STOCKS

News


అర్ధంపర్ధం లేని వాల్యూషన్లు!

Tuesday 19th March 2019
Markets_main1552990296.png-24693

మార్కెట్‌పై కోటక్‌ ఈక్విటీస్‌ అభిప్రాయం
ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువమంది ఆలోచనకు భిన్నమైన ఆలోచనను కోటక్‌ ఈక్విటీస్‌ వెలువరించింది. ప్రస్తుత మార్కెట్లో వాల్యూషన్లు అర్ధరహితంగా ఉన్నాయని, చాలా విభాగాలు ఏమాత్రం ఆకర్షణీయంగా లేవని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. అందువల్ల వీలయినంతవరకు బలహీనమైన రంగాలు, అధిక వాల్యూషన్లు ఉన్న రంగాలు, స్టాకుల నుంచి వైదొలుగుతున్నామని కోటక్‌ వెల్లడించింది. మార్చి ఆరంభంలో స్టార్టయిన తాజా ర్యాలీలో అనేక స్టాకులు పాలుపంచుకుంటున్నాయి. కానీ కొన్ని ఫైనాన్షియల్‌ స్టాకులు, కొన్ని పీఎస్‌యూలు మినహా పలు రంగాల స్టాకులు ఏ మాత్రం ఆకర్షణీయంగా లేవని కోటక్‌ అభిప్రాయపడింది. అందువల్ల వీలయినంతవరకు తాజా ర్యాలీని అమ్మకాలకు ఉపయోగించుకుంటున్నట్లు తెలిపింది. చాలా బ్రోకింగ్‌ సంస్థలు ప్రస్తుత మార్కెట్‌పై పాజిటివ్‌గా ఉన్నాయి. ప్రీఎలక‌్షన్‌ ర్యాలీ మరింత కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా గోల్డ్‌మన్‌ సాక్స్‌ సైతం ఇదే అభిప్రాయం వెలుబుచ్చింది. తాజా ర్యాలీకి ఎన్‌డీఏ ప్రభుత్వం మరలా వస్తుందన్న ఆశలే కారణమని కోటక్‌ తెలిపింది. దీనికితోడు వర్ధమాన మార్కెట్లు ఈ ఏడాది జరిపిన ప్రదర్శనతో పోలిస్తే ఇండియా వెనుకబడిఉందని, అందువల్లే తాజాగా ర్యాలీ వచ్చిందని కోటక్‌ తెలిపింది. ఎర్నింగ్స్‌పై ఆశలు, రీరేటింగ్‌ ఆశలు, ఫైనాన్షియల్స్‌లో రికవరీ తదితర కారణాలు కూడా మార్కెట్లను ముందుకు నడిపాయని, కానీ వాల్యూషన్లు మాత్రం ఏమాత్రం ఆకట్టుకునేలా లేవని వ్యాఖ్యానించింది. ఇప్పటికే జరిపిన ర్యాలీతో పలు స్టాకుల రిస్కురివార్డు నిష్పత్తి బాగా తగ్గిపోయిందని, అందువల్ల ఎలాంటి కొత్త కొనుగోళ్లకు మొగ్గు చూపడం లేదని పేర్కొంది. 



You may be interested

భారీ లాభాల్లో ప్రభుత్వరంగ షేర్లు

Tuesday 19th March 2019

వరుసగా మూడో రోజూ ప్రభుత్వరంగ షేర్ల ర్యాలీ కొనసాగింది. బ్రోకరేజ్‌ సం‍స్థలు ఈ రంగ బ్యాంకులపై రేటింగ్‌ పెంచడం కలిసొచ్చింది. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం మూలధన కేటాయింపుతో కొంతమేర ఉపశమనం కలుగుతుందనే అంచనాలతో ఆయా బ్యాంకులకు బ్రోకరేజ్‌ సంస్థలు రేటింగ్‌ను పెంచాయి. ఇక్రా రేటింగ్‌ సంస్థ బ్యాంకు ఆఫ్‌ బరోడా, పీఎన్‌బీ, ఓబీసీలకు గతంలో తాము కేటాయించిన నెగిటివ్‌ రేటింగ్‌ను స్థిరత్వంగా సవరించినట్లు ఒక ప్రకటనలో

మిడ్‌క్యాప్స్‌లో మరో 30 శాతం ర్యాలీ!

Tuesday 19th March 2019

ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా ఫిబ్రవరి కనిష్ఠాల నుంచి ఇప్పటికి మిడ్‌క్యాప్‌ సూచీ దాదాపు 12 శాతం కోలుకుంది. అయితే ఈ పరుగులు ఇంకా కొనసాగుతాయని, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ మరో 30 శాతం మేర ర్యాలీ జరిపే ఛాన్సులున్నాయని ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా వేసింది. గతంలో మిడ్‌క్యాప్స్‌లో వచ్చిన భారీ పతనాలు 14 నెలలకు పూర్తయ్యాయని, ఆ తర్వాత మిడ్‌క్యాప్‌ సూచీ దాదాపు 40 శాతం వరకు ర్యాలీ జరిపిన చరిత్ర ఉందని

Most from this category