రూపీ పతనం.. అసలు కారణం లిరా కాదు..
By Sakshi

ఇండియన్ రూపాయి పతనానికి టర్కీస్ లిరా, అమెరికా డాలర్ బలోపేతమవ్వడం వంటి అంశాలు ప్రధాన కారణం కాదని చెబుతున్నారు ఏఎన్జెడ్ ఆసియా రీసెర్చ్ హెడ్ ఖూన్ గోహ్. ఆసియాలో విస్తరిస్తున్న నెగిటివ్ సెంటిమెంట్, వర్ధమాన మార్కెట్లు బలహీనంగా ఉండటం వంటి అంశాలు రూపాయి పతనానికి కారణమని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ‘టర్కీ కరెన్సీ లిరా భారీగా పతనమైంది. యూరో కూడా ఏడాది కనిష్టానికి పడిపోయింది. టర్కీ సంక్షోభ భయాలు యూరోపియన్ బ్యాంకులపై కూడా ఉంటుందనే అంచనాలున్నాయి. ఇది వాటి బ్యాలెన్స్ షీట్లపై ప్రతిఫలించొచ్చు’ అని వివరించారు. ఈ మొత్తం విషయాన్ని పరిశీలిస్తే.. ఇక్కడ డాలర్ బలపడినట్లు కాదని పేర్కొన్నారు. మరోవైపు వర్ధమాన మార్కెట్లు కూడా బలహీనంగా ఉన్నాయని, టర్కీ నుంచి ఆసియాలోకి నెగటివ్ సెంటిమెంట్ వ్యాపించిందని తెలిపారు. రూపాయి 69 స్థాయిని అధిగమించడానికి ఇదే అసలైన కారణమని పేర్కొన్నారు. టర్కీ కరెన్సీ సంక్షోభం మనపై పరిమితంగానే ఉంటుందని, ఇది రూపాయిపై పరోక్షంగా ప్రభావం చూపితే.. యూరో పతనం ప్రత్యక్షంగా ప్రభావం చూపిందని తెలిపారు.
టర్కీ ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితులను అధిమించడానికి ఎలాంటి చర్యలు చేపడుతుందనే అంశంపై ఆధారపడి తదుపరి పరిణామాలు ఉంటాయని ఖూన్ పేర్కొన్నారు. పరిస్థితులను ఎదుర్కొనేందుకు అక్కడి ప్రభుత్వం వద్ద స్పష్టమైన ప్రణాళికలు లేన్నట్లే కనిపిస్తుందన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పెద్ద ప్రమాదమే ఉంటుందని అంచనా వేశారు. అయితే ఇతర దేశాల మార్కెట్ల ర్యాలీ ఆయా దేశాల బలమైన ఆర్థిక వృద్ధి కారణంగానే జరిగిందని, వీటిపై టర్కీ ప్రభావం లేదని తెలిస్తే సమస్య ఉండదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వసనీయత అనేది చాలా కీలకమని పేర్కొన్నారు. టర్కీ అసెట్స్‌పై విశ్వాసం సన్నగిల్లిందని, అయితే యూరోపియన్ బ్యాంకులపై నమ్మకముంచడం చాలా ముఖ్యమని తెలిపారు. యూరోలో ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ గమనిస్తే.. మార్కెట్లపై యూరోపియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ల ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు.
You may be interested
హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్ కొనొచ్చా?
Monday 13th August 2018సోమవారం ట్రేడింగ్‌లో హెచ్‌డీఎఫ్‌సీబ్యాంకు షేరు దాదాపు 2 శాతం పతనమైంది. బ్యాంకు డిప్యుటీ ఎండీ పరేశ్ సుక్తాంకర్ రాజీనామా ప్రభావం బ్యాంకు షేరుపై పడింది. పరేశ్ రాజీనామా వార్తతో బ్యాంకు ఏడీఆర్ శుక్రవారం అమెరికా మార్కెట్లో భారీగా నష్టపోయింది. దాదాపు రెండు దశాబ్దాలు పరేశ్ బ్యాంకుకు సేవలనందించారు. ఈ నేపథ్యంలో బ్యాంకు షేరు మరింత పతనం కావచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో 2- 3 శాతం షేరు
28,000 దిగువకు బ్యాంక్ నిఫ్టీ
Monday 13th August 2018ముంబై:- ఎన్ఎస్ఈలో కీలకమైన నిఫ్టీ బ్యాంకు సూచీ సోమవారం ట్రేడింగ్‌లో 1శాతానికి పైగా పతనమై 28వేల మార్కును కోల్పోయింది. నేడు ఈ సూచీ 27,760 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేటి మార్కెట్ పతనంలో భాగంగా బ్యాంకు షేర్లు నష్టాల బాట పట్టడంతో ఇటీవల అందుకున్న నిఫ్టీ బ్యాంకు 28వేల పాయింట్ల మార్కును కోల్పోయింది. ఈ సూచీలోని హెవీ వెయిటేజ్ షేర్లైన హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యస్‌బ్యాంకు,