STOCKS

News


అన్ని రంగాలదీ అదే బాట!

Saturday 16th February 2019
Markets_main1550309395.png-24221

ఒకదాని వెంట ఒకటిగా పతనమవుతున్న షేర్లు
దేశీయ మార్కెట్లు ఈ ఏడాది సుదీర్ఘ నష్టాల వారాన్ని నమోదు చేస్తున్నాయి. వరుసగా ఏడు రోజులుగా సూచీలు పతనమవుతున్నాయి. లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ అనే తేడా లేకుండా ఒకదాని వెంట ఒకటిగా అన్ని స్టాకులు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల విశ్వాసం రోజురోజుకీ దెబ్బతింటూ వస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ బాగానే ఉన్నా, ప్రభుత్వం బడ్జెట్లో వినిమయ ప్రోత్సాహక చర్యలు ప్రకటించినా, ఆర్‌బీఐ రేట్లు తగ్గించినా.. మార్కెట్లలో మాత్రం ఉత్సాహం కలగడంలేదు. రాబోయే సాధారణ ఎన్నికలపై భయాలే ఇన్వెస్టర్లను అడ్డుకుంటున్నాయి. మరోవైపు తాజాగా కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దేశీయ మార్కెట్లలో ఈ ధోరణి మరికొన్నాళ్లుంటుందని మార్కెట్‌నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడు సెషన్లలో సూచీలు దాదాపు 3 శాతానికి పైగా నష్టపోయాయి. 
ఎన్నికల ముందు సాధారణంగా కొద్దిపాటి ర్యాలీ ఉంటుందని, కానీ తాజా టెర్రర్‌ అటాక్‌ సెంటిమెంట్‌ను దెబ్బకొట్టిందని యస్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి అమర్‌ అంబానీ చెప్పారు. కొన్ని బడా దిగ్గజ కంపెనీల ఫలితాలు పేలవంగా ఉండడం కూడా ఇన్వెస్టర్లను నిరుత్సాహపరిచిందన్నారు. దీంతో ప్రతిరోజు ఒక కొన్ని లార్జ్‌క్యాప్స్‌ పతనమవుతూ వస్తున్నాయని చెప్పారు. దీంతో ఇన్వెస్టర్లు ఏ రంగానికి చెందిన కంపెనీల షేర్లను నమ్ముకోవాలో, ఏవి రక్షణాత్మక స్టాకులో అర్ధం కాక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

సూచీలు చూడడానికి 3 శాతం మాత్రమే పతనమైనా, పోర్టుఫోలియోలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. ఈ నష్టాల పరంపరలో సెన్సెక్స్‌లోని అన్ని సూచీలు పతనంలోకే పయనించాయి. అన్నింటికన్నా ఎక్కువగా మెటల్స్‌ సూచీ 5.82 శాతం, చమురు సూచీ 5.76 శాతం, ఆటో సూచీ 5.20 శాతం నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ స్టాకులు కూడా కరెక‌్షన్‌కు రెడీ అవుతున్నాయని, బ్యాంకింగ్‌ రంగంలో బలహీనత కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. వర్ధమాన మార్కెట్లలోకి ఈ ఏడాది భారీగా విదేశీ నిధులు ప్రవహించాయి. కానీ భారత మార్కెట్‌పై ఇంకా ఎఫ్‌పీఐలు మొగ్గు చూపలేదు. దీంతో కొనుగోళ్ల మద్దతు దొరక్క షేర్ల పతనం కొనసాగుతోంది. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఇదే ధోరణి ఉండొచ్చని, ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. You may be interested

యస్‌ బ్యాంక్‌కు ఆర్‌బీఐ వార్నింగ్‌

Saturday 16th February 2019

రహస్యంగా ఉంచాల్సిన నివేదికలో కొంత భాగాన్ని బహిర్గతం చేయడం పట్ల యస్‌బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్‌ఏఆర్‌(రిస్క్‌ అసెస్‌మెంట్‌ రిపోర్ట్‌)లో అంశాలను అందరికీ తెలియజేయడమనేది కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యగా అభివర్ణించింది. ఇందుకుగాను యస్‌బ్యాంక్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆర్‌బీఐ వార్నింగ్‌ లెటర్‌ పంపినట్లు యస్‌బ్యాంక్‌ తాజాగా స్టాక్‌ఎక్చేంజ్‌లకు వెల్లడించింది. బ్యాంకు పనితీరులో ఇంకా అనేక లొసుగులు, నియంత్రణా ఉల్లంఘనలు ఉన్నాయని ఆర్‌ఏఆర్‌ గుర్తించినట్లు తెలిపింది.

నిధుల వెల్లువ రానుంది!

Saturday 16th February 2019

దేశీ మార్కెట్‌పై జీటీఐ క్యాపిటల్‌ భారత్‌ మార్కెట్లో పెట్టుబడులకు విదేశీ మదుపరులు చాలా పెద్దమొత్తంలో నిధులు పెట్టుకొని కూర్చొని ఉన్నట్లు జీటీఐ క్యాపిటల్‌ ప్రతినిధి మాధవ్‌ ధార్‌ చెప్పారు. గతేడాది ఎఫ్‌పీఐలు ఇండియా మార్కెట్ ప్రదర్శనతో నిరుత్సాహపడ్డారన్నారు. అయితే క్రమంగా దేశీయ ఎకానమీ బిజినెస్‌ ఫ్రెండ్లీగా, ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీగా మారిపోతోందని గుర్తిస్తున్నారన్నారు. ఇప్పటికింకా సంస్కరణల ఫలాలు పూర్తిగా కనిపించడంలేదని, అందుకే 7 శాతానికి అటుఇటుగా వృద్ధి నమోదవుతోందని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో

Most from this category