News


ఎన్‌ఎండీసీకి జేపీ మోర్గాన్‌ బై రేటింగ్‌

Monday 19th November 2018
Markets_main1542621424.png-22188

దొనిమలై మైనింగ్‌ ప్లాంట్‌ ఐరన్‌ ఓర్‌ అమ్మకాలపై కర్ణాటక ప్రభుత్వం అధిక పన్నును విధించినప్పటికి ఎన్‌ఎండీసీ షేరుకు ప్రముఖ రేటింగ్‌ సంస్థ జేపీమోర్గాన్‌ బై రేటింగ్‌ను కేటాయించింది. ఎన్‌ఎండీసీ సంస్థ దొనిమలై మైనింగ్‌ నుంచి ఏడాదికి 6మిలియన్‌ టన్నుల ఖనిజం ఉత్పత్తవుతుంది. అయితే ఈ మైనింగ్‌ లైసెన్సు పొడిగింపునకు ఎన్‌ఎండీసీపై కర్నాటక ప్రభుత్వం...ఫీజుపై 80 శాతం ప్రీమియం విధించింది.  ఈ ప్రీమియం చెల్లింపునకు ఎన్‌ఎండీసీ ఇప్పటివరకూ అంగీకారం తెలపలేదు. ప్రీమియం చెల్లించకపోతే లీజును రద్దు చేసేందుకు ప్రభుత్వం ఏమాత్రం వెనకాడబోదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఎండీసీని హెచ్చరించింది.  దొనిమలై మైనింగ్‌ ఐరన్‌ ఓర్‌పై సందిగ్గత నెలకొన్నా,  రేటింగ్‌ సంస్థ జేపీ మోర్గాన్‌ మాత్రం షేరు ధర మరో ఏడాదిలో రూ.145ల స్థాయికి చేరుకుంటుందని అంచనావేస్తుంది. ఈ అంచనా ధర ప్రస్తుత ట్రేడింగ్‌ ధరకు 43శాతం అధికం కావడం విశేషం.
నేడు ఎన్‌ఎండీసీ షేరు స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. మధ్యాహ్నం గం.3:15నిల.కు షేరు గత ముగింపు ధర రూ.100.6లతో పోలిస్తే అరశాతం స్వల్ప లాభంతో రూ.101ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.You may be interested

3 వారాల్లో లాభాలందించే 10 స్టాక్స్‌

Monday 19th November 2018

బ్రోకరజ్‌ సంస్థలు వచ్చే మూడు వారాల్లో లాభాలను అందించగలిగే 10 స్టాక్స్‌ను సిఫార్సు చేశాయి. సిఫార్సుల వివరాలు.... ఆనంద్‌రాఠి అపోలో హాస్పిటల్‌: ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ రూ.1,350. స్టాప్‌ లాస్‌ రూ.1,190. టెక్నికల్‌గా చూస్తే ఈ స్టాక్‌ ఇన్‌వర్స్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచింది. బుల్లిష్‌ ట్రెండ్‌ను సూచిస్తోంది. వేవ్‌-4 పూర్తయ్యింది. వేవ్‌-5 ప్రారంభం కావొచ్చు.  కెనరా బ్యాంక్‌: ఈ స్టాక్‌ గత వారపు నిరోధ స్థాయి నుంచి

ఎన్‌సీసీలో 90% అప్‌సైడ్‌కు ఛాన్స్‌!!

Monday 19th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఎన్‌సీసీపై బుల్లిష్‌గా ఉంది. ఎందుకో చూద్దాం. బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: ఎన్‌సీసీ రేటింగ్‌: కొనొచ్చు ఇండస్ట్రీ: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రస్తుత ధర: రూ.88 టార్గెట్‌ ప్రైస్‌: రూ.168 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. ఎన్‌సీసీపై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.168గా నిర్ణయించింది. ప్రస్తుత ధర రూ.88తో పోలిస్తే దాదాపు 90 శాతం అప్‌సైడ్‌కు అవకాశముందని పేర్కొంది. కంపెనీ ప్రస్తుత క్యూ2లో బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించిందని

Most from this category