STOCKS

News


క్రాస్‌ కరెన్సీ లావాదేవీలపై ఫీజు రద్దు మరో ఏడాది పొడిగింపు

Wednesday 5th September 2018
Markets_main1536124515.png-19967

న్యూఢిల్లీ: క్రాస్‌ కరెన్సీ డెరివేటివ్‌ల లావాదేవీలపై ఫీజు తొలగింపును వచ్చే ఏడాది ఆగస్టు వరకూ పొడిగిస్తున్నామని బాంబే స్టాక్‌  ఎక్స్చేంజ్‌(బీఎస్‌ఈ) తెలిపింది. ఈ రంగంలో లావాదేవీలను మరింతగా  ప్రోత్సహించడానికి ఎలాంటి లావాదేవీల ఫీజులను వచ్చే ఆగస్టు వరకూ విధించబోమని పేర్కొంది.  క్రాస్‌- కరెన్సీ ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌  డెరివేటివ్‌లను బీఎస్‌ఈ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆరంభించింది. ఈ కాంట్రాక్టులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి గం.7.30ని. వరకూ అందుబాటులో ఉంటాయి. క్రాస్‌ కరెన్సీ సెగ్మెంట్లో లావాదేవీలకు ప్రోత్సాహం ఇవ్వడానికి గాను లావాదేవీల ఫీజులను రద్దు చేసింది. ఈ ఏడాది ఆగస్టు 31 వరకూ ఇది వర్తిస్తుందని పేర్కొంది. మార్కెట్‌ నుంచి లభించిన స్పందనను బట్టి ఈ ఫీజు తొలగింపును మరో ఏడాదికి పొడిగిస్తున్నామని బీఎస్‌ఈ తాజాగా తెలిపింది. 



You may be interested

రెండు వారాల్లో కేబినెట్‌ మెందుకు టెలికం పాలసీ

Wednesday 5th September 2018

న్యూఢిల్లీ: నూతన టెలికం పాలసీ రెండు వారాల్లో కేబినెట్‌ ఆమోదానికి రానున్నట్లు ఆ శాఖ కార్యదర్శి అరుణ సౌందరాజన్‌ తెలిపారు. అంతర్గత మంత్రిత్వ శాఖల సంప్రదింపులు ముగిశాయని, కేబినెట్‌ ఆమోదానికి సమర్పించడానికి ముందు తుది మెరుగులు దిద్దుకుంటోందని చెప్పారామె. నేషనల్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ పాలసీ (ఎన్‌డీసీపీ) అయిన దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే బహిర్గత పరిచింది. టెలికం రంగంలో కొత్తగా రూ.6.5 లక్షల మేర పెట్టుబడులను ఆకర్షించడం, 2022 నాటికి

1200 డాలర్ల దిగువన పసిడి

Wednesday 5th September 2018

ప్రపంచమార్కెట్లో బుధవారం పసిడి ధర 1200 డాలర్ల దిగువన ట్రేడవుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ 2వారాల గరిష్టానికి చేరుకోవడం అందుకు కారణమవుతోంది.  గతరాత్రి అమెరికాలో విడుదలైన పలు ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో డాలర్‌ ఇండెక్స్‌ పుంజుకుంది. ఫలితంగా అక్కడ మార్కెట్లో ఔన్స్‌ పసిడి వారంరోజుల కనిష్టస్థాయి 1,189.20 డాలర్ల వరకు నష్టపోయింది. చివరకు 1,199.1డాలర్ల వద్ద ముగిసింది. ఇక బుధవారం ఉదయం ఆసియా మార్కెట్లో 1,197.10 డాలర్ల వద్ద

Most from this category