News


ఎన్‌ఎండీసీ 5శాతం డౌన్‌..!

Thursday 22nd August 2019
Markets_main1566460812.png-27948

ఎన్‌ఎండీసీ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.89.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. దొనమలై మైనింగ్‌ లీజ్‌ పొడిగింపును రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జాతీయ మైన్స్‌ ట్రిబ్యూనల్‌ స్టే విదించిప్పటి షేర్లు పతనం కొనసాగుతోంది. నేడు మిడ్‌సెషన్‌ సమయానికి ఈ కంపెనీ షేర్లు 5శాతానికి పైగా క్షీణించి రూ.81.70 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఇది షేరు ఏడాది కనిష్టస్థాయి కావడం గమనార్హం. అంతేకాక, లూప్‌, ఫైన్స్‌ ఐరన్‌ ఓర్‌ ధరలపై ప్రతి టన్నుకు రూ.200ల వరకు తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. మధ్యహ్నాం గం.12:45ని.లకు షేర్లు కిత్రం ముగింపు ధర(రూ.86.25)తో పోలిస్తే 5శాతం నష్టంతో రూ.82.00 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.81.70 రూ.124.30లుగా నమోదయ్యాయి. 



You may be interested

షార్ట్‌టర్మ్‌లో ర్యాలీ?.. నో ఛాన్స్‌!

Thursday 22nd August 2019

గ్లోబ్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ అంచనా ఎర్నింగ్స్‌ సీజన్‌లో చాలా కంపెనీలు అంచనాలను అందుకోలేని నేపథ్యంలో స్వల్పకాలంలో మార్కెట్లో ర్యాలీని ఆశించవద్దని గ్లోబ్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ హిమాంశు గుప్తా చెప్పారు. నిఫ్టీ ఇటీవలి కనిష్టాలను కాపాడుకోలేకపోతే క్రమంగా 10100- 10300 పాయింట్ల వరకు పతనం కావచ్చన్నారు. నిఫ్టీకి 10750- 10800 పాయింట్ల వద్ద మంచి మద్దతు ఉందని అంచనా వేశారు. ప్రపంచమార్కెట్లు సహకరించి, ప్రభుత్వం పాజిటివ్‌ ప్రకటన ఏమైనా చేస్తే సూచీలో

లాభల్లో ఎఫ్‌ఎంసీజీ..3% పెరిగిన బ్రిటానియా

Thursday 22nd August 2019

వివిధ రంగాలకు చెందిన స్టాకులలో అమ్మకాలు వెల్లువెత్తడంతో గురువారం దేశియ మార్కెట్‌ నష్టాల్లో ట్రేడవుతుంది. కాగా ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్‌మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌) షేర్లలో కొనుగొలు పెరగడంతో, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ మధ్యాహ్నాం 12.43 సమయానికి 0.75 శాతం పెరిగి 28,612.10 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో  హెవి వెయిట్‌ షేర్లయిన బ్రిటానియా ఇండస్ట్రీస్‌ 3.46 శాతం లాభపడి రూ. 2,393.50 వద్ద, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ 1.60 శాతం పెరిగి రూ.

Most from this category