రానున్న నాలుగు త్రైమాసికాల్లో నిఫ్టీకి మించి అధిక రాబడులు యస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు తదితర స్టాక్స్‌లో వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్టు ఈక్విటీ99 వ్యవస్థాపకుడు సుమిత్‌ బిల్‌గయాన్‌ తెలిపారు. మార్కెట్ల కదలికలపై స్పందిస్తూ... బీఎస్‌ఈ పీఈ 2018-19లో 24పీఈ వద్ద ఉందని, అది 2020 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 28.3పీఈకి చేరిందన్నారు. ఎన్‌పీఏలకు కేటాయింపులు గరిష్ట స్థాయికి చేరడం, ఆస్తుల నాణ్యత మెరుగుపడడంతో బ్యాంకుల ఎర్నింగ్స్‌ వృద్ధి

Most from this category