STOCKS

News


మరింత పతనం మిగిలే ఉంది!

Tuesday 9th October 2018
Markets_main1539081687.png-20982

నోమురా హెచ్చరిక
భారత స్టాక్‌ మార్కెట్లలో మరో 5- 10 శాతం పతనం సంభవించే అవకాశాలను తోసిపుచ్చలేమని  ప్రముఖ బ్రోకరేజ్‌ దిగ్గజం నోమురా అభిప్రాయపడింది. దేశీయ మార్కెట్ల వాల్యూషన్లు ఇంకా ఖరీదుగానే ఉన్నాయని తెలిపింది. తాజా పతనంలో వాల్యూషన్లు కరిగిపోయినా, ఇంకా మరింత దిగిరావాల్సిఉందని పేర్కొంది. ఆగస్టులో 18.8 శాతమున్న వాల్యూషన్లు పతనానంతరం అక్టోబర్‌ నాటికి 16 శాతానికి దిగివచ్చాయి. వచ్చే ఏడాది జూన్‌ నాటికి నిఫ్టీ 11892 పాయింట్లకు, సెప్టెంబర్‌ నాటికి 11270 పాయింట్ల దగ్గరకు చేరవచ్చని అంచనా వేసింది. ఇప్పటికీ బాండ్‌ ఈల్డ్స్‌', ఎర్నింగ్స్‌ ఈల్డ్స్‌ మధ్య వ్యత్యాసం దీర్ఘకాలిక సరాసరి కన్నా దిగువనే ఉందని నోమురా తెలిపింది. అధిక వాల్యూషన్లకు ఇది ఒక సూచికని తెలిపింది. క్రూడాయిల్‌ ధరల పెరుగుదలతో వాణిజ్యలోటు విస్తరించడం, ఎన్‌బీఎఫ్‌సీల్లో లిక్విడిటీ సమస్య.. ఆర్థికవృద్ధికి ఆటంకాలుగా మారాయని అభిప్రాయపడింది. ఎకానమీలో మందగమనం ఎర్నింగ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంచనా వేసింది. చమురు ధరల పెరుగుదలను తట్టుకునేందుకు ఓఎంసీలపై ప్రభుత్వం భారం మోపడం కూడా ఎర్నింగ్స్‌ వృద్ధికి ప్రతికూలమని హెచ్చరించింది. 



You may be interested

ఈ షేర్లలో ఎంఏసీడీ పాజిటివ్‌ క్రాసోవర్‌

Tuesday 9th October 2018

సోమవారం ముగింపు ప్రకారం 15 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో టైటాన్‌, తల్వాకర్స్‌, భన్సాలీ ఇంజనీరింగ్‌, ఏస్టర్‌, గుజరాత్‌ పిప్‌వావ్‌, వైస్రాయ్‌ హోటల్స్‌, తైజారియా, మొరార్జి, టేక్‌ సొల్యూషన్స్‌, గోకుల్‌ ఆగ్రో తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ,

కరెక్టివ్‌ బౌన్స్‌కు ఛాన్స్‌!!

Tuesday 9th October 2018

మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోందన్నారు నర్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ హెడ్‌ (టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్‌ రీసెర్చ్‌) షబ్బీర్‌ కైయుమి తెలిపారు. గత శుక్రవారం నిప్టీ ఇండెక్స్‌ 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ కిందకు వచ్చేసిందని, ఆరు నెలల కనిష్ట స్థాయి వద్ద క్లోజయ్యిందని పేర్కొన్నారు. క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి క్షీణత అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని తెలిపారు. ఇండియా వీఐఎక్స్‌ గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతోందని, ఇది మార్కెట్‌లో అధిక

Most from this category