News


ఈ పతనం ఆగనిది..

Wednesday 10th October 2018
news_main1539157632.png-21014

రూపీ క్షీణత వచ్చే ఏడాది కూడా కొనసాగుతుంది
రాయిటర్స్‌ నివేదిక
భారత కరెన్సీ మరికొంత కాలం తాజా కనిష్ఠాలకు అటుఇటుగానే కదలాడవచ్చని రాయిటర్స్‌ పోల్‌లో ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది సైతం రూపాయి ఇదే స్థాయిలకు అటుఇటుగా ఉండొచ్చని, ఎలాంటి భారీ రికవరీ ఆశించలేమని అంచనా వేశారు. డిసెంబర్‌లో, వచ్చే ఏడాది రేట్లు పెంచుతామని ఆర్‌బీఐ తన తాజా సమీక్షా సమావేశం అనంతరం వెల్లడించింది. ఆర్‌బీఐ రేట్లు పెంచినా ఎలాంటి ఫలితం ఉండదని, రూపీ బలహీనత వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని పోల్‌ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది రూపాయి ఇంతవరకు దాదాపు 16 శాతం క్షీణించింది. ట్రేడ్‌ వార్‌ భయాలు, ఫెడ్‌రేట్ల పెంపుదల కారణంగా డాలర్‌ ఈ ఏడాది మంచి ర్యాలీ చూపుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ అక్టోబర్‌లో 74 స్థాయిని కూడా దాటేసింది. అక్టోబర్‌ సమీక్షా సమావేశంలో ఆర్‌బీఐ రేట్లను పెంచుతుందని ఎక్కువమంది భావించారు. కానీ యథాతధ స్థితి కొనసాగిస్తామని ఆర్‌బీఐ ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా రూపాయిపై మరింత ఒత్తిడి పెరిగింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను, ఫెడ్‌ రేట్లపెంపు ప్రభావాన్ని ఆర్‌బీఐ తక్కువగా అంచనా వేస్తోందని రాబో బ్యాంక్‌ అభిప్రాయపడింది. క్రూడ్‌ ధర పెరుగుదల, రూపీ పతనంతో విస్తృతమవుతున్న కరెంట్‌ఖాతాలోటును కట్టడి చేసేందుకు, రూపీ పతనాన్ని అడ్డుకునేందుకు రేట్ల పెంపుదల మంచి మార్గమని ఎక్కువమంది నిపుణులు భావిస్తున్నారు. ఆర్‌బీఐ మాత్రం వచ్చే సమావేశంలో ఆపై సమావేశంలో రేట్లను పెంచుతాయమని సంకేతాలు ఇచ్చింది. సరైన సమయంలో స్పందిచకపోవడం ఆర్‌బీఐ చేస్తున్న తప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రూపాయి 75 స్థాయికి వెళుతుందని అంచనా వేస్తున్నామని డీబీఎస్‌ గ్రూప్‌ తెలిపింది. రాబోయే కాలంలో రూపాయి గరిష్ఠ, కనిష్ఠ స్థాయిలు 78, 68గా ఎక్కువమంది నిపుణులు సర్వేలో అంచనా వేశారు. మరోవైపు రూపాయిని ఆదుకునేందుక విదేశాల్లో నివశిస్తున్న భారతీయుల సహాయం తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఎన్‌ఆర్‌ఐల నుంచి నిధుల సమీకరణకు ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరుకు ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. You may be interested

బాండ్లు, రూపీకి ఆర్‌బీఐ బూస్ట్‌

Wednesday 10th October 2018

ప్రస్తుత పరిస్థితుల్లో లిక్విడిటీకి మద్దతునిచ్చే ఎలాంటి చర్య అయినా ఆహ్వానించదగినదేనని కోటక్‌ ఎంఎఫ్‌ సీఐవో (ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌), హెడ్‌ (ప్రొడక్ట్స్‌) లక్ష్మీ ఐయ్యర్‌ తెలిపారు. ఆమె ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్‌బీఐ ఈ నెలలో రూ.36,000 కోట్ల మేర విలువైన బాండ్లను ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించుకుందని, అందులో భాగంగానే అక్టోబర్‌ 11న రూ.12,000 కోట్లు ప్రభుత్వ బాండ్లను కొనుగోలు

మెప్పించని గార్డెన్‌ రీచ్‌ లిస్టింగ్‌

Wednesday 10th October 2018

12శాతం డిస్కౌంట్‌తో లిస్టింగ్‌ ముంబై:- ఇటీవల ఐపీఓ ప్రక్రియను పూర్తి చేసుకున్న గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ లిస్టింగ్‌లో మార్కెట్‌ వర్గాలను మెప్పించలేకపోయింది. ఇష్యూ ధర రూ.118తో పోలిస్తే బీఎస్‌ఈలో 12శాతం(రూ.16లు) డిస్కౌంట్‌తో రూ.104.00ల వద్ద లిస్టైంది. ఇష్యూలో ఐపీఓకు అంతం స్పందన రావడంతో ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపలేదు. ఫలితంగా షేరు ఇంట్రాడేలో 19శాతం నష్టపోయి రూ.95.35ల స్థాయికి చేరుకుంది. ఉదయం గం.11:45ని.లకు షేరు బీఎస్‌ఈలో 15శాతం నష్టంతో రూ.99.85ల

Most from this category